Kottavalasa
-
సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం
దారంతా కష్టాలు కనిపించాయి. చెమట్లు చిందించాడు. అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. అంతులేని పట్టుదల ప్రదర్శించాడు. పేదరికం పెద్ద అడ్డుగోడలా నిలిచింది. ప్రతిభను నమ్ముకుని ముందుకు కదిలాడు. ఆ కష్టాలు ఇప్పుడతనికి అనుభవాలయ్యాయి. అవరోధాలు మైలురాళ్లుగా మారాయి. పేదరికం తన గమ్యాన్ని గుర్తు చేసే సాధనమైంది. సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణమై కనిపిస్తున్న రమణమూర్తి క్రీడా ప్రయాణం ఆసాంతం ఆదర్శ ప్రాయం. ఇప్పటికే జాతీయ పోటీలకు రిఫరీగా ఎంపికైన ఈ డిగ్రీ కుర్రాడు జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. శ్రీకాకుళం న్యూకాలనీ: కఠోర శ్రమ, సాధన, పట్టుదలకు ప్రతిభ తోడయితే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాడు అంపోలు రమణమూర్తి. సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ స్థాయి లో నిర్వహించే పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా కూడా అర్హత సాధించడం విశేషం. ఆమదాలవలస మండల పరిధిలోని కొత్తవలస గ్రామానికి అంపోలు రమణమూర్తి తల్లిదండ్రులు సత్యనారాయణ, కృష్ణవేణి. రమణమూర్తికి అక్క రాజేశ్వరి కూడా ఉంది. రమణమూర్తి తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలే. 2010–11లో జెడ్పీహెచ్ స్కూల్ తొగరాం(ఆమదాలవలస మండలం)లో 6వ తరగతి చదువుతున్న సమయంలో రమణమూర్తిలో ఉన్న ప్రతిభను అక్కడి ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ముఖ్య ప్రతినిధి మొజ్జాడ వెంకటరమణ గుర్తించారు. అలాగే పీడీ ఎంవీ రమణ అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన రమణమూర్తి రాష్ట్రపోటీలకు ఎంపికయ్యాడు. స్లగ్గింగ్తోపాటు ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో మాచర్లలో తాను ప్రాతినిధ్యం వహించిన తొలి రాష్ట్ర పోటీలోనే సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. పాల్గొనే ప్రతి మీట్లోను సత్తాచాటుకున్నాడు. త్రోబాల్ లో కూడా ప్రవేశం ఉన్న రమణమూర్తి జాతీయ పోటీల్లో రాణించాడు. అనతి కాలంలోనే జాతీయస్థాయిలో మెరుపులు మెరిపించాడు. సౌత్‌జోన్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, ఫెడరేషన్ కప్‌లో రజత పతకం సాధించాడు. ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన రమణమూర్తి ప్రస్తుతం డిగ్రీ బీఎస్సీ సీబీజెడ్ ఫైనలియర్ చదువుతున్నాడు. 2020 రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తమ క్రీడాకారుడిగా నాటి కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత.. ఒకవైపు ఆటతోపాటు మరోవైపు కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత సాధించిన రమణమూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2020లో జాతీయ పోటీలకు టెక్నికల్ అఫీషియల్స్‌గా/రిఫరీగా వ్యవహరించే రిఫరీ టెస్టులో అర్హత సాధించాడు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్లేట్ అంపైర్‌గా, టెక్నికల్ అఫీషియల్స్‌గా కూడా వ్యవహరించి మెప్పించాడు. అలాగే 2021–22లో ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి కోచ్‌గా కూడా అర్హత సాధించాడు. రమణమూర్తి సాధించిన విజయాలు.. ► 2016–17లో మహారాష్ట్రలో జరిగిన ఆలిండియా స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ► 2016–17లో వైఎస్సార్ కడపలోని పుల్లంపేటలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలవ డంలో కీలక భూమిక పోషించాడు. ► 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఫెడరేషన్ కప్ సీనియ ర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించాడు. ఈ పోటీల్లో ఏపీ రన్నరప్ గా నిలిచింది. ► 2020లో ఆలిండి యా సౌత్‌జోన్ సీనియ ర్స్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ పోటీ ల్లో ఏపీ విజేతగా నిలిచింది. ► 2022 మార్చిలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఆలిండియా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో బీఆర్‌ఏయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీ ల్లో బీఆర్‌ఏయూ సెమీస్‌లో ఓటమిపాలైంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మనాన్న కూలికి వెళ్తే తప్ప జరగని పరిస్థితి. నేను జాతీయస్థాయి క్రీడాకారునిగా