![Delhi Merchant Applications For 155 Liquor Shops](/styles/webp/s3/article_images/2024/10/15/Delhi-Merchant-Applications.jpg.webp?itok=gj3dzcpc)
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా.. మరో వైపు ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఇక్కడి సిండికేట్లను మించి 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు. అమిత్ అగర్వాల్, నందినీ గోయల్, సారికా గోయల్, సౌరభ్ గోయల్ పేర్లతో దరఖాస్తులు సమర్పించాడు.
ఒక్కో దుకాణ లాటరీకి దరఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్నప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వరుసగా అన్ని షాపుల లాటరీ నిర్వహణలోను పాల్గొనడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అతడిని ప్రశ్నించిన ఎక్సై జ్ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ కూడా విస్తుపోయారు.
155 షాపులకు దరఖాస్తు చేసినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. అన్ని షాపులకు కలిపి దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు అవుతుంది. అంత స్థాయిలో దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఒడిశా నుంచి కూడా ఒక లిక్కర్ కింగ్ భారీగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. కేవలం 2 షాపులు మాత్రమే లభించాయి.
ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం
Comments
Please login to add a commentAdd a comment