
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం మోజులో భర్త, పిల్లలను వదిలేసి యువకుడితో వెళ్లిపోయింది. అతను మోజు తీరాక నిజస్వరూపం తెలియడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చెన్నై కొడుంగయూర్‌లోని చోళైయమ్మన్ కోయిల్ వీధికి చెందిన జెనిఫర్ (21), తిరునావుక్కరసు దంపతులకు కుమార్తె (4), కుమారుడు (2) ఉన్నారు ఉన్నారు. కొంత కాలంగా జెనిఫర్, తిరునావుక్కరసు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో జెన్నిఫర్ ఒంటరిగా జీవిస్తోంది. ఆమె పిల్లలిద్దరూ బంధువుల ఇంట్లో పెరుగుతున్నారు.
ఈ స్థితిలో పులియంతోప్పు ప్రాంతానికి చెందిన విజయ్‌తో జెనిఫర్‌కి పరిచయం ఏర్పడింది. ఏడాది నుంచి కొడుంగయూరులో అతనితో సహజీవనం చేస్తోంది. శనివారం సాయంత్రం పక్కింటి మహిళ జెనిఫర్ ఇంటికి వెళ్లి చూడగా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న కొడుంగయూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. కాగా విజయ్‌కు అంతకు ముందే పోర్కోడి అనే మహిళతో వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే విజయ్ నిజస్వరూపం తెలియంతో.. మనస్పర్థల కారణంగా జెనిఫర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment