బొబ్బిలిలో ఐటీ దాడులు
Published Sat, Mar 11 2017 10:37 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
బొబ్బిలి: బొబ్బిలిలో ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని ఫూల్‌బాగ్ కాలనీని గ్యాస్ ఏజెన్సీతో పాటు గౌడువీధి, సంస్థానం హైస్కూలు రోడ్డులో ఉండే కేడీఆర్ వ్యాపార సంస్థల్లో సోదాలు చేశారు. ఐటీ అడిషనల్ కమిషనర్ నాయక్ ఆధ్వర్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన సోదాలు శనివారం వేకువజాము వరకూ కొనసాగాయి.
గ్యాస్ ఏజెన్సీ వద్దకు వివరాలు సేకరణకు వెళ్లిన మీడియాను బయటకు పంపించేసి తలుపులు మూసేసారు. దాడులు చేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ నోట్లరద్దు సమయంలో జరిగిన లావాదేవీలను «ఆధారంగా ఈ సోదాలు నిర‍్వహించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Advertisement
Advertisement