విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 48 ఇంటిగ్రేటెడ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు (సంతానోత్పత్తి, పశుగ్రాస సేవల కోసం) ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు పశుసంవర్థక శాఖ జేడీ సింహాచలం తెలిపారు.
బొబ్బిలి: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 48 ఇంటిగ్రేటెడ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు (సంతానోత్పత్తి, పశుగ్రాస సేవల కోసం) ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు పశుసంవర్థక శాఖ జేడీ సింహాచలం తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాల ఉత్పత్తిపై రైతులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పాల ఉత్పత్తి ప్రస్తుతం 4.49 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, దాన్ని 4.94 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.