శీతాకాల సమావేశాల్లో బీమా బిల్లు: జైట్లీ
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపునకు త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి.. అమోదింపజేసేలా చూస్తామని శుక్రవారమిక్కడ ఆయన వెల్లడించారు.
బీమా రంగంలో ఎఫ్‌డీల పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇదివరకే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.