గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | applications invited for ap gurukula vidyalayam | Sakshi
Sakshi News home page

గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published Thu, Jul 21 2016 8:12 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

applications invited for ap gurukula vidyalayam

బొబ్బిలి : ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని బొబ్బిలి, తాడిపూడిల్లో ఉండే గురుకుల పాఠశాలల్లో 6,7 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బొబ్బిలి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎ. దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ. 60 వేలు మించకూడదని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30లోగా గురుకులంలో అందజేయూలన్నారు. అర్హత గల వారికి ఆగస్టు 10న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. బొబ్బిలి గురుకులంలో ఆరో తరగతిలో  ఓసీ-1, బీసీ-ఏ-1, ఎస్సీ-4, ఎస్టీ-1, ఏడో తరగతిలో ఓసీ-2, పీహెచ్‌సీ-2, బీసీ-బీ-1, బీసీ-ఈ-1, ఎస్సీ-1 ఖాళీలున్నాయన్నారు. తాటిపూడి బాలికల  గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో ఎస్సీ-1, బీసీ-బీ-1, 7వ తరగతిలో ఓసీ-3, ఎస్సీ -2, బీసీ-బీ-1, ఎక్స్ సర్వీస్‌మన్ ఒక ఖాళీ ఉందన్నారు. వివరాలకు 98665 59614 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement