వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 200వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణశ్రీనివాస్ గురువారం ప్రకటించారు. షర్మిల శుక్రవారం ఉత్తర నియోజక వర్గంలోని ధర్మానగర్‌లో పాదయాత్ర మొదలు పెడతారు. అక్కయ్యపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగి జగదాంబ సమీపంలో లంచ్ చేస్తారు. ఆఫీసర్‌స క్లబ్ మీదుగా ఆర్కేబీచ్‌లో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో బస చేస్తారు.