పెళ్లి పేరుతో ఓ వ్యక్తి వేధింపులకు దిగగా, తట్టుకోలేక తల్లి, కుమార్తెలు ఆత్మహత్యాయత్నం చేశారు.
ఉరవకొండ (అనంతపురం) : పెళ్లి పేరుతో ఓ వ్యక్తి వేధింపులకు దిగగా.. తట్టుకోలేక తల్లి, కుమార్తెలు ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన శివమ్మ, ఆమె కుమార్తె పవిత్ర (25) సోమవారం ఉదయం యాంటీబయోటిక్ మాత్రలు, నెయిల్ పాలిష్ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.
పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మగదిక్కులేని శివమ్మ కుటుంబానికి కరుణాకరన్ (38) అనే వ్యక్తి అండగా ఉంటూ... తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె కుమార్తె పవిత్రను వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక వారు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.