parliamentary affairs committee
-
నైతిక, రాజకీయ ఓటమి...
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక, రాజకీయ ఓటమిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ‘‘కనుక మోదీ దేశానికి నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే బీజేపీని, భాగస్వామ్య పక్షాలను పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం తన పేరుతోనే ప్రజా తీర్పు కోరారు. కనుక ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఆ పని చేయకపోగా మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధపడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలంతా ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎంపీలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘మోదీ నైజం తెలిసిన వారెవరూ ప్రజా తీర్పును ఆయన గౌరవిస్తారని, పాలన తీరుతెన్నులను మార్చుకుంటారని అనుకోరు. కనుక మోదీ సర్కారు తీరును వేయి కళ్లతో గమనించడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మనందరి బాధ్యత. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే యత్నాలను అడ్డుకుంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి’’ అని ఎంపీలకు ఉద్బోధించారు. ‘‘అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో మోదీ సర్కారు ఏకపక్ష పోకడలు గత పదేళ్ల మాదిరిగా సాగబోవు. చర్చల్లేకుండా బిల్లుల ఆమోదం, విపక్ష సభ్యులను అవమానించడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటివి చెల్లబోవు’’ అన్నారు. మనకు ఏకంగా శ్రద్ధాంజలి ఘటించారు... ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా కుప్పకూల్చేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదని సోనియా అన్నారు. ‘‘పారీ్టని ఆర్థికంగా కుంగదీశారు. అందరిపైనా కేసులు పెట్టి వేధించారు. చాలామంది కాంగ్రెస్‌కు ఏకంగా శ్రద్ధాంజలే ఘటించారు! కానీ బీజేపీ కుటిల యత్నాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో అడ్డుకున్నారు. కలసికట్టుగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. వారి ధైర్యానికి మా సెల్యూట్. ఈ విజయంలో అధ్యక్షుడు ఖర్గేది కీలక పాత్ర. ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఖర్గే నుంచి అందరూ ఎంతో నేర్చుకోవాలి. అలాగే చరిత్రాత్మక భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ ప్రత్యేక అభినందనలకు అర్హుడు’’ అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ఆత్మశోధన జరగాలని ఎంపీలను కోరారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికవడం తనకెంతో భావోద్వేగపూరిత క్షణమని సోనియా అన్నారు. ‘‘మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపుతూ వస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. -
18 నుంచి డిసెంబర్ 13 వరకు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. -
నవంబర్ 18నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉభయ సభల కార్యదర్శులకు తెలియజేసింది. కాగా గత ఏడాది శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి జనవరి మొదటి వారం వరకు నిర్వహించారు. ప్రస్తుత సమావేశాల్లో వివిధ బిల్లులతో పాటు, రెండు కీలకమైన ఆర్డినెన్స్‌లను చట్టంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961, ఆర్థిక చట్టం 2019లను సవరిస్తూ.. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గించాలని, అలాగే ఈ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించడానికి ఆర్డినెస్స్లను తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశంలో ప్రస్థుతం నెలకొన్న ఆర్థికమాంద్యం పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు, అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నవంబర్‌లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. -
‘పరిమితి’కి మించి ప్రతిపాదనలు
ఎంపీల జీతాలపై కమిటీ సిఫార్సులు న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై పార్లమెంటరీ కమిటీ.. తన పరిమితికి మించి ప్రతిపాదనలు చేసింది. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటిని సరిచేసింది. కొన్నింటిని ప్రభుత్వం ఆమోదించగా, మరికొన్నింటిని ఆమోదించలేదు. ప్రభుత్వ తిరస్కరణకు గురైన వాటిలో... ఎంపీలు స్వచ్ఛందగా ప్రజలకు విరాళమివ్వొచ్చన్న అంశంపై కమిటీ గత డిసెంబర్ 15న చర్చించింది. ఈ అంశం కమిటీ పరిధిలో లేనందున దీనిపై నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫార్సు చేసింది. తమ నియోజకవర్గంలో చేతిపంపుల మంజూరు, రోడ్లు, సౌర విద్యుత్ దీపాలు తదితర వాటిపై ఎంపీలకు కోటా ఉండాలని కమిటీ ప్రతిపాదించగా, వీటిని పరిశీలించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపింది. -
సోనియా వచ్చారు.. నాయకులు మాత్రం!!
అది కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సమావేశం. నిర్దేశిత సమయం శుక్రవారం ఉదయం 10 గంటలు. సాధారణంగా సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అరగంట ముందుగానే, అంటే 9.30 గంటలకే సమావేశానికి వచ్చేశారు. సమావేశ హాల్లోకి వచ్చిన ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే, ఆ హాల్లో సోనియాగాంధీ తప్ప నాయకులెవ్వరూ లేరు. మొత్తం హాలంతా ఖాళీయే. అది చూసి సోనియా నివ్వెరపోయారు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో చేసేదేమీ లేక సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు పార్టీ నాయకులకు తెలిపి అక్కడినుంచి వెళ్లిపోయారు. విషయం ఏమిటంటే, సమావేశం ఉన్నట్లు నాయకులెవ్వరికీ సమాచారం వెళ్లలేదట. అందుకే ఎవరూ హాజరు కాలేదని చెబుతున్నారు.