'ఇవాళ వస్తుందా... మూడ్రోజుల తర్వాత వస్తుందో చెప్పలేం'
న్యూఢిల్లీ : లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ గురువారం ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుపై వీరు ఇరువురు చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆయన విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తెలంగాణ బిల్లు సభకు రావల్సిందేనన్నారు.
అయితే ఇవాళ వస్తుందా... మూడ్రోజుల తర్వాత వస్తుందో చెప్పలేమన్నారు. సభలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు పార్లమెంట్ వ్యవహారాల బులిటెన్లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు చేర్చటం జరిగింది. కాగా తెలంగాణ బిల్లును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ...సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు.