బొబ్బిలి: పట్టణంలోని వ స్త్ర దుకాణాల్లోకి వెళ్లి చీరలు కొంటున్నట్లు నటించి, దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీఐ సీతారాం శనివారం అందించిన వివరాలు... విశాఖలోని అల్లిపురానికి చెందిన రమణమ్మ, జయ, ఆది లక్ష్మి, త్రివేణి, కొమ్మాదికి చెందిన వెంకటరత్నంల ముఠా రెండు రోజు లుగా బొబ్బిలిలోని వస్త్ర దుకాణాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతోంది. శుక్రవారం నాడు వీరు బజారులోని ఓ శారీ హౌస్‌కు వెళ్లారు. అక్కడ నలుగురూ ఒకే సారి వెళ్లి ఒకరు చీర బేరమాడడం, మరొకరు చీర కొనడం, ఇంకొకరు పరిశీలన చేసి నచ్చలేదని చెప్పడం ఇలా చెబుతూ వ్యాపారుల కళ్లు కప్పి చీరలను దాచేశారు.
వచ్చిన మహిళలంతా ఏమీ కొనకుండా వెళ్లిపోవడం, విలువైన చీరలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వ చ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దుకాణంలోని సీసీ పుటేజీని చూసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు విషయం బయట పడింది. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిది విశాఖ కావడంతో వీరి గత చరిత్రపై కూ డా విచారణ చేస్తున్నామన్నారు. ఆయనతో పాటు ఎస్‌ఐ నాయుడు ట్రై నింగు ఎస్‌ఐ జీడీ బాబు, ట్రాఫిక్ ఎస్‌ఐ దూలి శేఖర్ ఉన్నారు.
చీరల దొంగలు అరెస్టు
Published Sun, Jan 11 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement