Merchant
-
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఇందులో ఉంది. ఐదు నూతన బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 20న ముగుస్తాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ తమ నివేదికను పార్లమెంట్‌కు సమరి్పంచనుంది. పంజాబ్ న్యాయస్థానాల(సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్(రద్దు) బిల్లుపై పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. -
ఏకంగా 155 లిక్కర్ షాపులకు ఢిల్లీ వ్యాపారి దరఖాస్తులు.. ఇంతకీ లక్ తగిలిందా?
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా.. మరో వైపు ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఇక్కడి సిండికేట్లను మించి 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు. అమిత్ అగర్వాల్, నందినీ గోయల్, సారికా గోయల్, సౌరభ్ గోయల్ పేర్లతో దరఖాస్తులు సమర్పించాడు.ఒక్కో దుకాణ లాటరీకి దరఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్నప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వరుసగా అన్ని షాపుల లాటరీ నిర్వహణలోను పాల్గొనడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అతడిని ప్రశ్నించిన ఎక్సై జ్ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ కూడా విస్తుపోయారు.155 షాపులకు దరఖాస్తు చేసినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. అన్ని షాపులకు కలిపి దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు అవుతుంది. అంత స్థాయిలో దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఒడిశా నుంచి కూడా ఒక లిక్కర్ కింగ్ భారీగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. కేవలం 2 షాపులు మాత్రమే లభించాయి.ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం -
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
కాకినాడలో అదే అరాచకం
కాకినాడ: టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ముస్లిం వ్యాపారి దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన వారిని దుర్భాషలాడుతూ దాడికి తెగబడగా.. ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలివీ.. కాకినాడలోని జ్యోతుల మార్కెట్ సమీపంలో కరీమ్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఫ్యాన్సీ దుకాణం నడుపుకుంటున్నారు. టీడీపీ నేతల కన్ను అతని దుకాణంపై పడింది. ఆ దుకాణం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడైన నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు వారం రోజులుగా కరీమ్‌ను హెచ్చరిస్తున్నాడు. తన జీవనాధారమైన దుకాణాన్ని వదిలి వెళ్లలేనని కరీమ్ చెబుతుండటంతో శనివారం రాత్రి టీడీపీ నేత వీరు, మరో 20 మంది వ్యక్తులతో వెళ్లి ఆ దుకాణంపై దాడి చేశాడు. షాపులోని వస్తువులను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిని దుర్భాషలాడుతూ మరికొందరిపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో దుకాణ యజమాని బంధువు నూర్ మహ్మద్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కరీమ్ మాట్లాడుతూ.. తన దుకాణాన్ని టీడీపీ వారి మిత్రుడైన మరో వ్యక్తికి అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, దీనిని వ్యతిరేకించిన తనపై దాడులకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. మహిళలని కూడా చూడకుండా తమ బంధువులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. చిరు వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్న వ్యక్తిపై టీడీపీ నేతలు దాడి చేయడం అన్యాయమని ముస్లిం ఆలోచనాపరుల వేదిక కో–కన్వీనర్ హసన్ షరీఫ్ పేర్కొన్నారు. మైనారీ్టలకు అండగా నిలవాల్సిన వ్యక్తులే ఇటువంటి దౌర్జన్యాలకు తెగబడటం సరికాదన్నారు. -
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
Radhika Merchant: కాబోయే పెళ్లి కూతురు రాధికా ట్రెండీ లుక్స్
-
వీడిన ఖాదీ వ్యాపారి హత్య మిస్టరీ!
హైదరాబాద్: గత ఏడాది జరిగిన ఖాదీ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసు దర్యాప్తును నారాయణగూడ నుంచి నల్లకుంట పోలీసులకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఖాదీ వ్యాపారి ప్రకాష్ వీర్ మృతిపై పలు అనుమనాలు ఉండటమే ఇందుకు కారణం. కొద్ది రోజులుగా నల్లకుంట ఇన్స్పెక్టర్ రవి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అసలు ఏమైందంటే? గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి హైదర్‌గూడలోని ‘భారత్ ఖాదీ’ స్టోరు యజమాని ప్రకాష్ వీర్ అవంతినగర్లోని తన నివాసంలో రక్తపు మడుగులో కనిపించారు. నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు ఇతని మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అతని సోదరులు ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీ కార్యాలయానికి లేఖ రాశారు. తన సోదరుడి మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఆ లేఖలో రాయడంతో దీనిపై అప్పుడు స్పెషల్ బ్రాంచ్ పూర్తి నివేదికను ఉన్నతాధికారుల ఎదుట ఉంచింది. పోలీసుల అదుపులో భార్య, కుమార్తెలు? కొద్దిరోజులుగా నల్లకుంట పోలీసులు వ్యాపారి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. రెండు, మూడు పర్యాయాలు మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలను విచారించిన సందర్భంలో పలు విషయాలు బయటకు వచి్చనట్లు తెలిసింది. దీంతో శనివారం వారిని నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మరిన్ని విషయాలు, వ్యాపారి మృతిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్‌పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్‌పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్‌పే కన్జ్యూమర్ ప్లాట్‌ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్‌ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
రూ.30 లక్షలు, 1.67 కోట్ల నగలు చోరీ
మైసూరు: మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు నగలు, నగదును దుండగులు లూటీ చేశారు. శ్రీనిధి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ఆహార, ఔషధ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఓజీ శ్రీనివాస్ ఇంటిలో సోమవారం దొంగలు పడి సుమారు రూ. 30 లక్షల నగదు, రూ. 1.67 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. లాకర్‌ను బద్ధలుకొట్టి శ్రీనివాస్ తల్లిదండ్రుల వైద్య చికిత్స కోసం మైసూరు నగరానికి వెళ్లి, రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం చూశాడు. నగలు, నగదు కనిపించలేదు, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వెనుక వాకిలిని బద్ధలు కొట్టి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. దుర్భేధ్యమైన డిజిటల్ లాకర్‌ను పగలగొట్టి అందులోని నగదు, 1 కిలో బంగారం, 10 కిలోల వెండి , 70 గ్రాముల నెక్లెస్‌లను తీసుకున్నారు. మహావీర్ జైన్ అనే కుదువ వ్యాపారి తన నగలను శ్రీనివాస్ ఇంట్లో లాకర్లో పెట్టగా అవి కూడా పోయాయి. (చదవండి: భార్య సహకారం.. యువతిని భయపెట్టి ఐదేళ్లుగా అఘాయిత్యం) -
వడ్డీలేని రుణాల పేరిట బురిడీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నేను దయార్ద్రహృదయుడిని, రుణాలపై వడ్డీ తీసుకోకూడదని నేను నమ్మిన దైవం చెప్పింది. అందుకే బంగారు నగలపై వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాను’అంటూ ప్రజల్ని నమ్మించిన ఓ వ్యక్తి కుదువబెట్టిన సుమారు రూ. 300 కోట్ల విలువైన బంగారు నగలతో ఉడాయించాడు. చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయం, మద్రాసు హైకోర్టు వద్ద బాధితులు బారులుతీరడంతో ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు .. చెన్నై టీనగర్ వెస్ట్ మాంబళంలో రూబీ బ్యాంకర్స్ అనే పేరుతో బంగారునగల దుకాణం ఉంది. ఈ దుకాణాన్ని రెహమాన్, అతని కుమారులు అనీస్, సయ్యద్ 15 ఏళ్లకు పైగా నడుపుతున్నారు. బంగారు నగలను కుదువ పెట్టేవారికి వడ్డీలేని రుణాలు ఇస్తామని, రుణం చెల్లించగానే కుదువపెట్టిన నగలను తిరిగి ఇచ్చేలా స్కీము నిర్వహించారు. రుణాలపై వడ్డీ తీసుకోరాదని పవిత్ర ఖురాన్లో పొందుపరిచిన మాటల ప్రకారం ఈ సేవలు చేస్తున్నట్లు ఖాతాదారులను నమ్మించాడు. బంగారం విలువలో మూడోవంతు మొత్తాన్ని 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాలంలో చెల్లించేలా రుణాలు ఇచ్చారు. వడ్డీ లేని రుణాలపై ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కరపత్రాలతో ప్రచారం కూడా చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన ముస్లింలు సుమారు వెయ్యి కిలోల బంగారు నగలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. ఈ నగలను రూబీ బ్యాంకర్స్ యజమానులు ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీల్లో అనేక కోట్ల రూపాయలకు తాకట్టుపెట్టినట్లు, ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సమాచారం. పొందిన రుణాలను తిరిగి చెల్లించి నగలు తీసుకోవాలనుకునే వారికి జాప్యం చేయసాగారు. బాధితుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయడంతో రూబీ బ్యాంకర్స్‌కు కోర్టు సీలువేసింది. ఇదే సమయంలో తన వ్యాపారం దివాలా తీసినట్లుగా యజమాని పేరున పసుపుపచ్చని నోటీసు మూసిఉన్న షోరూంపై అతికించి ఉండటంతో అది చూసిన ఖాతాదారులు కంగుతిన్నారు. ఈనెల 2న నగలు కచ్చితంగా వెనక్కి ఇస్తామని నమ్మబలికిన యజమానులు రూబీ బ్యాంకర్స్‌ను మూసివేసి రాత్రికి రాత్రే పారిపోయినట్లు సమాచారం. దీంతో బాధితులంతా మూకుమ్మడిగా తరలివెళ్లి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. సుమారు వందకు పైగా ఫిర్యాదులు అందడంతో కేసును ఆర్థికనేరాల విభాగానికి అప్పగించారు. అలాగే తొలుత పిటిషన్ వేసిన బాధితునితో కలిసి వందల సంఖ్యలో బాధితులు సోమవారం మద్రాసు హైకోర్టుకు వెళ్లి న్యాయం చేయాల్సిందిగా మొరపెట్టుకున్నారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల మేరకు సుమారు రూ.300 కోట్ల విలువైన వెయ్యి కిలోల కుదువనగలతో యజమానులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. -
భూమి నుంచివెళ్లకపోతే కాల్చేస్తా
మహేశ్వరం రంగారెడ్డి : మర్యాదగా భూమి కబ్జా విడిచి వెళ్లకపోతే గన్‌తో కాల్చేస్తానని రైతులను ఓ వ్యాపారి రివాల్వర్‌తో బెదిరించాడు. దీంతో రైతులు తిరగబడి ఆ వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మోహబ్బత్‌నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో సుమారు 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోహబ్బత్‌నగర్ గ్రామానికి చెందిన వరాత్యవత్ రాజునాయక్, గోల్కొండ అంజయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని 1975లో పట్టాదారు రాంబాయమ్మ, యాదగిరమ్మలు ఇనాంగా రైతులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారస్తులు అలోబి రామ్‌కుమార్ తివారీ, అలోబి శంకర్ తివారీ, అలోబి శివకుమార్ తివారీ, సంతోష్ తివారీ, మాజీ పట్వారీ వంగ వెంకట్‌రెడ్డిలు కలిసి శుక్రవారం ఆ భూమి వద్దకు వెళ్లి ఈ భూమి తమదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే మర్యాద ఉండదని రైతులను హెచ్చరించారు. రైతులు వ్యాపారుల మాటలకు బెదరకపోవడంతో రామ్‌కుమార్ తీవారీ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్చేస్తానని రైతులు శ్రీశైలం, అంజయ్యలను బెదిరించాడు. భయపడిపోయిన ఇతర రైతులు రామ్‌కుమార్ చేతిపై కొట్టడంతో రివాల్వర్ కింద పడిపోయింది. రైతులు వ్యాపారస్తులను చితకబాది, వారి వాహనాలను ధ్వంసం చేశారు. రివాల్వర్‌ను రైతులు తీసుకుని మహేశ్వరం పోలీసులకు అప్పగించారు. మహేశ్వరం సీఐ సునీల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఇరువురిని విచారించారు. అక్కడ రివ్వాలర్‌తో కాల్పులు జరపలేదని ఏసీపీ తెలిపారు. ఈ భూమిపై కేసు కోర్టులో ఉందని, ఇరువురు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారని, ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రివాల్వర్ ఎక్కుపెట్టలేదు మోహబ్బత్‌నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో ఉన్న 57 ఎకరాలు మా పట్టా భూమి. అప్పట్లో రాంబాయమ్మ, యాదగిరమ్మల నుంచి కొనుగోలు చేశాం. కొంత మంది రైతులు అక్రమంగా చొరబడి కబ్జా చేయడానికి యత్నిస్తుండగా వారిని అడ్డుకోబోయాం. మా పట్టా భూమి నుంచి వెంటనే ఖాళీ చేయాలని కోరాం. రైతులు వాగ్వాదానికి దిగి కర్రలతో దాడిచేసి గాయపరిచారు. నా లైసెన్స్ రివాల్వర్‌ను బ్యాగులో పెట్టుకున్నాను. ఎవరిపైనా కాల్చడానికి యత్నించలేదు. నా డబ్బులు, రివాల్వర్ లాక్కున్నారు. గన్ ఎక్కుపెట్టానని అసత్య ప్రచారం చేస్తున్నారు. మాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామ్‌కుమార్ తివారి పొలం విడిచి వెళ్లిపోవాలని రివాల్వర్‌తో బెదిరించారు.. తమ భూమి వద్దకు వచ్చి కబ్జా విడిచి వెళ్లిపోవాలని రామ్‌కుమార్ తివారీ, అతని సోదరులు రివాల్వర్‌తో బెదిరించారు. తమతో పెట్టుకుంటే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. రామ్‌కుమార్ వద్ద ఉన్న రివాల్వర్ నాపై ఎక్కుపెట్టాడు. వెంటనే మా కుటుంబ సభ్యులు, ఇతర రైతులు దాడిచేసి రివాల్వర్‌ను లాక్కొన్నారు. తివారీలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిలోకి వచ్చి వెళ్లిపొమన్నడానికి వారు ఎవరు. భూమి మాదేనని న్యాయస్థానం మాకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. – గోల్కొండ శ్రీశైలం, రైతు, మోహబ్బత్‌నగర్ -
అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం..
భీమవరం టౌన్/కాళ్ల: తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ అవుటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమవరానికి చెందిన ప్రముఖ ఆక్వా ఫీడ్ వ్యాపార వేత్త వేగేశ్న శ్రీరామరాజు అలియాస్ శ్రీరామ్ (30)మృతి చెందారు. కీసర నుంచి ఆయన కారులో వస్తుడంగా అవుటర్ రింగు రోడ్డు వద్ద డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు పల్టీ కొట్టింది. సంఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. కారుపూర్తిగా దగ్ధమైంది. 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆయన మృతిచెందారు. భీమవరం కాస్మో పాలిటన్ క్లబ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వేగేశ్న శ్రీరామరాజుకు భార్య మౌనికా శ్రీదేవి, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఆయన తండ్రి వేగేశ్న కృష్ణంరాజు కాళ్ల మండలం కోపల్లె గ్రామ ఉప సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. గతంలో ఆయన ఆ గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. కృష్ణంరాజు పెద్ద కుమారుడు రవీంద్ర వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీరామరాజు అన్నయ్యను కలిసి ఆ తర్వాత పనులు చూసుకుని తిరిగి కారులో వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ పదిమందికి సహాయపడే శ్రీరామరాజు మృతితో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో విషాదం అలముకుంది. ఉండి మాజీ ఎమ్మెల్యేల పాతపాటి సర్రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, డీఎన్నార్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, కలవపూడి సొసైటీ అధ్యక్షుడు మంతెన రాంబాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు, కౌన్సిలర్ సుబ్బరాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన ఫైనాన్స్ దందా
కామారెడ్డికి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారి నిజాయితీగా వ్యాపారం చేయాలనుకున్నాడు. దెబ్బతిని బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘ఫైనాన్స్ మేనేజర్లు వాళ్ల జీతం కోసం నాలాంటి వాళ్లను బలి చేశారు. నన్ను ఇబ్బంది పెట్టారు. ఆ బాధ భరించలేక చనిపోతున్నాను. నా తల్లిదండ్రులు, భార్యపిల్లలకు దూరమవుతున్నాను’’, ‘‘నాలాంటి అమాయకులు ఫైనాన్స్ దందాలో ఇమడలేరు’’ అంటూ లేఖ రాశాడు. సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఫైనాన్స్‌ల ఉచ్చులో పడి వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్న తరుణంలో పట్టణానికి చెందిన వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం వాడి గ్రామానికి చెందిన నర్సారెడ్డి(41) బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్ట ణానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య లత, కుమారుడు నిఖిల్, కూతురు నిఖిత ఉన్నారు. పిల్ల లు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నారు. ఆయ న కుటుంబం అశోక్‌నగర్‌లో నివసిస్తోంది. నర్సారెడ్డి సుమారు 18 ఏళ్ల క్రితం చిన్నగా ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారంలో కలిసిన స్నేహితులతో పెట్టుబడి పెట్టాడు. ఐదు ఫైనాన్స్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. భాగస్వాములతో కలిసి ఒక ఫైనాన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఫైనాన్సులో అప్పులు ఇప్పించే విషయంలో అందరూ ఆయనను ఆశ్రయిం చేవారు. నర్సారెడ్డి అమాయకత్వాన్ని ఆసరా చేసుకు ని కొందరు అప్పు తీసుకుని ఎగ్గొట్టారు. కొందరు దివాలా తీశారు. అప్పులు తీసుకున్నవారిలో కొందరు మరణించారు. మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించిన పాపానికి ఫైనాన్స్ మేనేజర్లు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో కొందరి అప్పులు కట్టాడు. కామారెడ్డి పట్టణంలో వరుసగా ఫైనాన్స్ మేనేజర్లు ఐపీలు పెట్టడం, బిచాణా ఎత్తేసిన సంఘటనలతో వ్యాపారంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో నర్సారెడ్డిపై కొందరు ఫైనాన్స్ మేనేజర్లు డబ్బుల కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ వేధింపులు భరించలేని నర్సారెడ్డి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం రాత్రి సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమారుడు నిఖిల్, కూతురు నిఖితలకు ఫోన్ చేశాడు. అనంతరం భార్య లతతో మాట్లాడాడు. రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి, తన ఫైనాన్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సారెడ్డి రాత్రి 11 గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతడి భార్య లత.. కాలనీవారిని ఫైనాన్స్ కార్యాలయానికి పంపించింది. అక్కడికి వెళ్లినవారికి ఫ్యాన్‌కు వేలాడుతూ నర్సారెడ్డి మృతదేహం కనిపించింది. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ఫైనాన్స్‌లో సుమారు కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టానని, అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించడం లేదని, డబ్బుల కోసం కామారెడ్డికి చెందిన కొందరు వ్యాపార భాగస్వాములు, నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన భర్త మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య లత పోలీసులను కోరింది. మేనేజర్ల ఒత్తిడితోనే చనిపోతున్నా.. నర్సారెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు అందుకు గల కారణాలను వివరిస్తూ సూౖసైడ్నోట్ రాశాడు. పది మంది ఫైనాన్స్ మేనేజర్లు డబ్బుల కోసం వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. ఫైనాన్స్‌లో బ్యాలెన్స్ ఉంటే.. నర్సన్న బ్యాలెన్స్ ఉన్నవి అని ఎవరికైనా ఇప్పించాలని అన్నవారే.. ఆ అప్పు తిరిగి రాకపోతే వేధిస్తున్నారని ఆవేదన చెందాడు. ‘‘ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకున్నవారిలో కొందరు చనిపోయారు. కొందరు దివాలా తీసి డబ్బులు చెల్లించడం లేదు. ఇంకొందరు బాగానే ఉన్నా డబ్బులు కట్టడం లేదు. అప్పు తీసుకున్నవారికి ఫోన్‌చేస్తే ఇప్పుడు కడ్త అప్పుడు కడ్త అంటరే కాని పైసలు కట్టనే కట్టరు.. కొందరు ఫోనే లావట్టరు.. ఫైనాన్స్ మేనేజర్లేమో నన్ను ఇబ్బంది పెట్టారు. ఆ బాధ భరించలేక చనిపోతున్నాను. నా తల్లిదండ్రులు, భార్యపిల్లలకు దూరమవుతున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాంటి అమాయకులు ఫైనాన్స్ ఫీల్డ్‌లోకి రావద్దని సలహా ఇచ్చాడు. పిల్లలు చదువులో ముందంజలో ఉన్నారని, వారికి సహాయం చేసి బాగా చదివించాలని బంధుమిత్రులను, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం, ఎమ్మెల్యేలు గంప, ఏనుగు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలను వేడుకున్నాడు. ఆయన ఈ వ్యాపారంలో కోటి రూపాయలకుపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్హెచ్ఓ శ్రీధర్‌కుమార్ తెలిపారు. -
ప్రకాశం జిల్లాలో వడ్డీ వ్యాపారి ఆగడాలు
-
బెల్లం వ్యాపారి విడుదల
మట్టెవాడ పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రత్యక్షం కిడ్నాపర్ సూడో నక్సలైట్ నిందితుడి కోసం పోలీసుల గాలింపు హసన్‌పర్తి : హసన్‌పర్తి సమీపంలో బుధవారం కిడ్నాప్‌నకు గురైన నిజామాబాద్ జిల్లాకు చెందిన బెల్లం వ్యాపారి గురువారు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విడుదలయ్యాడు. వరంగల్‌లోని మట్టెడవాడ పోలీస్‌స్టేçÙన్ వద్ద ఆ వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. కిడ్నాపర్ సూడో నక్సలైట్. ఇటీవల ఓ హత్యకేసులో జైలుకు వెళ్లి గత నెలలో విడుదలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి... పరకాల మండలం నడికుడ గ్రామానికి చెందిన రేనుకుంట్ల బిక్షపతిది నేరచరిత్ర. అతనిపై వివిధ పోలీస్‌స్టేçÙన్లలో కేసులు ఉన్నా యి. ఇటీవల ఆత్మకూర్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. గుమస్తాతో పరిచయం... నిమాజాబాద్ జిల్లా బిక్కనూర్‌కు చెందిన బెల్లం వ్యాపారి శ్యామల భరత్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డికి బిక్షపతితో వరంగల్ జైలులో పరిచయం అయ్యాడు. వీరిద్దరూ ఒకే గ్యారేజ్‌లో ఉండడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెల్లం వ్యాపారం చేస్తానని నమ్మించి.. కాగా, తన వద్ద రూ.3 లక్షలు ఉన్నాయని, తాను కూడా బెల్లం వ్యాపారం చేస్తానని రవీందర్‌రెడ్డిని బిక్షపతి నమ్మించాడు. ఆగస్టు 2న రవీందర్‌రెడ్డి జైలు నుంచి విడుదల కాగా, బిక్షపతి అతడి సెల్ నెంబర్ తీసుకున్నాడు. అదే నెల 8న బిక్షపతి కూడా జైలు నుంచి బయటికి వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత రవీందర్‌రెడ్డికి ఫోన్ చేసి, బెల్లం వ్యాపారం కోసం నిమాజాబాద్‌కు వెళ్లాడు. అక్కడ శ్యామల భరత్‌తో వ్యాపార వ్యవహారాలు మాట్లాడాడు. తనకు మూడు లారీల బెల్లం అవసరమని, ఒక్కో లారీ వరంగల్‌కు చేర్చడానికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు కోసం రమ్మని కబురు... రెండు రోజుల క్రితం శ్యామల భరత్‌కు బిక్షపతి ఫోన్‌చేసి డబ్బుల కోసం వరంగల్ రమ్మని చె ప్పాడు. దీంతో బుధవారం భరత్ తన గుమస్తా రవీందర్‌రెడ్డితో కలిసి వరంగల్ వస్తూ.. హసన్çపర్తిలో ఆగి బిక్షపతికి ఫోన్ చేశారు. కొత్తవాడలో నిర్భంధం... కాగా, సమీపంలోనే పెద్ద వ్యాపారులు ఉన్నారని, అక్కడికి వస్తే డబ్బులు ఇస్తారని నమ్మిం చిన బిక్షపతి భరత్‌ను ద్విచక్రవాహనంపై హసన్‌పర్తి నుంచి తీసుకెళ్లాడు. మధ్యలో కిట్స్ క్రాస్ వద్ద ఆటోలో ఎక్కించుకుని వరంగల్‌లోని కొత్తవాడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో నిర్బం ధించి నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. ఆ తర్వాత రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని అతడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ వ్యవహారంలో బిక్షపతితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎంత ప్రయత్నించినా బిక్షపతి పోలీసుల లైన్‌కు రాలేదు. దీంతో అర్ధరాత్రి బిక్షపతి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. చివరికి పోలీసుల హెచ్చరికలతో భరత్‌ను మట్టెవాడ పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టి వెళ్లినట్లు తెలిసింది. నిందితుడి కోసం గాలింపు... కాగా, బిక్షపతి కోసం పోలీసులు గాలింపు చర్య లు చేపట్టారు. గురువారం రాత్రి వరకు కూడా అతని కోసం ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బిక్షపతి కుటుంబసభ్యులు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. భరత్‌తో పాటు గుమస్తా, కారుడ్రైవర్ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారని సమాచారం. -
పెట్రోల్ పోసుకుని వ్యాపారి ఆత్మహత్యాయత్నం
ముప్పాళ్ల: గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామం సమీపంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయవాడకు చెందిన ఇనుము వ్యాపారి గౌస్ (45) ముప్పాళ్ల మండలం రుద్రవరంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై దమ్మాలపాడు గ్రామానికి బయల్దేరి మార్గ మధ్యంలో పొలాల్లోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కాగా అతడ్ని 108 వాహనంలో సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆస్పత్రికి తరలించే క్రమంలో గౌస్ వెల్లడించాడు. -
బంగారం వ్యాపారి మ్రుతి
-
రూ.50 లక్షల ధాన్యంతో వ్యాపారి పరార్
ఈపూర్ (గుంటూరు) : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి ఉడాయించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొచ్చర్ల గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాకుమాన్ శ్రీనివాస్ వడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దాదాపు 60 మంది రైతుల నుంచి రూ. 50 లక్షల విలువైన ధాన్యం కొనుగోలు చేశాడు. అయితే రైతులకు డబ్బు చెల్లించలేదు. మా డబ్బులు ఎప్పుడిస్తావు అని రైతులు అడిగేసరికి ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ స్వరాజ్య నగర్లో మంగళవారం తెల్లవారుజామున స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. వ్యాపారంలో విభేదాలు రావడంతో భాగస్వామే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారి దారుణ హత్య
విశాఖపట్నం: పనస వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజువాకకు చెందిన పాపారావు శనివారం తాజంగి గ్రామానికి చేరుకున్నాడు. సాధారణంగా వచ్చిన రోజే గ్రామంలోని పనస చెట్లను కొనుగోలు చేసి, కాయలు తెంపుకుని వెంటనే వాహనంలో తరలించుకుని వెళ్లిపోతుంటాడు. అయితే, సాయంత్రం పనస తోటలోకి వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రైతుబజార్ వ్యాపారి ఆత్మహత్య
గుంటూరు రూరల్: నగరశివారు తురకపాలెం రోడ్డులోని జన్మభూమినగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ కృష్ణానందం తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు కృష్ణనగర్‌కు చెందిన కర్రి రవీంద్రసాయి(33) పట్టాభిపురం రైతుబజార్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కొంతకాలంగా అన్యమనస్కంగా ఉంటున్న రవీంద్రసాయి ఆదివారం మధ్యాహ్నం వరకు రైతుబజార్లో కూరగాయలు విక్రయించాడు. తర్వాత సొంత కారులో బయలుదేరి తురకపాలెం రోడ్డు శివారులో ఉన్న చెట్ల మధ్య ఖాళీస్థలంలో ఆపి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సోమవారం గమనించి రూరల్ పోలీసులకు సమాచారమివ్వడంతో రూరల్ ఎస్ఐ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రసాయికి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉండడంతో కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతుడి సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలాఉంటే రైతుబజార్ తొలగిస్తున్నారని జీవనోపాధి ఉండదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు అంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నిజమైన దిక్పాలకులు
బౌద్ధవాణి మగధకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి కొడుకు సింగాలకుడు. రోజూ క్రమం తప్పకుండా నగరం వెలుపలగల కోనేటిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చి, దిక్కు దిక్కుకు తిరిగి సాష్టాంగ ప్రణామాలు చేస్తాడు. ఒక రోజున నమస్కరించి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా చిరునవ్వుతో బుద్ధుడు కన్పించాడు. భక్తితో బుద్ధునికి నమస్కరించాడు సింగాలకుడు. ‘‘సింగాలకా! ఎవరికి నమస్కరిస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు.‘‘భగవాన్! రోజూ ఆరు దిక్కులకు నమస్కరిస్తున్నాను’’ అన్నాడు సింగాలకుడు. ‘‘మంచిది సింగాలకా! దిక్కులకు ఎందుకు నమస్కరించాలో తెలుసా?’’ ‘‘ఆరు దిక్కులకూ ఆరుగురు దిక్పాలకులుంటారో గదా! వారికే నమస్కరిస్తున్నా!’’ అని ఏయే దిక్కుకు ఎవరెవరు అధిపతులో చెప్పాడు సింగాలకుడు. బుద్ధుడు నవ్వి...‘‘సింగాలకా! నీవు చెప్పిన వారికంటే గొప్ప దిక్పాలకులున్నారు. తూర్పు దిక్కుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దక్షిణ దిక్కుకు మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువు, పశ్చిమానికి భార్యా-బిడ్డలు, ఉత్తర దిశకు మిత్రులు అధిపతులు. ఉద్యోగులు శ్రామికులు అధోదిశకు, పండితులు ఊర్ధ్వదిశకు ప్రతీకలు కాబట్టి వారికి నమస్కరించు. వీళ్లే నిజమైన దిక్పాలకులు’’ అని చెప్పాడు బుద్ధ భగవాన్. ‘‘అలాగే భగవాన్’’ అని వినయంగా పలికాడు సింగాలకుడు. - బొర్రా గోవర్ధన్ -
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ
- రూ. కోటితో వ్యాపారి పరార్ - ఆందోళనలో బాధితులు - గతంలోనూ పలు సంఘటనలు బోధన్ టౌన్ : కూలినాలి చేసుకొని డబ్బులు కూడబెట్టుకున్న పేదల డబ్బును దోచుకొని పారిపోతున్నారు చిట్టీల వ్యాపారులు. మోసపోయామని తెలుసుకొన్న తర్వాత బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా ఓ వ్యాపారి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. బోధన్ మండలంలో చిట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 200లకుపైగా చిట్టీలు నడుస్తున్నాయి. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్టీలు నడుపుతున్నారు. నెలవారీగానే కాకుండా రోజువారీగానూ చిట్టీలున్నాయి. ఇలా ఓ వ్యాపారి పలుచిట్టీలు నిర్వహించాడు. అతడు ఎల్ఐసీ ఏజెంట్ కూడా కావడంతో చాలా మంది చిట్టీలు కట్టారు. ఇలా కోటి రూపాయల వరకు వసూలు చేసిన సదరు వ్యాపారి ఇరవై రోజుల క్రితం పరారైనట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత డి వద్ద చిట్టీలు కట్టినవారు లబోదిబోమంటున్నారు. నెల రోజుల క్రితం మండలంలోని సాలంపాడ్ గ్రామానికి చెందిన ఓ చిట్టీల వ్యాపారి అందరినీ నమ్మించి రూ. 40 లక్షలతో ఉడాయించాడు. ఇది పోలీసుల దృష్టికి సైతం వచ్చింది. గతంలో మినార్పల్లి, ఊట్పల్లి, బోధన్ పట్టణానికి చెందిన వడ్ల వ్యాపారులు, ఓ ఫైనాన్స్ వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన సంఘటనలున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండడం లేదు. ప్రజలను మోసం చేస్తున్న చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారులు ఐపీలు పెట్టి దర్జాగా తిరుగుతూనే ఉన్నారు. పోలీసులు స్పందించి మోసగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వివాదానికి తెర
సుభాష్‌నగర్: కొంత కాలంగా జిల్లా కేంద్రంలోగల ఈద్గా స్థలంపై నెలకొన్న వివాదానికి తెరపడింది. నగరంలోని శాంతినగర్ వద్ద గల పాత ఈద్గాకు చెందిన రెండు ఎకరాల 31గుంటల స్థలం విషయం కొంత కాలం గా వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించారని పలు ఆరోపణలు వెల్లు వెత్తాయి. దీంతో గత 40 సంవత్సరాలుగా ఈ సమస్య సమస్యగానే మిగిలి పోయింది. పరిష్కారానికి నోచుకోలేదు. రానురాను ఈద్గా స్థలం తగ్గిపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయంపై ఎన్నోసార్లు సర్వేలు చేయాలని కొందరు, సర్వేలను నిలిపి వేయాలని మరి కొందరు ఆందోళన లు చేశారు. దీంతో ఆ స్థలం విషయంలో ఎ న్నోసార్లు సర్వేల కోసం అధికారులకు దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు.అయినప్పటికీ ఈద్గాకు చెందిన స్థల వివాదం సమసిపోలేదు. అయితే నగరానికి చెందిన ఇద్రీస్ అనే వ్యాపారి ఈద్గా పక్కన గల లక్షల వి లువ చేసే భూమిని కొనుగోలు చేసి ఈద్గా కోసం అప్పగించారు. స్థలంతో పాటు కొ త్తగా మినార్లు సైతం తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అందు కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఉదారంగా ఇచ్చిన ఘనతను దక్కించుకున్నారు. రంజాన్ పండుగకు సన్నాహాలు ఈద్గాలో ప్రస్తుతం నూతనంగా మినార్లను నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ పండుగ సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేసి, పండుగను కొత్త స్థలంలో జరుపుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కావలసిన సౌకర్యాలను, సహకారాన్ని కూడా నిజామాబాద్ ఎంపీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తలు అందిస్తున్నారు. వివాదాలు ఉండకూడదు. ముస్లింసోదరులు రంజాన్,బక్రీద్ పండుగల సమయంలో నమాజ్ చేసే ఈద్గా స్థలం వివాదం కాకూడదు. అందు కోసం నేను, నా వ్యాపార మిత్రులు సోహెల్‌లు కలసి వివాదానికి తెరదించాలని భావించాము. దీంతో కబ్జాకు గురైన ఈద్గా స్థలాన్ని కొనుగోలు చేసి ఈద్గా పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. దీంతో గత కొంత కాలంగా ఉన్న ఈద్గా స్థల వివాదం సమసిపోయింది. -ఇద్రిస్‌ఖాన్, వ్యాపారి -
పొట్టకోస్తే.. బంగారం బయటపడింది..!
సింగపూర్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన వ్యాపారి వ్యూహం బెడిసికొట్టడంతో ఆస్పత్రిపాలు న్యూఢిల్లీ: నీళ్ల సీసా మూత మింగానంటూ ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యాపారికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే అతని పొట్టలో నీళ్ల సీసా మూతకు బదులుగా 12 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఒక్కో బిస్కెట్ బరువు 33 గ్రాములు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే... చాందినీచౌక్‌కు చెందిన ఓ వ్యాపారి ఏప్రిల్ 7న సర్ గంగారాం ఆస్పత్రికి వచ్చాడు. ప్రమాదవశాత్తు తాను నీళ్ల సీసా మూత మింగానని, శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాలంటూ బతిమాలాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో సీనియర్ కన్సల్టింగ్ సర్జన్ డాక్టర్ సి.ఎస్ రామచంద్రన్ నేతృత్వంలోని ఓ బృందం మొదట ఎక్స్‌రే తీసింది. అందులో నీళ్ల సీసా మూత వంటి వస్తువేది కనిపించకపోగా లోహపు వస్తువులున్నట్లు గుర్తించారు. అయితే వాటిని బంగారంగా గుర్తించని వైద్యులు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. పొట్టలోనుంచి బంగారు బిస్కెట్లు బయటకు వస్తుండడంతో వైద్యుల బృందం ఆశ్చర్యపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బిస్కెట్లు అతని పొట్టలోనుంచి బయటపడ్డాయి. శస్త్రచికిత్స పూర్తిచేసిన వైద్యులు వెంటనే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. వ్యాపారిని ఈ విషయమై ప్రశ్నించగా అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయమై రామచంద్రన్ మాట్లాడుతూ... ‘తరచూ ఆస్పత్రికి వచ్చే వ్యక్తి కావడంతో ముం దుగా మాకు ఎటువంటి అనుమానం రాలేదు. అప్పటికే అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశాం. మొదటిసారి పిత్తకోశాన్ని తొలగించేందుకు, రెండోసారి అపెండిసైటిస్, మూడోసారి హెర్నియాకు సంబంధించి శస్త్రచికిత్సలు చేశాం. పైగా అతనికి మధుమేహం కూడా ఉంది. రోగి చరిత్ర ముందుగా తెలియడంతో ఉదరంలో ఏదైనా సమస్య కారణంగా ఆస్పత్రికి వచ్చాడని భావించాం. ఇక బంగారం ఎక్కడిది? అనే విషయాన్ని పక్కనబెడితే మొత్తానికి అతని ప్రాణాలను కాపాడినందుకు సంతోషంగా ఉంద’న్నారు. ఇదిలాఉండగా చాందినీచౌక్‌కు చెందిన సదరు వ్యాపారి పదిరోజుల క్రితమే సింగపూర్ నుంచి ఢిల్లీకి వచ్చాడని, బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చేందుకే బిస్కెట్ల రూపంలోకి మార్చి మింగాడని, మలద్వారం ద్వారా బయటకు వెళ్తాయనుకుని భావించినా అనుకున్న విధంగా జరగకపోవడంతో ఆందోళన చెందిన అతను వైద్యులను సంప్రదించాడని, అసలు విషయం దాచి. నీళ్ల సీసా మూత మింగానంటూ అబద్ధం చెప్పి ప్రాణాలను కాపాడుకున్నాడని కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు.పొట్టలో బంగారు బిస్కెట్లు ఉన్నాయని ముందుగానే చెబితే వైద్యులు శస్త్ర చికిత్స చేయరేమోనని భావించినందునే అలా అబద్ధం చెప్పి ఉంటాడన్నారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
భలే మంచి వ్యాపారి ఈ బాల్కీ!
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏడేళ్ల అబ్బాయి డబ్బు సంపాదనకు పూనుకొంటే... ఖాళీ సమయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే... ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకొంటారు ఈ పనికి? అతడిని ప్రోత్సహిస్తారా? చదువును దృష్టిలో పెట్టుకొని లేదా ఇతర కారణాలతో అలాంటి పనులకు ఒప్పుకోకపోవచ్చు. సయీద్బాల్కీ తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఏడేళ్ల వయసులోనే ఒకవైపు చదువుకొంటూ మరో పక్క డబ్బు సంపాదన మొదలుపెడితే... అతడు చిట్టి చేతులతో తెచ్చిన సొమ్మునుగాక... అతడిలో ఎదుగుతున్న వ్యాపారవేత్తను చూశారు ఆ తల్లిదండ్రులు. పాకిస్థాన్‌కి చెందిన 22 సంవత్సరాల సయీద్బాల్కీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్లలో ఒకడు. బాల్కీ కుటుంబం పాకిస్థాన్‌లో ఉన్న రోజుల్లో ఈద్ సందర్భంగా గ్రీటింగ్ కార్డులను అమ్మడంతో కెరీర్ మొదలుపెట్టాడు బాల్కీ. తన తల్లి గ్రీటింగ్ కార్డులను కొనడానికి కొంత డబ్బు ఇచ్చేదని, ఆ డబ్బుతో కార్డులు కొని, వాటిని అమ్మి లాభాన్ని సంపాదించే వాడినని, అలా తన వ్యాపార జీవితం ఏడేళ్ల వయసులో లాభసాటిగా మొదలైందని చెబుతాడు బాల్కీ. అయితే బాల్కీలోని వ్యాపారవేత్త అంతటితో ఆగిపోలేదు. స్నాక్స్ తినడమంటే ఇష్టపడే వయసులో తన వీధిలోనే ఒక స్నాక్ షాప్‌ను ప్రారంభించి, లాభాలు ఆర్జించాడు. బాల్కీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు వీరి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. కొత్త దేశం, కొత్త ప్రాంతం, కొత్త ఊరు.. ఫ్రెండ్స్ అంతగా లేరు. ఈ సమయంలో తనకు కంప్యూటరే ప్రియనేస్తమైందనీ, అలాగే ‘మౌంటెన్ డ్యూ’ తాగడం వ్యసనంగా మారిందనీ, ఆ వ్యసనం కోసం సొంతంగా డబ్బు సంపాదించుకునే మార్గం అన్వేషించా ననీ, తన కజిన్ ద్వారా ‘డొమైన్ బిజినెస్’లోకి ప్రవేశించాననీ బాల్కీ చెబుతాడు. కజిన్ గెడైన్స్‌తో డొమైన్లు రిజిస్టర్ చేయించడంలో, అమ్మడంలో ప్రావీణ్యత సంపాదించాడు. క్రమంగా వెబ్డిజైన్పై పట్టు సాధించింది సొంతంగా ఫ్రీలాన్స్ వెబ్ డిజైన్ బిజినెస్‌ను ప్రారంభించి, వ్యక్తిగత ప్రతిభతో షైన్ అయ్యాడు. ఇతడు ప్రారంభించిన లిస్ట్ 25 అనే వెబ్సైట్ పాపులర్ అయ్యింది. పే పల్, క్విక్ సిల్వర్, కివ, వర్డ్ ప్రెస్, డోనర్స్ ఛాయిస్ కంపెనీ సీఈవోలతో పనిచేశానని, వారితో పనిచేయడం గొప్ప అనుభవమని బాల్కీ చెప్పాడు. ఇతడి విజయగాథ గురించి న్యూయార్క్‌టైమ్స్, బిజినెస్ ఇన్సైడర్, వైర్డ్ మ్యాగజీన్, యాహూ, అమెక్స్ ఓపెన్ ఫోరమ్ వంటి మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. తగిన అవకాశాలుంటే యువత రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు బాల్కీ. -
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
రసూల్‌పురా,న్యూస్‌లైన్: నగరంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా దొంగలు పంజా విసురుతున్నారు. తాళాలు వేసివున్న ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి ఇంట్లో కిటికీగ్రిల్స్ తొలగించి రూ.13 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన కార్ఖనా పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. అదనపు సీఐ నాగయ్య వివరాల ప్రకారం..పీఆండ్‌టీ కాలనీ ఫ్లాట్‌నెం.2 లో నివసించే కె.సుమన్ వ్యాపారి. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. దీన్ని గమనించిన దొంగలు నేరుగా ఇంటి తాళం పగులగొట్టకుండా కిటికీగ్రిల్స్ తొలగించి పడకగదిలోకి చొరబడ్డారు. కప్‌బోర్డులోని డ్రాలో ఉన్న రూ.13 లక్షల నగదు, సుమారు రూ. 2 లక్షలు విలువజేసే బంగారు నగలను అపహరించారు. మంగళవారం ఉదయం పెంట్‌హౌస్‌లో ఉండే పనిమనిషి కిటికీగ్రిల్స్ తొలగించి ఉండడాన్ని గమనించి వెంటనే ఫ్లాట్ యజమానికి సమాచారమిచ్చారు. ఆయన ఇంటికి చేరుకొని చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి...
టేకులపల్లి, న్యూస్‌లైన్: ఆర్టీసీబస్సు, ద్వి చక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది. మండలంలోని తొమ్మిదోమైలు తండా సమీపంలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల సమాచారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని బోడురోడ్డు రేగులతండాకు చెందిన చిక్కాశ్రీకాంత్(35) కిరాణ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువా రం ఆయన తన భార్య సీతమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇల్లెందు బయలుదేరాడు. తొమ్మిదోమైలు తండా దాటిన తర్వాత సాయినపల్లి రోడ్డుకు సమీపంలో ఆ ద్విచక్ర వాహనం, ఎదురుగా ఇల్లెందు నుంచి వస్తున్న కొత్తగూడెం డిపో బస్సు అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సీత మ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. మృతుడికి ఇద్దరు పిల్లలు వశిష్ట్, వర్ణిక ఉన్నారు. వీరిద్దరు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతదేహానికి ఇల్లెందులో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.