కరోనా బాధితులను బొబ్బిలి నుంచి మిమ్స్‌కు పాజిటివ్ వ్యక్తుల తరలిస్తున్న దృశ్యం
బొబ్బిలి: మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఒక్క సారిగా కేసు లు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. మొన్న చిన దేవాంగుల వీధి, నిన్న నెయ్యిల వీధిలో కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందగా అధికారులు పరీక్షలు నిర్వహించారు. శనివారం రాత్రి నెయ్యిల వీధి లోని ప్రజలకు శాంపిల్స్ తీశారు. అక్కడ నలుగురికి, దావా లవీధిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలడంతో వారిని నెల్లిమ ర్లలోని మిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా బ యటి నుంచి వచ్చిన వారు అటూ ఇటూ సంచరిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్నారు. అలాగే గ్రోత్‌సెంటర్ క్వారంటైన్ కేంద్రం నుంచి ముగ్గురు పాజిటివ్ వ్యక్తులను ఆదివారం మిమ్స్‌కు తరలించారు. వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు. వీరు క్వారంటైన్‌లో ఉండగానే జిల్లాలోకి ప్రవేశించే ముందు తీసిన శాంపిల్స్ ద్వారా ఇప్పుడు పాజిటివ్ నమోదు అయింది.
అందరికీ కామన్ బాత్‌రూం
గ్రోత్‌సెంటర్ క్వారంటైన్‌లో కామన్ బాత్ రూం ఉంచారని అక్కడ క్వారంటైన్ పొందుతున్న ఆర్మీ జవాను గొట్టాపు మురళీధర్, గంట సురేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన 12 మందిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందనీ, అందరికీ మరుగుదొడ్లు, స్నానపు గదులు ఒక్కటేననీ, ఒకేచోట భోజనాలు పెడుతున్నారని, దీనివల్ల తమకు ఆందోళనగా ఉందని వాపోయారు.
కొండవెలగాడలో ఇద్దరికి పాజిటివ్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్ ఆదివారం తెలిపారు. ఢిల్లీలో ఆర్మీ జవానుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ నెల 18న కొండవెలగాడకు వచ్చారని ఆ రోజే ఇద్దరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించామన్నారు. ట్రూనాట్ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని వెంటనే వారిని మిమ్స్ కోవిడ్ ఆస్పత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడతామన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై గ్రామాన్ని బ్లీచింగ్ మిశ్రమంతో శుభ్రం చేశారు. వైద్య, ఆరోగ్య, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ఎవరికైనా అనుమానం వస్తే పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రా వాలని కోరారు. ఎస్సై అశోక్ కుమార్, ఆర్‌ఐ నరేష్ కుమార్ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కలి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment