న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉభయ సభల కార్యదర్శులకు తెలియజేసింది. కాగా గత ఏడాది శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి జనవరి మొదటి వారం వరకు నిర్వహించారు. ప్రస్తుత సమావేశాల్లో వివిధ బిల్లులతో పాటు, రెండు కీలకమైన ఆర్డినెన్స్‌లను చట్టంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961, ఆర్థిక చట్టం 2019లను సవరిస్తూ.. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గించాలని, అలాగే ఈ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించడానికి ఆర్డినెస్స్‌లను తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశంలో ప్రస్థుతం నెలకొన్న ఆర్థికమాంద్యం పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు, అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నవంబర్‌లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment