Winter Session of Parliament
-
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
ప్రజలు తిరస్కరించినా పార్లమెంట్‌పై పెత్తనమా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఇలా వేర్వేరు ఎన్నికల్లో వేర్వేరు సంవత్సరాల్లో ఇప్పటిదాకా దాదాపు 80–90 సార్లు ఓటమిని చవిచూసినా విపక్షాలు తమ తీరును మార్చకోలేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియలో పదేపదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనాసరే కొన్ని పార్టీలు పార్లమెంట్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలనుద్దేశించి మోదీ ఘాటు విమర్శలు చేశారు. ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ సభాకార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నూతన పార్లమెంట్ భవనం ఎదుట మీడియాతో మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌పై పట్టుకు యత్నం‘పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 80–90 సార్లు ఎన్నికల్లో ఓడినా విపక్షాల తీరు మారలేదు. విపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు పార్లమెంట్లో చర్చలు జరగ నివ్వట్లేదు. ప్రజాస్వామ్య సూత్రా లను, ప్రజల ఆకాంక్షలను గౌరవించరు. ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు’’ అని మోదీ విమర్శల దాడి చేశారు. కొన్ని ప్రతిపక్షపార్టీలు సహకరిస్తున్నా‘‘కొందరు విపక్ష నేతలు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. వీళ్ల వైఖరిని ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కులను అణచివేస్తుంది. వారి కొత్త ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని దెబ్బతీస్తోంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ పార్టీల మనసుల్ని వాటి మిత్రపక్షాలు మార్చేస్తు న్నాయి. సభలో ఆందోళనలు, నిరసనలకే మొగ్గుచూపుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నాయి. సభా సజావుగా సాగేందుకు సిద్ధపడ్డ కొన్ని విపక్షపార్టీల గొంతును వాటి భాగస్వామ్య పార్టీలే నొక్కేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తు న్నాయి. వీళ్ల గొడవ వల్ల తొలిసారిగా సభకు ఎన్నికైనవారు కనీసం ప్రసంగించే అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారు’’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.భారత్‌లో వచ్చిన అవకాశం అరుదైంది‘‘ప్రపంచదేశాల పార్లమెంట్లతో పోలిస్తే భారత పార్లమెంట్లో సభ్యత్వం పొంది అభిప్రాయాలు వెల్లడించే అవకా శం రావడం నిజంగా అరుదు. పార్లమెంట్ వేదికగా ఇచ్చే సందేశం ప్రజా స్వామ్యంపై ప్రజలకున్న అంకితభావా నికి అద్దంపట్టాలి. నేడు ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని, ఖ్యాతిని ఇనుమడింపజేసేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకో వాలి. ప్రస్తుత సమావే శాలు అత్యంత ఫలవంతమవ్వాలి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తిచేసు కుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగ ప్రతిష్టను మనందరం పెంచుదాం. కొత్త ఆలోచనలతో సరికొత్త స్ఫూర్తిని నింపుదాం’ అని మోదీ అన్నారు. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఇందులో ఉంది. ఐదు నూతన బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 20న ముగుస్తాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ తమ నివేదికను పార్లమెంట్‌కు సమరి్పంచనుంది. పంజాబ్ న్యాయస్థానాల(సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్(రద్దు) బిల్లుపై పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. -
Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే 'పరమావధి'
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా రాజీ పడకుండా లోక్‌సభ,రాజ్యసభల్లో పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అన్ని కీలక అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న నిర్ణయం వల్ల కలిగే నష్టాన్ని సభలో ప్రస్తావించాలని చెప్పారు. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ఇదే అంశంపై ప్రధానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు, ఆర్ అండ్ ఆర్ నిధులు తక్షణమే విడుదల చేసి ముంపు ప్రాంత వాసులకు న్యాయం చేయాలని కోరాలని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఈ విషయమై ఉభయ సభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయబోమని, రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యేలా మన వంతుగా గట్టి ప్రయత్నం చేయాలని, ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ బిల్లును ఆమోదించకూడదని, దీనిపైనా ఆందోళన చేయాలని ఆదేశించారు. వక్ఫ్ బిల్లుతో సెక్యులర్ దేశం అన్న దానికి అర్థం లేకుండా చేస్తే.. ముస్లిం మైనారిటీల తరఫున అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని సూచించారు. అక్రమ కేసుల గురించి గట్టిగా మాట్లాడాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, హత్యా యత్నాలు జరుగుతూనే ఉన్నాయని, వీటన్నింటి గురించి పార్లమెంట్లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు. ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లు సాకుగా చూపుతూ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధిస్తుండటం.. పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుండటం యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ఉభయ సభల్లో మాట్లాడాలని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారని, ఒకరిద్దరిపై ఏకంగా 10–15 కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శంగా నిలుస్తోందని.. ఇంత తీవ్రమైన దారుణాలు గతంలో ఎన్నడూ చూడలేదనే విషయాన్ని అన్ని పారీ్టల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మరోవైపు టీడీపీకి చెందిన సోషల్ మీడియా పెడుతున్న దారుణమైన పోస్ట్‌లపై వైఎస్సార్సీపీ నాయకులు సాక్ష్యాధారాలతో సహా ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎక్కడా పోలీసులు స్పందించడం లేదని, కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదనే విషయాలను ఎత్తి చూపాలని సూచించారు. ఈ విషయాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం సమావేశ వివరాలను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాష్ చంద్రబోస్.. ఎంపీలు తనూజా రాణి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, చట్ట విరుద్ధమైన అరెస్టుల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ దిశా నిర్దేశం మేరకు రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలన్నింటి గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. -
డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు !
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో మొదలవుతాయని సమాచారం. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయని, డిసెంబర్ 25న క్రిస్మస్కు ముందు ముగుస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో స్టాండింగ్ కమిటీ ఇటీవలే ఆమోదించిన కొత్త చట్టాలు ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు సైతం పార్లమెంటు వద్ద పెండింగ్‌లో ఉంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడో వారంలో మొదలై క్రిస్మస్ ముందు ముగియడం ఆనవాయితీగా వస్తోంది. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. అన్నిప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చూస్తామని ఓం బిర్లా అన్నారు. చదవండి: (శబరిమల యాత్ర నిలిపివేత.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ) -
18 నుంచి డిసెంబర్ 13 వరకు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. -
నవంబర్ 18నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉభయ సభల కార్యదర్శులకు తెలియజేసింది. కాగా గత ఏడాది శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి జనవరి మొదటి వారం వరకు నిర్వహించారు. ప్రస్తుత సమావేశాల్లో వివిధ బిల్లులతో పాటు, రెండు కీలకమైన ఆర్డినెన్స్‌లను చట్టంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961, ఆర్థిక చట్టం 2019లను సవరిస్తూ.. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గించాలని, అలాగే ఈ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించడానికి ఆర్డినెస్స్లను తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశంలో ప్రస్థుతం నెలకొన్న ఆర్థికమాంద్యం పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు, అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నవంబర్‌లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. -
వ్యవస్థ ప్రక్షాళనకే నోట్ల రద్దు..!
ప్రధాని స్పష్టీకరణ ► నవంబర్ 8నిర్ణయం తర్వాత కాంగ్రెస్‌లో నిరాశ న్యూఢిల్లీ: నోట్లరద్దు లాంటి కఠిన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ నాయకత్వం నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయిందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్నాయన్నారు. ఇండియాటుడే చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నోట్లరద్దు నిర్ణయం తర్వాత తలెత్తిన పరిణామాలు, విపక్షాల విమర్శలు, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు, ప్రజల కష్టాలు, పన్ను కట్టేవారికి భరోసా వంటి అంశాలపై మోదీ స్పష్టతనిచ్చారు. వివిధ అంశాలపై ప్రధాని స్పందనను గమనిస్తే.. కాంగ్రెస్‌పై: ‘విపక్షాలను చూస్తే జాలేస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌నాయకత్వం. నోట్లరద్దు తర్వాత వారి నిరాశ, నిస్పృహలను బహిరంగంగా వెళ్లగక్కారు. ఎప్పుడు చూసినా ఎన్నికల గురించే తప్ప వారు దేశం గురించి ఆలోచించరు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఎలాంటి చర్చ జరగకుండా ఆందోళన చేశారు. పార్లమెంటులో విపక్షాల ఆందోళన అర్థం చేసుకోవచ్చు. కానీ తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై అవినీతికి అనుకూలంగా సభాకార్యక్రమాలను స్తంభింపజేశాయి. సభ జరిగేలా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది’ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై: ‘ఘోరమైన తప్పిదం, వ్యవస్థీకృత దోపిడీ అని మన్మోహన్ అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. 45 ఏళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా?. మన్మోహన్ వ్యాఖ్యలు.. ఆయన నాయకత్వంలో జరిగిన కుంభకోణాల (2జీ, సీడబ్ల్యూజీ, బొగ్గు కుంభకోణం ఇలా చాలానే జరిగాయి) గురించే అనుకుంటా’ (వ్యంగ్యంగా) నోట్లరద్దు విమర్శలపై: ‘నోట్లరద్దు నిర్ణయంలో రాజకీయమేమీ లేదు. స్వల్పకాల రాజకీయ లబ్ధికోసం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని క్లీన్ చేసేందుకు మొదలుపెట్టిన ప్రయత్నిమిది. అవినీతి, దోపిడీని పూర్తిగా అణచివేసేందుకు తీసుకున్న కఠినమైన నిర్ణయం. ఎన్నికల కోసం రాజకీయాలు చేసే వాణ్ణికాను. దీర్ఘకాల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నా. రాజకీయ అవినీతిని పారద్రోలేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి. నోట్లరద్దు నిర్ణయం మా నీతి (విధానం), తప్పుచేసిన వారిపై కఠినంగా వ్యవహరించటం మా రణ్–నీతి (వ్యూహం). నల్లధనం ఉన్నవారు ఏ కొత్త మార్గంలో వెళ్లినా మేం వెతికి పట్టుకుంటాం.. ఏమాత్రం సందేహం లేదు’ రద్దుకు తర్వాత ఏం మార్పు వస్తుంది?: ‘దేశంలో పన్నులు కట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. అంతకుముందు ఐటీ అధికారులు చీకట్లో కాల్చేవారు (లక్ష్యం లేకుండా దాడులు జరిగేవి). కానీ ఈ నిర్ణయంతో ప్రజలు దాచుకున్నది స్వచ్ఛందంగా డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ అధికారులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లేందుకు వీలుంటుంది. అవినీతిని సహించేది లేదు. తప్పుచేసిన వారెంతవారైనా సరే వదిలేది లేదు. ’ 31న మోదీ ప్రసంగం న్యూఢిల్లీ: నోట్లరద్దు నిర్ణయం, తదనంతర పరిణామాలు, భవిష్యత్తు గురించి దేశ ప్రజలనుద్దేశించి శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. నవంబర్ 8 నిర్ణయం తర్వాత పాతనోట్ల డిపాజిట్‌కు 50 రోజులు పూర్తవనున్న సందర్భంగా మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘కొత్త సంవత్సరం సుర్యోదయానికి ముందే దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నోట్లరద్దు తర్వాతి పరిస్థితులు, నగదు సరఫరాకు సంబంధించిన వివరాలు, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కారం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను మోదీ వివరించే అవకాశం ఉంది. మంగళవారం నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితిపై మోదీ చాలాసేపు చర్చించారు. కాగా, నల్లధనం, అవినీతి నిర్మూలనకోసం కేంద్రం ప్రతిషా్ఠత్మకంగా ఈ నిర్ణయం వెల్లడిస్తున్న సందర్భంగా నవంబర్ 8న ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు కొన్నాళ్లపాటు సమస్యలు తప్పవని.. అయితే.. 50 రోజుల తర్వాత ఈ సమస్యలు మెల్లిగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. వివిధ వేదికల ద్వారా కూడా ప్రధాని ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు. -
బీజేడీ ఎంపీ షాకింగ్ నిర్ణయం
భువనేశ్వర్: బిజు జనతా దళ్(బీజేడీ) ఎంపీ బైజయంత్ పాండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఓ కొత్తదారి ఎంచుకున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలకు గానూ తాను కేవలం లోక్‌సభ జరిగిన సమయానికి మాత్రమే వేతనం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీజేడీ ఎంపీ జే పాండా మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ, రాజసభ పలుమార్లు వాయిదా పడటంతో సభా సమయం వృథా అయిపోయింది. ఇందుకుగానూ తాను కేవలం ఈ సమావేశాల్లో సభ జరిగిన కొద్దిపాటి సమాయినికే వేతనం తీసుకుంటానని, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పారు. ఎంపీ పాండా ఒడిషాలోని కేంద్రపారా నుంచి ఎంపీగా గెలుపొందారు. సాధారణంగా ఎంపీలు(లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు) ఎవరైనా పార్లమెంట్ సమావేశాలకు హాజరయితే అందుకుగానూ రోజుకు కొంత మొత్తం నగదు చెల్లిస్తారు. అయితే పార్లమెంట్ సమావేశాలలో ఉభయసభలు ఎక్కువ సమయం వాయిదా పడ్డ విషయం అందరికీ విదితమే. పెద్ద నోట్ల రద్దుపై చర్చించాలని ఎన్డీఏయేతర పక్షాలు పట్టుబట్టడం.. ఎన్డీఏ మిత్ర పక్షాలు చర్చకు రాకపోవడంతో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగి లోక్‌సభ 19 గంటలు జరిగి, 92 గంటల సమయం వృథా అయింది. రాజ్యసభ 22 గంటలు కొనసాగి, 86 గంటల సమయాన్ని కోల్పోయాం. -
చర్చ లేకుండానే ముగింపు
తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ► నోట్ల రద్దుపై చివరి రోజు వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ ► 21 రోజుల్లో 19గంటలు సాగిన లోక్‌సభ, 22గంటలు సాగిన రాజ్యసభ న్యూఢిల్లీ: తాము చెప్పినట్లు వినాలంటూ విపక్షాలు, తమకు నచ్చినట్లే జరగాలంటూ అధికార పక్షం పట్టుదలతో నెలరోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై తలెత్తిన ఇక్కట్లపై చర్చించాల్సిన అధికార, విపక్షాలు ఉభయసభల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు సభా సమయాన్ని పణంగా పెట్టాయి. దీంతో చివరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉభయసభల్ని నిరవధికంగా వాయిదావేశారు. నవంబర్ 16న సమావేశాలు మొదలుకాగా తొలి రోజు నుంచి సభల్లో వాయిదాలు కొనసాగాయి. నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో గందరగోళం కొనసాగింది. అంతరాయం వల్ల లోక్‌సభలో 92 గంటల సభా సమయం వృథా అయ్యింది. మొత్తం 21 రోజుల పాటు లోక్‌సభ సమావేశం కాగా... కేవలం 19 గంటలే నడిచింది. రాజ్యసభలో 86 గంటల సమయం వృథా కాగా., సభ 22 గంటలే పనిచేసింది. వాయిదాల వల్ల రాజ్యసభ జాబితాలోని 330 ప్రశ్నలకు గాను కేవలం రెండింటికి, లోక్‌సభలో మొత్తం 440 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలిచ్చారు. లోక్‌సభలో నోట్ల రద్దుపై 193 నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను మొదలుపెట్టినా... విపక్షాల ఆందోళనలతో అది కొనసాగలేదు. సభా కార్యకలాపాలన్ని రద్దు చేసి నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానాలు చేపట్టాలంటూ మొదటి రోజు నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ స్పీకర్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభలో సమావేశాల మొదటి రోజే నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. ప్రధాని సభలోనే ఉండాలన్న విపక్ష డిమాండ్‌తో సభ పదేపదే వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ సమావేశం కాగానే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి తాము నోట్ల రద్దు చర్చకు సిద్ధమని గురువారమే చెప్పామని, అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమపై అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు. దివ్యాంగుల హక్కుల బిల్లుకు ఆమోదం తాజా సమావేశాల్లో సభలు ఒక్క బిల్లునే ఆమోదించాయి. దివ్యాంగులపై వివక్షకు కఠిన శిక్షలకు ఉద్దేశించిన హక్కుల బిల్లును సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన దీనికి లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమోద సమయంలో ప్రధాని సభలో ఉన్నారు. ఖర్చు రూ.267 కోట్లు షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు 21 రోజుల పాటు సమావేశం కావాలి. కానీ, ఇందులో లోక్‌సభలో కేవలం 19 గంటలపాటు, రాజ్యసభలో 22.25 గంటలే సభాకార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా పార్లమెంటు నడిచేందుకు ఒక్కోసభలో నిమిషానికి రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది (చాలాకాలంగా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు). ఈ లెక్కన ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోవటంతో ఖజానాకు రూ. 267 కోట్లు నష్టం వాటిల్లింది. -
నేటితో ముగియనున్న శీతాకాల సమావేశాలు
-
ఇంకొక్క రోజే..!
► నేటితో ముగియనున్న శీతాకాల పార్లమెంటు ► కొనసాగుతున్న ప్రతిష్టంభన న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. నవంబర్ 16న సమావేశాల ప్రారంభం నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటం తో ఈసారి సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడేట్లు కనబడుతున్నాయి. గురువారం కూడా నోట్లరద్దు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతోపాటు ఇతర అంశాలపై ఇరు పక్షాల మధ్య వాగ్వాదంతో పార్లమెంటు వాయిదా పడింది. రైతు రుణాల మాఫీకి డిమాండ్ రాజ్యసభ ప్రారంభమైనప్పటినుంచీ విపక్షాలు, అధికార పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు నోట్లరద్దుతోపాటు వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన రైతులకు రుణాల మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. అటు అధికార పక్షం సభ్యులు కూడా అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో పలువురు యూపీఏ నేతలకూ సంబంధాలున్నాయంటూ ప్రచురితమైన పత్రికల కాపీలను చూపించారు. అధికార పక్షమే సభ సజావుగా నడవకుండా అడ్డుకుంటోందని గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను రోడ్లపై పారేసుకుంటున్నారు. అందుకే వారికిచ్చిన రుణాలను వెంటనే రద్దుచేయాలి’అని డిమాండ్ చేశారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ ఎంపీలు నినాదాలు చేస్తుండటంపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కురియన్ రాజ్యసభను వాయిదా వేశారు. ఏ నిబంధనైనా ఓకే: విపక్షాలు నోట్లరద్దుపై ఏ నిబంధన కిందైనా చర్చకు సిద్ధమేనని విపక్షాలు లోక్‌సభలో ప్రకటించాయి. అయితే.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగటంతో అధికార, విపక్షాలు పోటాపోటీగా ఆరోపణలకు దిగాయి. నోట్లరద్దుపై చర్చకు టీఆర్ఎస్ ప్రయత్నించటం, తృణమూల్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో తీవ్ర గందరగోళం మధ్యే సభ శుక్రవారానికి వాయిదా పడింది. -
ఉభయసభల్లో మారని తీరు
-
ఉభయసభల్లో మారని తీరు
నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్న ప్రతిపక్షం న్యూఢిల్లీ: మూడు వారాలు గడుస్తున్నా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏం మార్పూ లేదు. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం ఎదురుదాడి మధ్య శుక్రవారమై ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రకటించినా 16 రోజులుగా సభను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్ చేయడంతో గందరగోళం కొనసాగింది. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంతో పాటు గోధుమలపై దిగుమతి సుంకం తగ్గించడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభను స్పీకర్ వాయిదా వేయగా, వాయిదాల అనంతరం సమావేశమైన రాజ్యసభలో కోరం లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ... నోట్ల రద్దు, దాని పరిణామాలపై చర్చించేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. విపక్షాలు 16 రోజులుగా సభను నడవనీయలేదని అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యురాలు మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ... రాష్ట్రపతి సూచించినట్లు నిరసనలు, ధర్నాల కోసం జంతర్‌మంతర్ సరైన వేదికని పార్లమెంట్కాదన్నారు. ఉదయం సభ మొదలవగానే డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకుంటూ... ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి నివాళులర్పించారు. కోరం లేక రాజ్యసభ వాయిదా.. గోధుమలపై దిగుమతి సుంకం ఎత్తివేయడంపై రాజ్యసభలో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ, లెఫ్ట్ పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గోధుమల కొరత లేదని, ఇటీవల ధరలు పెరగడంతో తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార మంత్రి పాశ్వాన్ చెప్పారు. ఇదే తుది నిర్ణయం కాదని, అవసరమనుకుంటే సమీక్షించవచ్చన్నారు. ఇంతలో కురియన్ జీరో అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సహించేది లేదంటూ నినాదాలు చేశారు. -
పార్లమెంటులో అదే రచ్చ
బలమున్నా ఓటింగ్‌కు భయమెందుకు: తృణమూల్ - దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందా?: ఆజాద్ - విపక్షాల సూచనలు స్వీకరిస్తామన్న కేంద్రం న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మరో రోజూ ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడింది. నోట్ల రద్దుపై జరుగుతున్న రచ్చతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్‌సభలో నోట్లరద్దుపై రూల్ 184 కింద చర్చించాలన్న డిమాండ్‌తో విపక్షాలు సోమవారం నిరసన తెలిపాయి. అరుుతే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విపక్షాల సూచనలు వింటామన్నారు. ఏ రూల్ కింద చర్చ జరగాలనే విషయంపై నిర్ణయాధికారం స్పీకర్‌కే వదిలేద్దామని చెప్పారు. అరుునా విపక్షాల ఆందోళన తగ్గలేదు. దీంతో రూల్ 193 చర్చ (ఓటింగ్ ఉండదు)కు స్పీకర్ యత్నించారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే తృణమూల్ ఎంపీ ఒకరు జితేందర్ మైక్రో ఫోన్ లాక్కొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ వారుుదా పడింది. ‘మేం రూల్ 56 నుంచి రూల్ 184కు తగ్గాం. ప్రభుత్వం కూడా 193 నుంచి కాస్త తగ్గాలి’అని ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూరుుంచారుు. అనారోగ్యం నుంచి కోలుకున్న కాంగ్రెస్ చీఫ్ సోనియా సభకు రాగా, జయ అనారోగ్యం కారణంగా అన్నాడీఎంకే ఎంపీలంతా గైర్హాజరయ్యారు. ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా?: అటు రాజ్యసభలోనూ.. నోట్ల రద్దు కారణం గా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేశారుు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ ఎంపీలు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు.దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని ఆజాద్ (కాంగ్రెస్) ప్రశ్నించారు. ఇక కొత్త ఐఐటీల్లేవ్: కొత్తగా ఏ రాష్ట్రం లోనూ ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్‌ఐటీలను స్థాపించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ తెలిపారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ అందించే పథకాలను ఎక్కువ మందికి అందించేందుకు వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచాలని ప్రతిపాదనలు అందినట్లు కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. -
‘నోటు’పై హోరాహోరీ!
పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా పౌరులంతా బజారునపడిన వేళ బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిహద్దు ఆవల మన సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘటన ఈ సమావేశాల్లో ప్రముఖంగా చర్చకొస్తుందని అందరూ అంచనా వేస్తున్న సమయంలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు సంగతిని ప్రకటించారు. మరో రెండు, మూడు గంటల్లో ఆ నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానం కాబోతున్నాయని చెప్పి అందరిలో వణుకు పుట్టించారు. పల్లెసీమల సంగతేమోగానీ నగరాలు, పట్టణాల్లోని జనం అప్పటికప్పుడు ఏటీఎంల దగ్గరకు పరుగెత్తారు. వాటిలో సైతం ‘కాబోయే చిత్తు కాగితాలు’ బయట కొస్తుంటే తలలు పట్టుకున్నారు. మోదీ ప్రకటనలోని ఆంతర్యాన్ని తెలుసు కోలేని వారు ఆ రోజుకు టీవీలు కట్టేసి కంటినిండా నిద్రపోయి ఉండొచ్చుగానీ... తెలతెలవారాక పాల ప్యాకెట్లు అమ్మేవారు ఇది చిత్తుకాగితమని చెప్పేసరికి తెల్ల బోయారు. అప్పటికీ తెలివి తెచ్చుకోనివారికి ఇతరచోట్ల జ్ఞానోదయమైంది. ఇక ఆ క్షణం నుంచి ఎవరికీ నిద్ర లేదు. వేరే వ్యాపకానికీ అవకాశం లేదు. అన్నీ మరిచి ఏటీఎంల దగ్గరా, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం తప్ప దిక్కూ మొక్కూ లేకపోయింది. ఆనాటినుంచీ పిల్లలూ, పెద్దలూ, పిల్లల తల్లులు, వికలాంగులూ, వృద్ధులూ... అందరికందరూ అన్నపానీయాలను మరిచి నిలువుకాళ్ల యజ్ఞం చేస్తున్నారు. గుండె ఆగి మరణించినవారు కొందరైతే, పాత నోట్లిస్తే వైద్యానికి నిరాకరించిన ఉదంతాల్లో మృత్యువాతపడినవారు మరికొందరు. తమ చర్యల ఆంతర్యం నల్లధనం పనిపట్టడమేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో సహజంగానే నిప్పులు కురుస్తాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధపడుతోంది. జాతి విస్తృత ప్రయోజనాలరీత్యా ఈ నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి సహకరించమని అఖిలపక్ష సమావేశంలో మోదీ విజ్ఞప్తి చేశారు. ‘మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. చర్చించండి. వాదిం చండి. కానీ ఈ సమావేశాలను సజావుగా సాగనివ్వండ’ని ఆయన కోరారు. వాస్తవానికి ప్రధాన సమస్య పెద్ద నోట్ల రద్దుతోపాటు దేశాన్ని వేధిస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. జమ్మూ–కశ్మీర్ ఇంకా కుదుటపడలేదు. సాక్షాత్తూ ఢిల్లీలోనే ఉన్నతశ్రేణి విశ్వవిద్యాలయం జేఎన్‌యూలో ఒక విద్యార్థి మాయమై రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. అదే నగరంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ప్రొఫెసర్లకు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఒక హత్యలో ప్రమేయం ఉన్నదంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఇవిగాక ఎన్నికల్లో పార్టీలకు ప్రభుత్వం నిధులు సమకూర్చడం, ఏక కాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వంటివి అతి ముఖ్య మైన సమస్యలని కేంద్రం చెబుతోంది. ఈ రెండింటినీ చర్చించాలనడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంగా మన దేశంలో చట్టసభల పని తీరు ఎలా ఉంటున్నదో, అందులో ఎవరి పాపమెంతో... వాటిని సరైన తోవన పెట్టడం ఎలాగో కూడా నిగ్గుతేలిస్తే మంచిదే. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ, విపక్ష సభ్యుల్ని సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్న పోకడలను చర్చిస్తే మేలే. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ఈ ధోరణులకు ఎవరు బాధ్యతవహించాలో తేల్చడమూ అవసరమే. చర్చలో విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రమే కాదు... ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా అత్యవసరం. ఎన్నికల్లో పార్టీలకు నిధులు సమకూర్చడంపై చర్చ సాగాల్సిందే. కానీ అంతకన్నా ముందు ఆ ఎన్నికలకు విశ్వసనీయత కల్పించడమెలా అన్న విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. నెగ్గడం కోసం నానాగడ్డీ కరవడం, అలవికాని హామీలివ్వడం, అధికారంలోకొచ్చాక వెన్ను పోటు పొడవటం ఎలాంటి నీతో... దానివల్ల మొత్తంగా ఎన్నికలంటేనే ఏవగింపు కలిగే స్థితి ఏర్పడటం ఎంత ప్రమాదకరమో చర్చించాలి. మిగిలినవన్నీ వాటి తర్వాతనే. గత అనుభవాలు చూస్తే విపక్షాల ఏకైక వ్యూహం పార్లమెంటును సాగనీయ కుండా చేయడమేనని అర్ధమవుతుంది. సమావేశాలు చాపచుట్టుకుపోతే... పదే పదే అవి వాయిదాల్లో గడిచిపోతే దాన్ని తమ విజయంగా భావించడం రివాజు అయింది. ఇప్పుడు సైతం అలాగే వ్యవహరిద్దామనుకుంటే జనం మెచ్చరని... సభను స్తంభింపజేయడం కాక ‘ఎలాగైనా’ చర్చ సాగేలా చూడటం తక్షణావస రమని విపక్షాలు తెలుసుకోవాలి. మరోవైపు కీలకమైన సమస్యలు వచ్చిపడిన ప్పుడు చర్చను పక్కదోవ పట్టించే వ్యూహం ప్రభుత్వాలకు ఎటూ ఉంటుంది. హఠాత్తుగా మరేదో సమస్యను తెరమీదికి తెచ్చి సభ దృష్టి మళ్లించిన సందర్భాలు యూపీఏ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంది. పార్లమెంటు సమావేశాలు ఎలా ఉండబోతాయో మంగళవారంనాటి పరిణా మాలే చెబుతున్నాయి. పరస్పరం తలపడే తృణమూల్, సీపీఎంలు రెండూ విపక్ష సమావేశానికి హాజరుకావడం, తామంతా పార్లమెంటులో ఉమ్మడి పోరుకు సిద్ధ పడుతున్నామని సంకేతాలివ్వడం కీలకమైన అంశమే అయినా...పెద్ద నోట్ల రద్దు ఉత్పాతంపై సమష్టిగా రాష్ట్రపతిని కలుద్దామన్న తృణమూల్ ప్రతిపాదనకు ఎవరూ సుముఖత చూపకపోవడం గమనించదగ్గది. అందుకు మరికాస్త సమయం తీసు కుందామన్న ఇతర పార్టీల సూచన ఆమెకు రుచించలేదు. మరోవైపు కేరళలో తమ ప్రభుత్వం చేస్తున్నట్టు బెంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నోట్ల స్వీకారానికి ముందుకు రావాలన్న సీపీఎం సూచనపైనా ఆమె ఎటూ తేల్చలేదు. అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ నేతలు యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు కాజేశారని విమర్శించారు. కనుక ప్రధానంగా ఈ రెండు పక్షాల భుజ బలప్రదర్శనకూ ఈ సమావేశాలు వేదికవుతాయన్న అనుమానాలు తలెత్తుతు న్నాయి. అదే జరిగితే జనం క్షమించరు. తక్షణ సమస్యలపై చర్చించడం, సరైన పరి ష్కారాలను అన్వేషించడం, చట్టసభల ఔచిత్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్ని పక్షాలూ గుర్తించాలి. -
విభజన హామీలను లేవనెత్తుదాం
♦ కొత్త జిల్లాలకు సాయంపైనా అడగాలి ♦ పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం ♦ ముగ్గురు ఎంపీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ ఎంపీలతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభలో పార్టీ నేత జితేందర్‌రెడ్డి సోమవారం జరిగే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కానీ సీఎం వద్ద జరగాల్సిన ఈ సమావేశం రద్దయ్యింది. ఆదివారమే ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌లతో సీఎం సమావేశమయ్యారని తెలిసింది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై వీరితో చర్చించారని సమాచారం. హైకోర్టు విభజన, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాల అమల్లో జరుగుతున్న జాప్యం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను సభలో టీఆర్ఎస్ లేవనెత్తనుందని సమాచారం. ప్రధానంగా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన వివిధ సౌకర్యాల అంశాన్ని కూడా లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో రాష్ట్రాదాయానికి పడుతున్న గండిపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని కేంద్రం ఎలా భర్తీ చేయనుందో సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వ్యూహాన్ని పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. -
నవంబర్ 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 16 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 16 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. సర్జికల్ దాడులు, కశ్మీర్ లో సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరిగిన వర్షాకాల సమావేశాల్లో కీలక జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. -
రాజ్యాంగం మన జీవనాడి
* వాడివేడి చర్చతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు షురూ * ‘లౌకికవాదం’ పదం చాలా దుర్వినియోగమవుతోంది: రాజ్‌నాథ్ * లౌకికవాదం అంటే.. ‘ధర్మ నిరపేక్షత’ కాదు.. ‘పంత్ నిరపేక్షత’ * రాజ్యాంగంలోని నియమాలపై దాడి జరుగుతోంది: సోనియా * విమర్శ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం: లోక్‌సభ స్పీకర్ * అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక్‌సభలో చర్చ న్యూఢిల్లీ: ‘భారత రాజ్యాంగానికి నిబద్ధత’ అనే అంశంపై చర్చతో అధికార, విపక్షాల మధ్య పరస్పర విమర్శలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. రాజ్యాంగ పీఠికలోని ‘లౌకికవాదమ’నే పదం చాలా దుర్వినియోగమవుతోందని ప్రభుత్వమంటే, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని విపక్షాలు ‘అసహనం’ అంశాన్ని లేవనెత్తాయి. స్పీకర్ సహా అధికార, విపక్ష సభ్యులందరూ రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కొనియాడారు. తొలి రోజు ప్రారంభంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సామరస్య పూర్వక వాతావరణం కనిపించింది. ప్రధాని మోదీ సభలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, టీఎంసీ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, ఆర్జేడీ నేత జైప్రకాష్ల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ, కరచాలనాలు చేస్తూ అభివాదం చేశారు. ఆ సమయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ సభలో లేరు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై మురళీమనోహర్ జోషి, మరో ఇద్దరు సీనియర్ నేతలతో కలిసి పార్టీ నాయకత్వం మీద ధ్వజమెత్తిన కురువృద్ధుడు అద్వానీకి మోదీ అభివాదం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా, మంత్రి వెంకయ్య, మరి కొందరు బీజేపీ నేతలు ప్రతిపక్షాల స్థానాలకు వెళ్లి అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు. జైట్లీ ప్రతిపక్షాల స్థానం వద్దకు వెళ్లి ఆజాద్, శరద్‌యాదవ్, ఏచూరి, మాయావతి సహా విపక్ష నేతలందరినీ పలుకరించారు. రోజంతా సభలోనే మోదీ: చర్చ సందర్భంగా మోదీ గురువారం రోజంతా సభా కార్యక్రమాలు సాగినంత సేపూ సభలోనే కూర్చోవటం విశేషం. సభ్యులు మాట్లాడుతున్నపుడు వింటూ, నోట్స్ రాసుకున్నారు. ఉదయం 11కు మొదలైన సమావేశం గంట భోజన విరామం తర్వాత రాత్రి 7:15 వరకూ కొనసాగింది. మోదీ రోజంతా సభలో ఉండి రికార్డు సృష్టించారంటూ ఖర్గే వ్యాఖ్యానించి సభ్యులను నవ్వించారు. ‘లౌకికవాదం’ చాలా దుర్వినియోగమవుతోంది ‘‘రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ రెండు పదాలూ రాజ్యంగంలో భాగమైనందున.. వాటిని పీఠికలో చేర్చాల్సిన అవసరముంటుందని బి.ఆర్.అంబేడ్కర్ ఎన్నడూ ఆలోచించలేదు. * సెక్యులరిజం (లౌకికవాదం) అనే పదానికి హిందీలో ‘ధర్మ నిరపేక్షత’ అనే పదాన్ని వినియోగించటం సరికాదు. సెక్యులరిజం పదానికి ‘పంత్ నిరపేక్షత’ (హిందీలో పంత్ అంటే మతం లేదా మతవర్గం) అనేది వాస్తవ అనువాదం. ఇది హిందీ అధికారిక అనువాదమైనందున ఈ పదాన్ని వినియోగించాలి. * ‘లౌకికవాదం’ అనేది దేశంలో అత్యంత అధికంగా దుర్వినియోగం చేసిన పదం. పదాన్ని అతిగా దుర్వినియోగం చేయటం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న ఉదంతాలు ఉన్నాయి. * రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేశారు. కోటా అనేది రాజ్యాంగంలో భాగం. ఈ అంశంపై ఇక చర్చకు ఆస్కారమే లేదు. * సీత విషయమై ఎవరో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తినపుడు ఆమెను ‘అగ్ని పరీక్ష’ ఎదుర్కోమన్న రాముడు గొప్ప ప్రజాస్వామ్యవాది. * అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు, వివక్షకు గురైనా కూడా.. ఈ దేశాన్ని వదిలి వెళ్లాలని ఎన్నడూ ఆలోచించలేదు. (అమీర్‌ఖాన్ అసహనం విషయమై మాట్లాడుతూ తన భార్య దేశం విడిచి వెళదామా అన్నారన్న వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ పరోక్షంగా విమర్శించారు.) ముస్లింలలోని 72 తెగలన్నీ నివసించే దేశం, జోరాస్ట్రియన్, యూదు తెగలు నివసించే దేశం భారతదేశం. * అంబేడ్కర్ తత్వశాస్త్రంతో, రాజ్యాంగంతో మోదీ స్ఫూర్తి పొందారు.. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బఢావో - బేటీ పఢావో వంటి పథకాలను ప్రారంభించారు. చర్చలకు సభా వేదిక కన్నా పెద్దది ఏదీ ఉండదు ‘‘ఈ సమావేశాల్లో ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ చర్చ, ఉత్తమ వినూత్న భావనలు వస్తాయని విశ్వసిస్తున్నా. చర్చలకు సభా వేదిక కన్నా మరొక పెద్ద వేదిక ఏదీ ఉండదు. ’’ అని ప్రధాని మోదీ విలేకరులతో పేర్కొన్నారు. ఆయన గురువారం పార్లమెంటు భవనం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగే విషయమై బుధవారం అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ తాను మాట్లాడినట్లు చెప్పారు. ‘‘రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మా లక్ష్యం. రాజ్యాంగం ఒక ఆశాకిరణం. అది మన మార్గదర్శి’’ అని తెలిపారు. ‘‘ఆశ(హోప్) అంటే సామరస్యం, అవకాశం, ప్రజాభాగస్వామ్యం, సమానత్వం అని’’ ఆయన అన్నారు. రాజ్యాంగం రూపకల్పనపై పార్లమెంటు గ్రంధాలయ భవనంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శనను మోదీ సందర్శించారు. ఆదర్శాలు, విలువలను పాటిద్దాం: ‘‘చరిత్రాత్మకమైన తొలి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మీకు స్ఫూర్తినివ్వాలి. భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వటం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహిళలు, పురుషులు అందరికీ ఈ దినోత్సవం ఒక నివాళి. మనమంతా రాజ్యాంగపు ఆదర్శాలు, విలువలను పాటిద్దాం.. దేశ నిర్మాతలు గర్వించే భారతదేశాన్ని తయారు చేద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన అపూర్వ కృషిని గుర్తు చేసుకోకుండా మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవటం అసంపూర్తిగానే ఉంటుంది. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా’’ అని మోదీ ట్విటర్లో వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనుల్లంఘనీయం ‘‘రాజ్యాంగంలో పరిపాలనా ప్రణాళికకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే మూడు సూత్రాలు కేంద్రంగా ఉండే స్వేచ్ఛాయుత రాజకీయాలు భారతదేశానివి. * వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనేవి ఉమ్మడి మేలు లాగానే అనుల్లంఘనీయం. * ప్రతి వ్యక్తికీ విశ్వాసం, మతం, ఆరాధన హక్కును రాజ్యాంగం హామీ ఇస్తోంది. * ప్రజాస్వామ్య పరిపాలనలో ఏకాభిప్రాయ నిర్మాణం అనేది చాలా కీలకమైన అంశం. అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనటానికి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరస్పరం చర్చిస్తూ, కలిసి పనిచేయాల్సి ఉంటుంది. * రాజ్యాంగంలోని రాజ్య విధానానికి సంబంధించిన ఆదేశక సూత్రాలు.. న్యాయబద్ధమైన సామాజిక క్రమాన్ని నిలబెట్టి, కాపాడాలని చెప్తున్నాయి. * ప్రజాస్వామ్యానికి మౌలిక పునాదులుగా బలమైన సంస్థలను రాజ్యాంగం అందిస్తోంది. రాజ్యపు మూడు అంగాలు - శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు - సామరస్యంగా పనిచేయాలి. * కీర్తిప్రతిష్టలతో విశ్రమించే సమయం కాదిది. అభివృద్ధికి సంబంధించి మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఇన్నేళ్లలో బలమైన సంస్థాగత, ప్రభుత్వ నిర్మాణాలను మనం అభివృద్ధి చేసుకున్నాం. విద్య, అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళల భద్రత వంటి ఎంతో కీలకమైన రంగాల్లో మన లక్ష్యాలను సాధించుకోవటానికి మరింత కష్టపడి పనిచేయాల్సిన సమయమిది.’’ రాజ్యాంగ ఆదర్శాలపై దాడి జరుగుతోంది ‘‘రాజ్యాంగంలోని ఆదర్శాలు, నియమాలు ప్రమాదంలో పడ్డాయి. వాటిపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది. కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న ఉదంతాలు.. రాజ్యాంగ మూలసూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి. * ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ.. దానిని అమలు చేసే వారు చెడ్డవారు అయితే.. తుది ప్రభావం చెడ్డగానే ఉంటుంది’ అని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. * రాజ్యాంగంపై ఎన్నడూ విశ్వాసం లేని వారు, రాజ్యాంగ రచనలో పాలుపంచుకోని వారు.. ఇప్పుడు దానిపై ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు దానికి నిబద్ధతపై చర్చ జరుపుతున్నారు. ఇంతకు మించిన పెద్ద జోక్ ఇంకేదీ ఉండదు. * రాజ్యాంగం సరళమైనదని నిరూపితమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దానికి వందకు పైగా సవరణలు జరిగాయి. * అమెరికా, బ్రిటన్, జర్మనీల్లో రాజకీయ సిద్ధాంతం, ఆర్థికశాస్త్రాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగివచ్చి, షెడ్యూల్డు కులాలు, అణగారిన వర్గాల వారి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న అంబేడ్కర్ అసమాన ప్రతిభను, శక్తిసామర్థ్యాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. * ‘నన్ను చైర్మన్‌గా ఎంపిక చేయటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీలో నా కన్నా విద్యావంతులు, ఉత్తములైన వారు ఉన్నారు’ అని అంబేడ్కర్ అప్పుడు చెప్పారు. * 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించినప్పుడు.. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేడ్కర్ కన్నా ఉత్తమ సారథి మరొకరు ఉండబోరని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కితాబునిచ్చారు. * రాజ్యాంగం చరిత్ర చాలా పురాతనమైనది. 1931 మార్చిలో నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరాచీ సదస్సులో ప్రాధమిక హక్కులు, ఆర్థిక హక్కులపై తీర్మానం చేసింది.’’ సామ్యవాద, లౌకిక పదాలు లేకుండానే... న్యూఢిల్లీ: రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకల సందర్భంగా గురువారం ఆప్ ప్రభుత్వం ఇంగ్లిష్ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో సామ్యవాద, లౌకిక పదాలు ప్రచురితం కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొరపాటుకు ఆప్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించి, 4 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా సమాచార, ప్రచార శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. జరిగిన పొరపాటుకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విచారం వ్యక్తం చేశారు. ‘భారతీయ భాషలకు అధికార హోదా’ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు, తమిళం సహా భారతీయ భాషలన్నింటికీ అధికార భాష హోదా కల్పించాలని లోక్‌సభ ఉపసభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువా రం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషలను అధికార భాషలుగా గుర్తిస్తూరాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకురారు? నేను తమిళంలో పార్లమెంటులో మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి? మా సొంత భాషలో మాట్లాడుకునే హక్కు మాకుంది. అని అన్నారు. భారత ఆత్మకు ప్రతిబింబం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్... రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటోంది. నేడు ప్రపంచం భారత్ వైపు, భారత విలువలవైపు చూస్తోందంటే అందుకు మన రాజ్యాంగమే ప్రధాన కారణం. ఇప్పటి దాకా వందసార్లు సవరణలు జరిగినా.. ప్రాథమిక కూర్పునకు ఎక్కడా భంగం వాటిల్లకపోవటమే మన రాజ్యాంగం ప్రత్యేకత. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం కూర్పు, రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను గమనిస్తే.. * 1930ల నుంచే సొంత రాజ్యాంగం కోసం కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది. * ఎన్నో తర్జన భర్జనలు, గొడవల తర్వాత 1946లో వైస్రాయ్ లార్డ్ వావెల్ ఇందుకు అంగీకరించారు. * రాజ్యాంగ రచనకు 1946 నుంచి 1949 మధ్య రెండు సంవత్సరాల 11నెలల 18 రోజుల సమయం పట్టింది. * రాజ్యాంగ పరిషత్తులో ప్రతీ వర్గానికి ప్రాతినిధ్యం లభించింది. 9 మంది మహిళలు ఇందులో ఉన్నారు. 24 మంది అమెరికన్లు కూడా రాజ్యాంగ చర్చలో ఏడ్రోజుల పాటు పాల్గొన్నారు. * రాజ్యాంగ రచన సమయంలోనే దేశంలో మతఘర్షణలు, కులపోరాటాలు చోటుచేసుకున్నాయి. * దీంతో ప్రాథమిక విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతత్వాలను రాజ్యాంగంలో చేర్చారు. * రాజ్యాంగ నిజప్రతిని ప్రఖ్యాత లేఖకుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ చేత్తో రాశా రు. ఇందుకు ఆయనకు ఆరు నెలలు పట్టింది. ఇందుకు ఒక్క పైసా తీసుకోలేదు. * వివిధ భాషల్లో రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగినా.. రాజ్యాంగాన్ని మాత్రం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాశారు. * ఇప్పటికీ రాజ్యాంగం నిజప్రతులు పార్లమెంటు లైబ్రరీలోని హీలియం చాంబర్స్‌లో భద్రంగా ఉన్నాయి. * ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, రష్యా నుంచి ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు విధులు, కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వ సమాఖ్య, యూకే నుంచి ప్రధాన మంత్రి, కేబినెట్, పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని తీసుకున్నారు. * 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ ఆమోదించింది. * 1950, జనవరి 26 రాజ్యాంగ అమలు ప్రారంభం కావటంతో.. గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించింది. * 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. * దీనికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు రాజ్యాంగ పరిషత్ 166సార్లు సమావేశమైంది. * ఇందులో 144 రోజులు రాజ్యాంగ ముసాయిదాపైనే చర్చ జరిగింది. * చర్చ సందర్భంగా ప్రతిపాదించిన 7,635 సవరణల్లో 2,473 సవరణలను తిరస్కరించారు. * ప్రపంచంలోనే అతిపెద్దదైన మన రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 అధికరణలు, 5 అనుబంధాలున్నాయి. -
ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం ఉభయ సభలు జాతీయ గీతంతో ఆరంభం అయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఇటీవల వరంగల్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్... ఇటీవల మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం చదివి వినిపించారు. కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గౌరవార్థం ఇవాళ, రేపు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలను స్పీకర్ కొనియాడారు. ఇక డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. మరోవైపు మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానం అనంతరం రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. -
ఆర్డినెన్స్ పాలన!
ఎన్నిసార్లు ఎంత ఘనంగా సంకల్పం చెప్పుకున్నా మన పార్లమెంటును సజావుగా నడపడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదని మళ్లీ రుజువైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేసరికి మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఉంది. సమావేశాలు ముగిసే రోజున జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో సైతం ఆ పార్టీ మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ ఎన్నికలన్నిటా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఆ రకంగా కేంద్రంలో పాలకపక్షం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు పార్లమెంటును నడపడం దానికి కష్టం కాకూడదు. లోగడ యూపీఏ సర్కారు ఉన్నప్పుడు వాయిదాల ప్రమేయం లేకుండా ఒక్కరోజు కూడా పార్లమెంటును సజావుగా నిర్వహించలేకపోయింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండు కోసం ఒక సందర్భంలో మొత్తంగా సమావేశాలే చాపచుట్టుకుపోయాయి. ఇప్పుడు సైతం అవే దృశ్యాలు కనబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ఎవరినో తప్పుబట్టడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం బీజేపీకి తక్షణావసరం. ఆ సంగతలా ఉంచి...నరేంద్ర మోదీ సర్కారు ఈ సమావేశాల్లో ఆమోదం పొంది ఉండాల్సిన రెండు ప్రధాన బిల్లుల స్థానంలో శుక్రవారం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఈ రెండూ అత్యంత కీలకమైనవి. ఒకటి బీమా రంగంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను 26 శాతంనుంచి 49 శాతానికి పెంచడానికి వీలు కల్పించేదైతే...రెండోది రద్దయిన బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చట్టసభలు ఉన్నతమైనవనీ... వాటిని విస్మరించి ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిద్దామని భావించడం రాజ్యాంగ విరుద్ధమనీ 1986లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయాల్సింది శాసనవ్యవస్థే తప్ప కార్యనిర్వాహకవ ర్గం కాదని ఆ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. చట్టసభల నిర్వహణ సాధ్యపడని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలని రాజ్యాంగంలోని 123వ అధికరణం కూడా సూచిస్తున్నది. కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూనే... ఆర్డినెన్స్ జారీ అత్యవసరమన్న అంశంలో ఆయన ముందుగా సంతృప్తి చెందాల్సి ఉంటుందని కూడా అన్నది. వాస్తవానికి ఆర్డినెన్స్‌లు జారీచేయడం దొడ్డిదారి పాలనతో సమానం. బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఈ ఆర్డినెన్స్ విధానాన్ని చట్టబద్ధం చేశారు. ఏ ప్రజాస్వామిక దేశంలోనూ ఇలాంటి పద్ధతి ప్రస్తుతం అమలులో లేదు. కాలం చెల్లిన చట్టాలను తొలగించడానికి నడుం బిగించిన మోదీ సర్కారు ఇలాంటి అప్రజాస్వామిక చట్టాల ఆధారంగా ఆర్డినెన్స్‌లను జారీచేయడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల పునఃవేలం అత్యవసరమైనదే. వాటి కేటాయింపులో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్నందున రెండేళ్లనుంచి అనేక పరిశ్రమలు అనిశ్చితిలో పడ్డాయి. మార్చి 31లోగా బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని, అందులో మళ్లీ ఆ క్షేత్రాలను సొంతం చేసు కున్న సంస్థలకే చోటుంటుందని, మిగిలినవాటికి అవి రద్దవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక వేలం ప్రక్రియ ప్రారంభించడం ముఖ్యమే. బీమా బిల్లుకు సంబంధించినంత వరకూ వామపక్షాలు మినహా ఇతర పార్టీలేవీ దాన్ని వ్యతిరేకిం చడంలేదు. రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక అవగాహనకొచ్చాయి. అయితే, మత మార్పిళ్ల వ్యవహారంలో ప్రధాని హామీ ఇవ్వాలన్న విపక్షాల డిమాండును అంగీకరించని కారణంగా ఏర్పడ్డ పరిణామాలవల్ల ఇలా అంగీకారం కుదిరిన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం పడింది. బొగ్గు క్షేత్రాల వేలం గురించి అయితే ఆర్డినెన్స్ అవసరం ఉన్నదనుకున్నా బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు విషయం దాదాపు ఆరేళ్లుగా నానుతున్న సమస్య. అది మరికొన్ని నెలలు వాయిదా పడితే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి తగ్గబోమని ప్రపంచానికి చాటడం కోసమే బీమా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ప్రభుత్వం అంటున్నది. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు వివాదాస్పదమైన అంశం. దాన్ని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. జీవిత బీమా, ఇతరత్రా బీమా రంగాల్లో ప్రస్తుతం 52 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో 5 మాత్రమే ప్రభుత్వరంగసంస్థలు. భారత్‌లో 36 కోట్లమంది జీవిత బీమా పాలసీదారులున్నారని ఈమధ్యే సిగ్మా నివేదిక వెల్లడించింది. బీమా రంగంలో సంస్కరణలు మొదలై దశాబ్దం దాటుతున్నా ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీదే అందులో ఆధిపత్యం. ఈ మార్కెట్లో దాని వాటా 71 శాతం. పార్లమెంటులో బీమా బిల్లును పెట్టి చర్చలు సాగనిస్తే ఈ విషయంలో ఎవరి వాదన ఏమిటో దేశ ప్రజలకు తెలుస్తుంది. ఆ నిర్ణయంలోని మంచిచెడ్డలపై కూడా ఒక అవగాహనకు రాగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాలను పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తీసుకురావడం ప్రజా స్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఏర్పాటు కాదని... ఒకవేళ ఆర్డినెన్స్ మురిగి పోతే తమ పెట్టుబడులు అనిశ్చితిలో పడతాయని విదేశీ సంస్థలకు తెలియదా? నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంటులో చర్చించడం ద్వారా, అందరినీ కలుపుకొని వెళ్లడంద్వారా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సత్సంప్రదాయానికి శ్రీకారం చుడితే బాగుండేది. అలా చేయకపోవడమే కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి కారణమని పాలకులు గ్రహించాలి. -
శీతాకాల సమావేశాలకు తెర
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా 18 బిల్లులకు లోక్‌సభ ఆమోదం న్యూఢిల్లీ: గత నెల 24 నుంచి నెలరోజులు జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. పలు సమస్యలపై విపక్షం ఆందోళనతో గందరగోళం నెలకొన్నా, ఉభయ సభలూ పలు బిల్లులను ఆమోదించగలిగాయి. అయితే, బీమా, బొగ్గు గనుల కేటాయింపులు సహా కీలకమైన సంస్కరణలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండగానే ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ రికార్డ్ స్థాయిలో 18 బిల్లులకు ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల కే టాయింపు, కార్మిక చట్టాల సవరణ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. లోక్‌సభలో అంతరాయాలు, వాయిదా కారణంగా మొత్తం మూడుగంటల వ్యవధి వృథా అయింది. రాజ్యసభ 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. మతమార్పిడులపై ఆందోళన సహా, వివిధ అంశాలపై విపక్షం ఆందోళనతో 62 గంటల సభా సమయం వృథా అయింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ పేరు మార్పు, నల్లధనం తదితర అంశాలపై విపక్ష సభ్యుల ఆందోళనతో ఎక్కువ సార్లు సభ సాగలేదు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేందుకు వీలు కలిగించే బిల్లుకు అంతరాయాల వల్లనే ఆమోదం లభించలేదు. బొగ్గు క్షేత్రాల తాజా వేలానికి వీలుకలిగించే బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లును డిసెంబర్ 12నే లోక్‌సభ ఆమోదించినా, రాజ్యసభనుంచి ఆమోదం లభించలేదు. నల్లధనాన్ని వెనక్కి రప్పించేం దుకు ఉద్దేశించిన బిల్లును, కాలదోషం పట్టిన 90 చట్టాల రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీల పరిశీలనకు రాజ్యసభ సిఫార్సు చేసింది. విపక్షాల తీరు దురదృష్టకరం: వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో విపక్షాల తీరు దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉభయసభల వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటు పనిచేసేలా చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
ఏకతాటిపైకి ఎన్డీఏయేతర పక్షాలు..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలే వేదికగా వ్యూహం ⇒ జీఎస్టీ, బీమా వంటి కీలక బిల్లులు అడ్డుకునే దిశగా విపక్షాలు ⇒ బీమా బిల్లుపై ప్రతిపక్షాలకు మద్దతు తెలిపిన శివసేన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలే వేదికగా ఎన్డీఏయేతర పక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షానికిమూకుమ్మడిగా చెక్ పెట్టాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణ ఎన్నికలు మొదలుకుని ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనంతో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ దిక్కుతోచని పరిస్థితిలోపడ్డాయి. దీంతో బీజేపీ, ఎన్డీఏయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి పార్లమెంట్లో అందివచ్చిన సందర్భాల్లో బీజేపీని ముప్పుతిప్పలు పెట్టాలని యోచిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న శివసేన బీమా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలకు మద్దతు తెలపడం గమనార్హం. ఇప్పటికే రాజ్యసభలో 59, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బీమా చట్టం(సవరణ)బిల్లు-2008, కార్మిక చట్టం(ఫ్యాక్టరీస్యాక్ట్ అండ్అప్రెంటిస్ యాక్ట్), కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్, ఎన్ఆర్ఈజీఏ, భూసేకరణ చట్టం-2013 సవరణ.. వంటి కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టాలనుకుంటోంది. వీటిని సులభంగా పార్లమెంట్ గట్టెక్కించేందుకు ఎన్డీఏయేతర పక్షాలు సిద్ధంగా లేవు. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు రాజ్యసభను అస్త్రంగా మలుచుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయి. రాజ్యసభలో బీజేపీ బలం అంతంతే.. మొత్తం 250 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 43 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ, ఎన్డీఏ సభ్యుల బలం 56 మాత్రమే. ఎన్డీఏయేతర పక్షాలన్నీ కలిస్తే వాటి బలం 128. వీటిలో కాంగ్రెస్‌కు 67 సీట్లు ఉండగా.. బీఎస్పీ(14), ఎస్పీ(10), ఐఎన్ఎల్డీ(1), జేడీ(యూ) (12), జేడీ(ఎస్)(1), టీఎంసీ(12), సీపీఐ(2), సీపీఎం(9) ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏ బిల్లయినా విపక్షాలను కాదని నెగ్గడం ఆషామాషీ కాదు. బీమా బిల్లు ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరిపై ఆధారపడి ఉంది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ సెలక్ట్ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. మరో కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) బిల్లు రాజ్యాంగ సవరణతో కూడుకున్నందున దీనికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీన్ని కూడా విపక్షాలు అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏఐఏడీఎంకే, ఎన్సీపీ,బీజేడీలకుదగ్గరయ్యేఅవకాశాలున్నాయి. బ్లాంక్ చెక్ ఇవ్వబోం: కాంగ్రెస్ బీమా బిల్లు, జీఎస్టీ బిల్లులపై ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ మాదిరిగా మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ సోమవారం స్పష్టం చేసింది. జీఎస్టీ బిల్లు యూపీఏ హయాంలో తీసుకొచ్చిందే అని, దానికి మార్పులు చేసినట్లయితే తాము మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. బీమా బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. జేడీయూ, తృణమూల్ కూడా బీమా బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం తాము సూచించిన సవరణలను అంగీకరిస్తే బీమా బిల్లును వ్యతిరేకించబోమన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి శివసేన బీజేపీకి షాక్ ఇచ్చింది. తమ సవరణలు అంగీకరించనట్లయితే బీమా బిల్లును వ్యతిరేకిస్తామని శివసేన తెలిపింది. సజావుగా సాగేందుకు సహకరించండి: మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతిపక్షాలు తగిన సహకారం అందిస్తాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు బయట ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ‘దేశ ప్రజలు మాకు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించారు. అదే సమయంలో పార్లమెంటు సభ్యులందరికీ దేశాన్ని నడిపించే బాధ్యతను అప్పగించారు..’ అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలుసజావుగా సాగడంలో ప్రతిపక్షాలు బాగా సహకరించాయని మోదీ ప్రశంసించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. -
కేంద్రంలో బీజేపీకి మద్దతు ఉంటుంది: శివసేన
ముంబై: మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్రలో విభేధాలు కేంద్రంతో సంబంధాలను దెబ్బతీయబోవని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఎజెండాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగుతుందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విచ్ఛిన్నమవడంతో బీజేపీ, శివసేన వీడిపోయాయి. మరాఠ గడ్డపై తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని కాపాడుకుంటోంది. కాగా పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. -
అనవసరమైన టూర్లు తగ్గించి సభకు హాజరుకండి
-
శీతాకాల సమావేశాల్లో బీమా బిల్లు: జైట్లీ
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపునకు త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి.. అమోదింపజేసేలా చూస్తామని శుక్రవారమిక్కడ ఆయన వెల్లడించారు. బీమా రంగంలో ఎఫ్‌డీల పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇదివరకే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. -
సెబీ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: సెబీ ఆర్డినెన్స్ పునఃప్రకటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారని అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. సెక్యూరిటీల (సవరణ) చట్టాల బిల్లు - 2013ను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించలేకపోవడంతో సెబీ ఆర్డినెన్స్ కాలపరిమితి జనవరి 15తో ముగిసింది. దీంతో, ఈ ఆర్డినెన్స్‌ను మరోమారు జారీ చేసే అవకాశాలపై న్యాయశాఖ అభిప్రాయాన్ని ఆర్థికశాఖ కోరింది. పార్లమెంటు ఆమోదం పొందలేకపోవడంతో సెబీ ఆర్డినెన్స్‌ను జారీచేయడం ఇది మూడోసారి. సెబీ అధికారాల పటిష్టతకు ఈ ఆర్డినెన్స్ దోహదపడుతుంది. -
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గురువారమిక్కడ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. ఈనెల 30వ తేదీ కల్లా బిల్లుపై అసెంబ్లీ నుంచి అభిప్రాయం వస్తుందో...రాదో చూడాలని షిండే అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక వారం మాత్రమే గడువు ఇచ్చారు -
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
నర్సాపూర్,న్యూస్‌లైన్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు అమోదం పొందే అవకాశాలు ఉన్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి చౌటి శ్రీనివాస్‌రావు ఆశా భావం వ్యక్తం చేశారు. బుదవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ ధృడ నిశ్చయంతో ఉన్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. రాబోయే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు. నేడు అన్నదానం తన తండ్రి దివంగత మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి చౌటి జగన్నాథరావు రెండో వర్థంతిని పురస్కరించకుని గురువారం నర్సాపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చౌటి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు తన తండ్రి విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం విగ్రహం సమీపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, కార్యకర్తలు, అభిమానులు సకాలంలో హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
ఫిబ్రవరి 5 నుంచి 21 వరకూ పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల పొడిగింపు నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీన పునఃప్రారంభమై 21వ తేదీన ముగియనున్నాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేయనందున శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు. -
అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోలేదు: మైసూరారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి స్పష్టీకరణ పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే 7 రోజులు అవిశ్వాస నోటీసులిచ్చాం.. ‘లోక్‌పాల్’పై చర్చ నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాత్రమే వారుుదా వేయమని కోరాం ఆ తర్వాత లోక్‌సభను అర్ధంతరంగా ముగించారు సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుందంటూ టీడీ పీ అసత్య ప్రచారం చేస్తూ దగుల్బాజీ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లుపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో తామిచ్చిన అవిశ్వాస నోటీసులను ఒక రోజు వాయిదా వేయమని మాత్రమే కోరాం తప్ప ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు. అబద్ధాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు ఈ విషయంలో వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లోని అసంతృప్తవాదులు, టీడీపీతో కలసి లోక్‌సభ మొదటిరోజునే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విచిత్రమేమిటంటే.. అందులో రాష్ట్రాన్ని విభజిస్తున్నది ఒక పార్టీ అయితే, అందుకు సహకారంగా లేఖ ఇచ్చింది మరోపార్టీ. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఈ ప్రక్రియను ఆపాల్సిన ఆ పార్టీ ఎంపీలు ఆ పని చేయకుండా అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. వారు ఏ ఉద్దేశంతో ఇచ్చినా యావత్ దేశానికి పరిస్థితిని వేలెత్తి చూపించడం కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న పార్టీగా మేం కూడా మద్దతిచ్చాం. పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే అందులో 7 రోజుల పాటు అవిశ్వాస నోటీసులు ఇచ్చాం. దేశ ప్రజలు ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లు సభలో చర్చకు వచ్చినందున సదుద్దేశంతో ఆ ఒక్క రోజు నోటీసును మరుసటి రోజుకు వాయిదా వేయమని కోరాము తప్ప ఉపసంహరించుకోలేదు. అయితే లోక్‌పాల్ బిల్లు పూర్తికాగానే సభను అర్ధంతరంగా ముగించారు. ఆ రోజే లోక్‌సభకు చివరిరోజున్న విషయం సభలో ఎవరికీ తెలియదు..’’ అని స్పష్టం చేశారు. మద్దతు కూడగడితే.. పక్కదారిపట్టించారు! ‘‘మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దేశమంతా తిరిగి అన్ని ప్రాంతీయ పార్టీలనూ కలసి రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతోందని చెప్పి ఒప్పించారు. వారంతా సభలో వాయిదా తీర్మానం ఇస్తే మద్దతిస్తామని హామీ ఇచ్చారు కూడా. కానీ టీడీపీ, కాంగ్రెస్‌కు సంబంధించిన సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడం ద్వారా.. ప్రస్తుత పరిస్థితి అవిశ్వాసానికి అనువైన సమయం కాదంటూ ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపకుండా వెనక్కి తగ్గేందుకు కారణమయ్యారు. అయినప్పటికీ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కేంద్రం చేస్తున్నది అధికార దుర్వినియోగమని ఎత్తి చూపించడం కోసం, వాళ్ల ఎంపీలే అవిశ్వాసం నోటీసిచ్చినా మేము మద్దతు ఇచ్చాం..’’ అని మైసూరా తెలిపారు. అవిశ్వాసం వీగిపోతుందనే పాట్నా వెళ్లలేదు ‘‘బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలిసేందుకు తమకు కేటాయించిన సమయం ప్రకారం అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన రోజున మాకు విపత్కర పరిస్థితి ఎదురైంది. ఒక వేళ పాట్నా వెళ్లిన సమయంలో సభలో అవిశ్వాసం ప్రస్తావన వస్తే సరైన బలం లేక వీగిపోతే రాష్ట్రం పరువు పోతుందని ఆ కార్యక్రమం రద్దు చేసుకున్నాం. అవిశ్వాసం ఇచ్చిన ఎంపీలు దానిపై చర్చకు కావాల్సిన కనీసం 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టలేకపోయారు. నోటీసులిచ్చిన సభ్యులు మీ స్థానాల్లో నిలబడితే లెక్కించి.. 50 మంది ఉంటే అనుమతిస్తానని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు పట్టించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారు..’’ అని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీలో పారిపోరుుంది టీడీపీ కాదా? ‘‘విభజనకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది క్రితం అసెంబ్లీలో అన్ని పార్టీలు కలసి అవిశ్వాసం పెడితే మద్దతివ్వకుండా పారిపోయి, పరోక్షంగా ప్రభుత్వం నిలవడానికి కారణమైంది టీడీపీ కాదా? సిగ్గులేని వ్యవహారాలు నెరపడం టీడీపీ నేతలకే చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూడా రాష్ట్ర విభజన కావాలని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు మాట్లాడుతున్నా.. బాబు మౌనంగా కూర్చుండిపోవడం ఎంత సిగ్గుచేటు వ్యవహారం?. పార్టీకి ఒక లైను, సిద్ధాంతమంటూ లేకుండా లేనిపోని ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకే తగును’’అని అన్నారు. -
రాజ్యసభలో సచిన్ దంపతులు
భారతీయ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సతీ సమేతంగా శుక్రవారం రాజ్యసభకు హాజరయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సారిగా సచిన్ ఆ సమావేశాలల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాలలో పాల్గొనే ముందు సచిన్ దంపతులు మర్యాద పూర్వకంగా రాజసభ చైర్మన్ హమీద్ అన్సారీని కలశారు. అనంతరం సచిన్ రాజ్యసభ సభ్యులోకి ప్రవేశించారు. సచిన్ భార్య సభలోని అతిథుల గ్యాలరీలోకూర్చొన్నారు.సభలోని సభ్యులందరి కళ్లు సచిన్ దంపతులపైనే ఉన్నాయి. పార్లమెంట్‌పై దాడి జరిగి 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్బంగా ఆ దాడిలో మరణించిన భద్రత సిబ్బందికి రాజ్యసభ సభ్యులు ఘనంగా నివాళ్లు ఆర్పించారు.అనంతరం భారతరత్న పురస్కారానికి సచిన్ టెండుల్కర్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల రాజ్యసభ చైర్మన్ హామీద్ అన్సారీ హార్షం ప్రకటించారు. సచిన్‌కు హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యుల తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నానానికి వాయిదా పడింది. అయితే సచిన్ ఆటోగ్రాఫ్ కోసం కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యార్లోపాటు పలువురు సభ్యులు పోటీ పడ్డారు. -
రాజ్యసభలో సచిన్ టెండుల్కర్