బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఇదే
‘గ్రోత్’ సెంటర్‌పై సర్కారు చిన్నచూపు
చిన్నపాటి సమస్యలూ పరిష్కారం కాని వైనం
వసూలు కాని ఆదాయ, నీటి పన్నులు
వెంటాడుతున్న రిజిస్ట్రేషన్ల సమస్యలు
ప్రాంతం : బొబ్బిలి గ్రోత్ సెంటర్
నిర్వహణ : ఏపీఐఐసీ
మొత్తం విస్తీర్ణం : 1150 ఎకరాలు
ప్లాట్ల కోసం : 868 ఎకరాలు
రహదారులు : 143 ఎకరాలు
రిజర్వ్‌డ్ స్థలం : 138 ఎకరాలు
ప్లాట్లు : 515
యూనిట్లు : 324
పనిచేస్తున్నవి : 69
నిర్మాణంలో ఉన్నవి : 84
ఖాళీ ప్లాట్లు : 146
బొబ్బిలి : పారిశ్రామికాభివద్ధే ధ్యేయంగా... వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా... ఉత్తరాంధ్రకే తలమానికంగా... రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన గ్రోత్‌సెంటర్ ఇప్పుడు తిరోగమన దిశలో ఉంది. సర్కారు చొరవ తీసుకోకపోవడం... సాంకేతిక సమస్యలు పరిష్కరించకపోవడం... మౌలిక వసతులు కల్పించకపోవడం... వంటి సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమకూర్చడంలో ఇంకా వెనుకబడే ఉంది. ఉత్తరాంధ్రలోనే అధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేసి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఏపీఐఐసీ ఉన్నతాధికారులు దష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రోత్ సెంటర్‌లో మౌలిక సదుపాయాలైన రహదారులు, నీరు, విద్యుత్, పరిపాలనా భవనాల నిర్మాణం కోసం ఇప్పటివరకూ రూ.40 కోట్లు వెచ్చించారు. అయినా పూర్తిస్థాయిలో పరిశ్రమలు రావడం లేదు. 20 ఏళ్ల కి ందట పరిశ్రమల స్థాపనకు వందల ఎకరాల భూమిని తీసుకున్న పారిశ్రామికవేత్తలు నేడు ముందుకు రావడం లేదు. అయితే అధికారులు వారికి నోటీసులు పంపించి గడువు పెంచుతున్నారే తప్ప వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ పారిశ్రామిక వాడను నిర్వహించడానికి నెలకు సుమారు 3 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. అయితే ఇప్పడున్న పరిశ్రమల నుంచి అంతగా ప్రొపర్టీ టాక్స్, నీటి పన్నులు వసూలు కావడం లేదు.
మూతపడ్డ తొమ్మిది యూనిట్లు
ఇక్కడ పారిశ్రామికవేత్తలంతా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి మెరుగైన సేవలు అందుకోవడానికి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)ను ఏపీఐఐసీ కొన్నేళ్ల కిందట ప్రవేశపెట్టింది. దాన్ని ఇంతవరకూ అమల్లోకి తేలేదు. ప్రస్తుతం గ్రో™Œ సెంటర్‌లో 9 యూనిట్లు మూత పడ్డాయి. ఇప్పుడు కొనసాగుతున్న యూనిట్ల నుంచి కూడా పన్నుల రూపేణా దాదాపు కోటి 50 లక్షల రూపాయల వరకూ వసూలు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రెవెన్యూ శాఖ చేసిన తప్పిదం వల్ల ఈ పారిశ్రామికవాడలోని సుమారు 300 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉండిపోయింది. దీంతో ఆయా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగక పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు.
రెగ్యులర్ అధికారి లేక ఇక్కట్లు
ఇంత పెద్ద పారిశ్రామికవాడకు కనీసం కమిషనర్‌ను నియమించలేదు. ఇప్పుడున్న కమిషనర్ విజయనగరం నుంచి డిప్యుటేషన్‌పై వస్తున్నారు. దీంతో ఇక్కడ రెగ్యులర్ అధికారి కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. హుద్‌హుద్ తుఫాన్ ధాటికి ఇక్కడి రహదారులు పాడయ్యాయి. వాటి మరమ్మతులకు రూ. 40 లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకు మంజూరుకాలేదు. ఏపీఐఐసీ ౖచైర్మన్ డాక్టర్ కష్ణయ్య మంగళవారం గ్రో™Œ సెంటర్‌ను సందర్శించినా అధికారులు అసలు విషయాలేవీ బయటకు చెప్పలేదు. ఇప్పటికైనా గ్రోత్ సెంటర్‌లో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.