
సెబీ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: సెబీ ఆర్డినెన్స్ పునఃప్రకటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారని అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. సెక్యూరిటీల (సవరణ) చట్టాల బిల్లు - 2013ను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించలేకపోవడంతో సెబీ ఆర్డినెన్స్ కాలపరిమితి జనవరి 15తో ముగిసింది. దీంతో, ఈ ఆర్డినెన్స్‌ను మరోమారు జారీ చేసే అవకాశాలపై న్యాయశాఖ అభిప్రాయాన్ని ఆర్థికశాఖ కోరింది. పార్లమెంటు ఆమోదం పొందలేకపోవడంతో సెబీ ఆర్డినెన్స్‌ను జారీచేయడం ఇది మూడోసారి. సెబీ అధికారాల పటిష్టతకు ఈ ఆర్డినెన్స్ దోహదపడుతుంది.