ఎంపీల జీతాలపై కమిటీ సిఫార్సులు
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై పార్లమెంటరీ కమిటీ.. తన పరిమితికి మించి ప్రతిపాదనలు చేసింది. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటిని సరిచేసింది. కొన్నింటిని ప్రభుత్వం ఆమోదించగా, మరికొన్నింటిని ఆమోదించలేదు. ప్రభుత్వ తిరస్కరణకు గురైన వాటిలో... ఎంపీలు స్వచ్ఛందగా ప్రజలకు విరాళమివ్వొచ్చన్న అంశంపై కమిటీ గత డిసెంబర్ 15న చర్చించింది.
ఈ అంశం కమిటీ పరిధిలో లేనందున దీనిపై నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫార్సు చేసింది. తమ నియోజకవర్గంలో చేతిపంపుల మంజూరు, రోడ్లు, సౌర విద్యుత్ దీపాలు తదితర వాటిపై ఎంపీలకు కోటా ఉండాలని కమిటీ ప్రతిపాదించగా, వీటిని పరిశీలించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపింది.
‘పరిమితి’కి మించి ప్రతిపాదనలు
Published Mon, Feb 15 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement