న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్-2019ను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారి ఆరోపణలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (రైతు సాయం) పథకంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశంలోని రాష్ట్రాలన్నీ ఈ పథకాన్ని అమలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులకు రోజుకు 17 రూపాయలు ప్రకటించి ప్రభుత్వం వారిని అవమానపరిచిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కార్చింది ఇక చాలని ఘాటుగా సమాధానమించారు. వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమ కంటే ముందు పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మేలేంటనీ ఆయన ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో 91శాతం రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని జైట్లీ చెప్పుకొచ్చారు. 2022లోపు దేశంలోని పేదలందరికీ గృహలను నిర్మిస్తామని ఆయన తెలిపారు. జైట్లీ వైద్యంకోసం వెళ్లడంతో తాత్కాలికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో శుక్రవారం 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Arun Jaitley in New York on opposition's criticism of Rs 6000/year for farmers having upto 2 hectares of land: Please don't shed crocodile tears today for farmers. If opposition also has several govts let them announce similar schemes. I'm sure other govts will also consider this pic.twitter.com/SZEc93YPls
— ANI (@ANI) February 1, 2019
Comments
Please login to add a commentAdd a comment