
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఇందులో ఉంది. ఐదు నూతన బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి.
డిసెంబర్ 20న ముగుస్తాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ తమ నివేదికను పార్లమెంట్‌కు సమరి్పంచనుంది. పంజాబ్ న్యాయస్థానాల(సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్(రద్దు) బిల్లుపై పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment