ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటోందని తల్లి మందలించటంతో కూతురు ఆత్మహత్యకు యత్నించింది.
విజయనగరం : ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటోందని తల్లి మందలించటంతో కూతురు ఆత్మహత్యకు యత్నించింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అల్లు త్రివేణి(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. చెప్పిన పని చేయడం లేదని ఆమెను తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉన్న చీమలమందు తాగింది. ఆ గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవటంతో నాలుగు గంటలు ఆలస్యంగా ఆమెను కుటుంబసభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈలోగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.
(బొబ్బిలి)