women gang
-
స్త్రీ శక్తి: లండన్ మ్యూజియానికి పింక్ శారీ!
ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్ మ్యూజియానికి చేరనుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్ ‘డిజైన్ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది. 2006లో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస! అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్! ‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్ శారీని యూనిఫామ్‌గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్‌పాల్‌దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా... లండన్ ‘డిజైన్ మ్యూజియం’ క్యూరేటర్ ప్రియా ఖాన్చందాని నుంచి సంపత్పాల్దేవికి ఇమెయిల్ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్‌బీట్ శారీ టైటిల్‌తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’ ‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్‌పాల్‌దేవి. -
హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠా హల్చల్
హైదరాబాద్ నగరంలో గురువారం మహిళా దొంగల ముఠా రెచ్చిపోయింది. వరుస దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంది. ప్రధానంగా ఆలయాలకు వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు మహిళా సభ్యుల దొంగల ముఠా ఆగడాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఓ మహిళ మెడలోని గొలుసును అపహరించిన ముఠా.. అనంతరం అమీర్‌పేటలోని కనకదుర్గ ఆలయంలో పూర్ణ చంద్రావతి అనే మహిళ మెడలో నుంచి 2 తులాల గొలుసును, యూసుఫ్ గూడలో ఆటోలో ప్రయాణిస్తున్న కనకమ్మ అనే మహిళ వద్దనుంచి 5 తులాల బంగారు గొలుసును అపహరించారు. వరుస చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ ముఠా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
చీరల దొంగలు అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని వ స్త్ర దుకాణాల్లోకి వెళ్లి చీరలు కొంటున్నట్లు నటించి, దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీఐ సీతారాం శనివారం అందించిన వివరాలు... విశాఖలోని అల్లిపురానికి చెందిన రమణమ్మ, జయ, ఆది లక్ష్మి, త్రివేణి, కొమ్మాదికి చెందిన వెంకటరత్నంల ముఠా రెండు రోజు లుగా బొబ్బిలిలోని వస్త్ర దుకాణాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతోంది. శుక్రవారం నాడు వీరు బజారులోని ఓ శారీ హౌస్‌కు వెళ్లారు. అక్కడ నలుగురూ ఒకే సారి వెళ్లి ఒకరు చీర బేరమాడడం, మరొకరు చీర కొనడం, ఇంకొకరు పరిశీలన చేసి నచ్చలేదని చెప్పడం ఇలా చెబుతూ వ్యాపారుల కళ్లు కప్పి చీరలను దాచేశారు. వచ్చిన మహిళలంతా ఏమీ కొనకుండా వెళ్లిపోవడం, విలువైన చీరలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వ చ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దుకాణంలోని సీసీ పుటేజీని చూసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు విషయం బయట పడింది. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిది విశాఖ కావడంతో వీరి గత చరిత్రపై కూ డా విచారణ చేస్తున్నామన్నారు. ఆయనతో పాటు ఎస్ఐ నాయుడు ట్రై నింగు ఎస్ఐ జీడీ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ దూలి శేఖర్ ఉన్నారు. -
'బ్లాక్ మెయిల్' కేసులో ఇద్దరు మహిళలు సరెండర్
తిరువనంతపురం:'బ్లాక్ మెయిల్ సెక్స్ స్కామ్' కు సంబంధించి ఇద్దరు మహిళలు పోలీసులకు లొంగిపోయారు పలువురి వ్యక్తులను శృంగార ముగ్గులోకి దింపి ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాలోని ఇద్దరు మహిళలు శనివారం రాత్రి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఈ ముఠా బారిన పడి ఓ వ్యాపారవేత్త గత నెల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖ వ్యక్తులు, వ్యాపార వేత్తలతోపాటు, రాజకీయ నేతలకు ఎరవేసి వారి నుంచి డబ్బులు గుంజడమే ఈ సెక్స్ రాకెట్ ముఠా ప్రధాన టార్గెట్. వారి బారిన పడ్డ బాధితుల చిత్రాలను వీడియోల్లో బంధించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటంతో అది కాస్తా కేరళ పోలీసులకు తలనొప్పిగా మారింది. వీరు నిన్న స్వయంగా తమ న్యాయవాదిని వెంటతీసుకుని మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయారు.ప్రస్తుతం ఆ మహిళలను విచారిస్తున్న పోలీస్ అధికారులు ఆ ముఠా వెనుక సభ్యులకు సంబంధించి ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు. వీరిని సోమవారం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.