
సాక్షి, సంగారెడ్డి జిల్లా: దోమడుగు గ్రామంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక తేజస్విని అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నాలుగవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది.
సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా కూడా బెదిరించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment