రుణమాఫీపై గందరగోళం | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై గందరగోళం

Published Tue, Sep 30 2014 1:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

రుణమాఫీపై గందరగోళం - Sakshi

రుణమాఫీపై గందరగోళం

 బొబ్బిలి/బొబ్బిలి రూరల్: ప్రభుత్వం రైతు కూలీలకు మేలు చేసే విధంగా భూ సంస్కరణల అమలుకు కృషి చేయాలని వ్యవ సాయ శాస్త్రవేత్త, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసరు కేఆర్ చౌదరి అన్నారు. సోమవారం నుంచి పాత కోటలో రైతు కూలీ సంఘం జిల్లా మహాసభలు ప్రారంభమయ్యూయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు రూపాయలు మాఫీ చేసే ప్రభుత్వం రైతు ల రుణమాఫీ పై మల్లగుల్లాలు పడుతోందన్నారు. లేనిపోని నిబంధనలు విధించి రైతులను గందరగో ళానికి గురి చేస్తోందని ఆరోపించారు. పేద ల భూములన్నీ ధనికుల చేతిలో ఉన్నాయని, గిరిజనుల 1-70 చట్టం అమలు కావడం లేదని చెప్పారు.
 
 దీని వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లాలో ప్రాజె క్టులకు పెద్దగా చేసిందేమీలేదని, వెంగళరాయసాగర్, వట్టిగెడ్డ, తారకరామాసాగర్ ఇవన్నీ ఎలా ఉన్నవి అ లానే ఉన్నాయన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఝాన్సీ మాట్లాడుతూ రైతుల సమస్యల పై రైతు కూలీ సంఘం పోరాడాల్సి ఉందన్నారు. వ్యవసాయ వ్యతిరేక విధానాలు అమలు చేసే చంద్రబాబు పాలనలో రైతులకు మరింత దయనీయ స్థితి రానుం దని చెప్పారు. రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దంతులూరి వర్మ మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు ఏం చేస్తారని ప్రశ్నించా రు.
 
 ఎన్‌సీఎస్ యాజమాన్యం రైతులకు రూ.26 కోట్ల బకాయి ఉండి, రైతుల పేరిట రూ.23 కోట్ల బినామీ రుణాలు వాడితే యాజమాన్యాన్ని కాపాడడానికి పో లీసులను పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలన్నారు. అంతకుముందు నా యకులు రైతు కూలీ సంఘం జెండాను ఆవిష్కరించి, ఇటీవల మృతి చెందిన పలువురు రైతు కూలీ సం ఘం నాయకులు, గంటి్ర పసాదం, తదితర విప్లవకారుల మృతి కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్ పండా, గిరిజన, గిరిజనేతర పేదల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఇల్లా రామిరెడ్డి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పి. అంజయ్య, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఊయక ముత్యాలు, ఏఐఎఫ్‌టీయూ నాయకులు మెరిగాని గోపాలం, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర అరుణ, స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా అమ్మాజీ, పాల్గొన్నారు.
 
 పాలకుల విధానాలే రైతులకు శాపం
 ప్రస్తుత పాలకుల విధానాలు రైతులకు శాపంగా మా రుతున్నాయని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ అన్నారు. సోమవారం ఆమె ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్య పక్కనపెట్టి ముంపు గ్రామాలు ఏ రాష్ట్రంలోకి వస్తాయోనని రాజకీ యం చేశారని ఆరోపించారు. పేదరికాన్ని పోగొట్టే చర్యలు చేపట్టకుండా పాలకులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. విత్తనాలు, ఎరువులు రాయితీపై అందించాలని కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేఆర్ చౌదరి మాట్లాడుతూ రైతు విముక్తి చర్యలు చేపట్టి, కేరళలో ఉన్నట్టు డెట్ రిలీఫ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పేదలకు భూపంపిణీ చేయాలన్నారు. వ్యవసాయం లాభదాయకం గా ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement