
సంజయ్ రౌత్(ఫైల్)
ముంబై: మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్రలో విభేధాలు కేంద్రంతో సంబంధాలను దెబ్బతీయబోవని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఎజెండాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగుతుందని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విచ్ఛిన్నమవడంతో బీజేపీ, శివసేన వీడిపోయాయి. మరాఠ గడ్డపై తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని కాపాడుకుంటోంది. కాగా పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.