సాక్షి, అమరావతి: ‘‘హైదరాబాద్‌కోసం ప్రపంచం మొత్తం తిరిగాను. అభివృద్ధిచేసి ప్రపంచపటంలో నిలిపాను. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో రూ.లక్ష మాత్రమే రుణమాఫీ చేశారు. కష్టాల్లో ఉన్నా నేను కుటుంబానికి లక్షన్నర రుణమాఫీ చేశాను. డ్వాక్రా సంఘాలకు రూ.10 వేలు ఇస్తున్నా’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పచ్చకండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్టీలో చేరేవారంతా రాజకీయంకోసం కాదని.. అభివృద్ధి కోసమేనని చెప్పుకొచ్చారు. టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించేది తానేనని చెప్పారు.
ప్రైవేట్ స్కూళ్లు మూతపడేలా పనిచేయండి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడే స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగించాలని ప్రభుత్వ టీచర్లను కోరారు. డీఎస్సీ-2014లో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలను చంద్రబాబు అందజేశారు. సభకు డీఎస్సీ-2014లో ఎంపికైన 8,926 మంది టీచర్లు, వారి బంధువులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం బాగా పెరిగేలా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరిగా ప్రతి విద్యార్థిపై పూర్తిగా దృష్టిసారించి విద్య బోధిస్తే ప్రభుత్వ స్కూళ్లు మెరుగుపడతాయన్నారు. రాబోయే రోజుల్లో బాగా చదువు చెప్పే టీచర్లకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌లు అందజేస్తామని ప్రకటించారు. కొత్త ఉపాధ్యాయుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని సీఎం అంటూ మహిళా ఉపాధ్యాయుల వల్ల విద్యాబోధనలో నాణ్యత బాగా పెరుగుతుందని అన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నేనే నిలిపా: బాబు
Published Thu, Jun 2 2016 1:59 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement