న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో మొదలవుతాయని సమాచారం. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయని, డిసెంబర్ 25న క్రిస్మస్‌కు ముందు ముగుస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో స్టాండింగ్ కమిటీ ఇటీవలే ఆమోదించిన కొత్త చట్టాలు ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు సైతం పార్లమెంటు వద్ద పెండింగ్‌లో ఉంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడో వారంలో మొదలై క్రిస్మస్ ముందు ముగియడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment