రుణమాఫీ అమలులో విఫలం
బొబ్బిలి :ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేసేలా టీడీపీ ప్రభుత్వం కమిటీలు వేసి ఎస్సీ, బీసీ రుణాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని, వాటిని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. మంగళవారం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి స్థాయి, స్థోమత లేనివారితో కమిటీలు వేసి పబ్బం గడిపేస్తున్నారన్నారు. పచ్చచొక్కాలకే పథకాలు ఇవ్వడానికి ఇటువంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కమిటీల వల్ల ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపొతుందన్నారు.
ఎన్నికల హామీగా ఇచ్చిన రుణమాఫీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసా య రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు పంట రుణాలు మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. గ్రామాల్లో సదస్సులు పెట్టి పత్రాలు ఇ స్తున్నా.. రైతుల ఖాతాల్లోకి రూపాయి కూడా జమ కావడం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే విధంగా ప్రశ్నిస్తామని తెలిపారు. జిల్లాల్లో అనేక పరిశ్రమలు రకరకాల కారణాల వల్ల మూతపడుతున్నాయని, దీని వల్ల రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. పరిశ్ర మలను తెరిపించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో ఈ దుస్థితి నెలకొందన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛన్లలో కోత విధించి అర్హులకు అన్యా యం చేశారన్నారు.
ఐదు రెట్లు పింఛన్లు పెంచామని గొప్పగా చెబుతూ వేలాది మందికి పింఛన్లు లేకుండా చేశారని ఆరోపించారు. అర్హత ఉన్నవారం దరికీ మళ్లీ పింఛన్లు మంజూరు చేయాలని, తప్పుడుగా తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుద్‌హుద్ తుపాను వచ్చి రెండు నెలలైనా ఎవరికీ సాయం అందలేదన్నారు. గృహాలు కోల్పోయి నిరుపేదలు రోడ్డున పడ్డారని, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో మత్య్సకా రులకు అపార నష్టం కలిగిందన్నారు. బోట్లు, వలలు, ఇళ్లు పాడైనా...వారికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. రైతులకు ఒక్క అరటి పంటకు మాత్రమే పరిహారం ఇచ్చి వరి, చెరుకు రైతులకు అన్యాయం చేశారని తెలిపారు. గతంలో లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించామని, కానీ ఇప్పటికీ పరిస్థితి మారలేదన్నారు. కొత్త సీజన్ కష్టాలు, పాత బకాయిలు తీర్చకపోవడం వంటివి ఇంకా వెంటాడుతున్నాయ న్నారు. వీటిన్నింటి గురించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు.
ఒప్పందాలు అమలయ్యేలా చూడండి
పట్టణంలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన ఒప్పందాలు అమలయ్యేలా చూడాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావును కార్మిక సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు కోటలో ఎ మ్మెల్యేను కలిశారు. ఇటీవల రెండు నెలల పాటు మిల్లును మూసేసిన సమయంలో కార్మికులు చేసిన పోరాటాలకు సంఘీభావం తెలిపి వారి వెన్కంటి ఉన్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల యాజమాన్యంతో జరిగిన చర్చలు.. ఆ తరువాత విధుల్లోకి వెళ్లడం వాటిని కూలానుకూషం గా వివరించారు. మిల్లు ప్రస్తుతం తిరుగుతున్నా ఇంకా బదిలీ కార్మికులకు సరైన పని కల్పించడం లేదని, దీని వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవు తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వి. శేషగిరిరావు, ఎ. సింహాచలం, డి. శ్రీనివాసరావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.