పన్నుల వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం సత్తాచాటింది. రాష్ర్టస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి 98.81 శాతం పన్నులు వసూలు చేసి శెభాష్ అనిపించుకుంటున్నారు.
బొబ్బిలి: పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని పురపాలక సంఘాల్లో కంటే బొబ్బిలిలో ఈ ఏడాది 98.81 శాతం పన్నులు వసూలు చేశారు. ఏటా మార్చి నెలకు పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. కోర్టు కేసులు, ప్రభుత్వ భవనాలు వంటి కారణాలతో వసూలులో జాప్యం ఉంటుంది. అయినా బొబ్బిలిలో మాత్రం 98 శాతం దాటి పన్నులు వసూలు చేయడంతో ఉద్యోగులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కమిషనర్ హెచ్.శంకరరావు, ఆర్వో రమేష్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు.
లక్ష్యం రూ.4.72 కోట్లు.. సాధించింది రూ.4.66 కోట్లు
పట్టణంలో 11,767 ఇళ్లు ఉన్నాయి. వాటి ద్వారా 4 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో రూ.4 కోట్ల 66 లక్షలు వసూలు చేసి 98.81 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచా రు. ప్రతి వార్డుకు కొన్ని బృందాలను నియమించి బకాయిలు లేకుండా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేశా రు. మొండి బకాయిదారుల వద్దకు కమిషనర్ శంకరరావుతో పాటు అధికారులు వెళ్లి అవగాహన కల్పించి అక్కడికక్కడే వసూలు చే శారు.
ప్రత్యేక వ్యాను ద్వా రా ఉద్యోగులు ఊరంతా తిరిగి మైక్ ద్వారా ప్రచారం చేసి వసూలు చే యడంలో సఫలీకృతమయ్యారు. ఏటా మార్చి నెలాఖరు న పన్ను చెల్లింపుల్లో వడ్డీ రాయితీ ఇవ్వడం ప్రభుత్వం అలవాటు చేసింది. రెండేళ్లుగా ఆ పద్ధతి లేకపోవడంతో ఆఖరి నిమిషం వరకూ బకాయిదారులకు, ఆశతో ఉండేవారికి మున్సిపల్ ఉద్యోగులు కల్పించారు. అలాగే బకాయిలు కట్టడానికి పదే పదే తిప్పుతున్న వారింటికి వెళ్లి దండోరా మంత్రం ప్రయోగించడం కూడా ఫలితమిచ్చింది.
సమష్టి కృషికి ఫలితమిది...
బొబ్బిలి పురపాలక సంఘ ఉద్యోగుల సమష్టి కృషికి ఫలితమిది. లక్ష్యాలను ముందు నుంచి చేరుకోవాలని ప్రణాళిక ప్రకారం వెళ్లాం. రాత్రింబవళ్లు కష్టపడ్డాం. రాజకీయ నాయకులు పన్నులు చెల్లించడానికి పూర్తిగా సహకరించారు. పట్టణ ప్రజలు కూడా పన్నుల చెల్లింపునకు ముందుకొచ్చారు.
-హెచ్.శంకరరావు, కమిషనర్, బొబ్బిలి
ఆస్తి పన్ను వసూలులో ఫస్ట్
Published Sun, Apr 3 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement
Advertisement