108 Vehicle Which Remained In Middle Of Chandrababu Convoy At Bobbili - Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్‌

Published Sat, Dec 24 2022 11:14 AM | Last Updated on Sat, Dec 24 2022 2:49 PM

108 vehicle which remained in middle of chandrababu convoy at Bobbili - Sakshi

చంద్రబాబు కాన్వాయ్‌ మధ్యలో ఉండిపోయిన 108 వాహనం   

సాక్షి, బొబ్బిలి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బొబ్బిలిలో శుక్రవారం ‘ఇదేంఖర్మరా బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. అదే సమ యంలో అస్వస్థతకు గురైన తెర్లాం మండలం నందిగామ గ్రామానికి చెందిన బొద్దూరు సత్యవతి అనే మహిళను కుటుంబ సభ్యులు 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తీసుకెళ్తున్నారు.

తెర్లాం మండలం నుంచి బయలుదేరిన వాహనం బొబ్బిలి చేరుకోగా, గొల్లపల్లి వద్ద వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ చోటివ్వలేదు. 108 వాహనం ఎంత హారన్‌ కొట్టినా కాన్వాయ్‌లో వాహనాలు గానీ, చంద్రబాబునాయుడు గానీ ఏమాత్రం పట్టించుకోలేదు.  చివరకు కాన్వాయ్‌ దాటేవరకు మహిళ పరి స్థితి ఆగమ్యగోచరంగా మారింది. వైద్యుల సూచ నల మేరకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ గంటన్నర సమయం తర్వాత  సీహెచ్‌సీకి తరలించారు.

చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చోటివ్వని చంద్రబాబు... ప్రజలకు ఏమి ఉద్దరించేందుకు తిరుగుతున్నాడంటూ స్థానికులు విమర్శించారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటూ చెప్పుకుతిరుగుతున్న బాబు సామాజిక బాధ్యత ఇదేనా అంటూ మండిపడ్డారు.  

చదవండి: (మరోమారు సీఎం జగన్‌ మానవత్వం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement