మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ఓ విద్యార్థినిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన
బొబ్బిలి : మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ఓ విద్యార్థినిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని గుడివాడ కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన కడగల సంతోష్‌కుమార్ లైంగిక దాడికి యత్నించగా ఆమె కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాలికను వైద్య పరీక్షలకు పంపుతున్నట్లు ఎస్‌ఐ ఎస్ అమ్మినాయుడు తెలిపారు.