
బొబ్బిలి: వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానే తమ లక్ష్యమని బొబ్బిలి ప్రజలు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ కళాభారతి మునిసిపల్ ఆడిటోరియంలో ఆదివారం బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో పలువురు మేధావులు, విద్యా, వ్యాపార, న్యాయ, రాజకీయ వర్గాలకు చెందిన వారంతా పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన వికేంద్రీకరణకు మద్దతు పలికారు.
మునిసిపల్ చైర్మన్ ఎస్వీ మురళీకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సి ఉన్నా.. చంద్రబాబు చేసిన పొరపాట్ల కారణంగా దాన్ని కోల్పోయామని చెప్పారు. దశాబ్దాల నాటి ప్రతిపాదన విశాఖ రాజధాని అవకాశాన్ని ఇప్పుడు జారవిడుచుకోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, డాక్టర్ బొత్స కాశినాయుడు, భాస్కరరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వివిధ వర్గాల మేధావులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment