విజయనగరం జిల్లా బాడంగి మండలం పినపంకి గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి.
బొబ్బిలి: విజయనగరం జిల్లా బాడంగి మండలం పినపంకి గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు...మెరకముడియం మండలం, ఉత్తరాది గ్రామానికి చెందిన కొందరు మంగళవారం పిరిడి గ్రామంలో జరిగిన గ్రామ దేవత పండుగకు హాజరయ్యారు. బుధవారం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు క్షతగాత్రులను తన వాహనంలో కొంత దూరం తీసుకెళ్లారు. ఈ లోపు అంబులెన్స్ రావడంతో అందులోకి ఎక్కించారు. వారికి బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స ఇచ్చిన అనంతరం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.