సోనియా వచ్చారు.. నాయకులు మాత్రం!! | in congress meeting, no other leader present than sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియా వచ్చారు.. నాయకులు మాత్రం!!

Published Fri, Jul 25 2014 12:19 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సోనియా వచ్చారు.. నాయకులు మాత్రం!! - Sakshi

సోనియా వచ్చారు.. నాయకులు మాత్రం!!

అది కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సమావేశం. నిర్దేశిత సమయం శుక్రవారం ఉదయం 10 గంటలు. సాధారణంగా సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అరగంట ముందుగానే, అంటే 9.30 గంటలకే సమావేశానికి వచ్చేశారు. సమావేశ హాల్లోకి వచ్చిన ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఎందుకంటే, ఆ హాల్లో సోనియాగాంధీ తప్ప నాయకులెవ్వరూ లేరు. మొత్తం హాలంతా ఖాళీయే. అది చూసి సోనియా నివ్వెరపోయారు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో చేసేదేమీ లేక సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు పార్టీ నాయకులకు తెలిపి అక్కడినుంచి వెళ్లిపోయారు. విషయం ఏమిటంటే, సమావేశం ఉన్నట్లు నాయకులెవ్వరికీ సమాచారం వెళ్లలేదట. అందుకే ఎవరూ హాజరు కాలేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement