బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బొబ్బిలి : దాసరి వీధిలో నివసిస్తున్న బీటెక్ విద్యార్థి తెంటు మురళి (18) శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఉరికి వేలాడుతున్న మురళిని చూసిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మురళి కోమటిపల్లిలోని స్వామి వివేకానంద కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రాంబాబు బాడంగి స్కూలులో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. తల్లి పార్వతి, అన్నయ్య వెంకటేష్‌లున్నారు. ఏఎస్‌ఐ నాగేశ్వరరావు శవపంచనామా నిర్వహించి శవపరీక్షకు తరలించారు. మురళి మృతి సమాచారం తెలిసిన సహ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.