శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గురువారమిక్కడ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. ఈనెల 30వ తేదీ కల్లా బిల్లుపై అసెంబ్లీ నుంచి అభిప్రాయం వస్తుందో...రాదో చూడాలని షిండే అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక వారం మాత్రమే గడువు ఇచ్చారు