గుర్తింపు పొందాను. ఎన్ఐఎస్ పూర్తి చేసి కోచ్‌గాను, రిఫరీ టెస్టులో క్వాలిఫై అయి టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యాను. నా ప్రతి విజయంలోను నా గురువు ఎంవీ రమణ సర్ ప్రోత్సాహం ఉంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాను. – అంపోలు రమణమూర్తి, సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి క్రీడాకారుడు నిరంతరం కష్టపడతాడు అంపోలు రమణమూర్తి పాఠశాల స్థాయి నుంచి కష్టపడే మనస్తతత్వాన్ని అలవర్చుకున్నాడు. ఉత్తమ లక్షణాలు, నడవడిక కలిగిన రమణమూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆనాడే గుర్తించాను. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం తరఫున బాసటగా నిలిచాం. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు. – ఎంవీ రమణ, ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధి -
ఆమె చదివింది ఇంజినీరింగ్, అతడు ఏడు.. వారిది ప్రేమ వివాహం.. చివరికి విషాదం
సాక్షి,కొత్తవలస (శ్రీకాకుళం): ప్రేమించి.. పెద్దలను ఎదిరించి ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. వివాహానంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇంతలోనే మద్యానికి బానిసైన భర్త, భార్య డబ్బులివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫలితంగా ప్రేమించిన పుణ్యానికి ఆమె బిడ్డతో ఒంటరైంది. వివరాల్లోకి వెళ్తే... కొత్తవలస మండలం కొత్తవలస మేజరు పంచాయతీ పరిధి 202 కాలనీకి చెందిన కొటాన ప్రవీణ్(29) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. పెయింటింగ్ పనులు చేసేవాడు. అదే కాలనీలో నివాసం ఉంటున్న కోట తనూజ(20) సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ విషయం తెలిసిన తనూజ తల్లిదండ్రులు వారించి పెద్దల వద్ద పంచాయతీ నిర్వహించారు. చివరకు కొత్తవలస నుంచి విశాఖపట్నంకు మకాం మార్చారు. అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగి చివరకు వివాహం వరకు వెళ్లింది. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో తనూజ అత్తవారింటికి దగ్గరైంది. తొలిత ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ప్రవీణ్ వ్యసనాలు చిచ్చు రేపాయి. తొలి నుంచి పెయింటింగ్ వేస్తూ జీవనానికి అలవాటు పడిన ప్రవీణ్ వివాహం తరువాత కూడా దాన్ని కొనసాగిస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారి కాపురంలో సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రవీణ్ తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వీడడం, తల్లి పార్వతి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించడంతో ప్రవీణ్ వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. తను పెయింటర్ కావడంతో వచ్చిన కొద్దిపాటి ఆదాయానికి మించి వ్యసనాలకు బానిసవడంతో డబ్బుల కోసం తల్లి, భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. డబ్బులివ్వకపోతే చనిపోతానని నిత్యం బెదిరిస్తుండేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా ప్రవీణ్ డబ్బుల కోసం తల్లిని బెదిరించాడు. ఎప్పుడూ ఉండే బెదిరింపులేనని వారు సాధారణంగానే తీసుకున్నారు. గొడవ అనంతరం ప్రవీణ్ తల్లి, భార్యాబిడ్డలు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి చూసేసరికి ప్రవీణ్ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీలో ఉంటున్న దుంగ మహేష్ దీన్ని తొలిత గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వైవీ జనార్దన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రేమను నమ్మి వచ్చినందుకు... తనూజ ఇంజినీరింగ్ చదివినా ఏడో తరగతి చదివి పెయింటింగ్ పనులు చేస్తున్న ప్రవీణ్‌ను పెద్ద హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించింది. తల్లిదండ్రులను కాదని ప్రవీణ్‌ను ప్రేమించి నమ్మి వచ్చిన తనూజ, బిడ్డను చూసి అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. తన జీవితాన్ని ఇలా వదిలేసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రవీణ్ మృతదేహాన్ని చూసి తనూజ చేస్తున్న రోదనలు మిన్నంటాయి. ఇక తన జీవితం సాగేదెలా అంటూ బిడ్డను చూసి చేసిన రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. చదవండి: వివాహేతరం సంబంధం: సంప్ నుంచి దుర్వాసన రావడంతో.. -
మీ పని మీది.. మా పని మాది..
ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. అది చెరువైనా... ప్రభుత్వ స్థలమైనా... ఏమాత్రం వెనుకాడటంలేదు. అధికారం వారికి వరంగా మారింది. అధికారులను సైతం ఎలాగైనా కట్టడి చేయొచ్చన్న ధైర్యం పెరిగింది. స్థలాలకు ప్రస్తుతం పలుకుతున్న ధర వారిని అక్రమాలకు పాల్పడేలా చేస్తోంది. ఏదో రకంగా భూమిని కొట్టేసి... దానిని అమ్ముకుని తక్కువ వ్యవధిలో కోట్లాదిరూపాయలు ఆర్జించే ఈ వ్యవహారమే వారికి ఉత్తమంగా తోస్తోంది. కొత్తవలస మండలం మంగళపాలెం పీతల చెరువును దర్జాగా కబ్జాచేస్తే... దానిని పీకేయించి అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దానిని తొలగించి ఏకంగా మళ్లీ షెడ్ నిర్మాణం చేపట్టడం వారు ఎంతకు తెగిస్తున్నారన్నది చెప్పకనే చెబుతోంది. ► దర్జాగా చెరువులు కబ్జా చేస్తున్న అక్రమార్కులు ► అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తొలగించి మరీ ఆక్రమణ ► దర్జాగా ఆ స్థలంలో షెడ్ నిర్మాణం ► కొత్తవలస పీతల బంద చెరువు దురాక్రమణ ► తెరవెనుక సూత్రధారిగా టీడీపీ నేత సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొత్తవలస మండలంలోని భూములకు విపరీత డిమాండ్ ఉంది. విశాఖపట్నానికి ఆనుకుని ఉండటంతో అక్కడి స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం విలువ రూ. 3కోట్ల మేర పలుకుతోంది. సెంటు స్థలం దొరికితే చాలు లక్షాధికారి అయిపోవచ్చనే ఆలోచన అందరికీ వచ్చేసింది. దీంతో ప్రభుత్వ భూములను ఏదో ఒకరకంగా దక్కించునేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో దర్జాగా ఆక్రమణలు జరిగిపోతున్నాయి. ఖాళీగా స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తవలస మండలంలో భూఆక్రమణలు జరుగుతున్నాయి. పీతలబంద చెరువులో అనధికార నిర్మాణం కొత్తవలస మండలం మంగళపాలెంలోని సర్వే నంబర్ 54–3లో గల పీతలబంద చెరువులో కొంత స్థలాన్ని ఆక్రమించి, అనధికార నిర్మాణాన్ని చేపడుతున్నారు. టీడీపీ నేతల అండదండలున్న వ్యక్తులే ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆ««ధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే నెపంతో చేపట్టిన ఈ ఆక్రమణను అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలనుకున్నా తప్పని సరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. అదంతా అధికారికంగా జరగాలి. నిబంధనల మేరకు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మంగళపాలెంలో ఎవరి అనుమతీ లేకుండానే పీతలబంద చెరువును దర్జాగా ఆక్రమించి అనధికార నిర్మాణం చేపడుతున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉండటంతో చొరవ తీసుకోలేదు. ఆ తర్వాత స్థానికులు ఫిర్యాదు చేయడంతో తప్పని పరిస్థితుల్లో వెళ్లి అనధికార నిర్మాణాలను తొలగించి అక్కడ హెచ్చరిక బోర్డు పాతారు. యథేచ్ఛగా హెచ్చరిక బోర్డు తొలగింపు ఆక్రమణ ప్రదేశాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అప్పటికే వేసి ఉన్న షెడ్‌ను తొలగించారు. అక్కడే ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని.. సర్వే నంబర్..54–03లో గల పీతబంద అని....ఆక్రమణదారులు శిక్షార్హులు అని బోర్డులో పేర్కొన్నారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే అక్రమార్కులు బోర్డును తీసేశారు. అంతేకాకుండా అక్కడొక తాత్కాలిక షెడ్‌ను నిర్మించేశారు. ఎవరేం చేస్తారో చూద్దామనే ధోరణితో ఆక్రమణదారులు ఇష్టారీతిన వ్యవహరించారు. వీరికి టీడీపీ కీలక నేత అండదండలు ఉన్నాయి. దీంతో అడిగే వారు లేకుండా పోయారు. స్థానికంగా స్పందన లేకపోవడంతో స్థానికులు కొందరు ఏకంగా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం ఆక్రమణ ప్రదేశంలో పాతిన బోర్డును పీకేసిన సంఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. స్థానిక పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అధికారులు పెట్టిన బోర్డును తీసేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాం. – తిరుపతిరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, కొత్తవలస -
విద్యార్థినిపై హత్యాచారయత్నం
కొత్తవలస: రోజూ స్కూలుకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ విద్యార్థినిపై అఘాయిత్యానికి యత్నించాడు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్.కోట మండలం లక్ష్మింపేట గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ సమీపంలోని గ్రామాల విద్యార్థినులను అప్పన్నపాలెం సమీపంలోని జిందాల్ భారతి విద్యా మందిర్‌కు తీసుకెళ్లి, తిరిగి తీసుకు వస్తుంటాడు. మంగళవారం సాయంత్రం కూడా స్కూలు పిల్లలను తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అందరూ దిగిపోగా కల్లేపల్లికి చెందిన 5వ తరగతి బాలిక మాత్రమే ఉంది. దుర్బుద్ధితో ఉన్న డ్రైవర్ ఆటోను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమెను అక్కడే ఉన్న సిమెంటు దిమ్మెకేసి బలంగా మోదాడు. బాలిక భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అటుగా వెళ్తూ గమనించాడు. దీంతో ఆటో డ్రైవర్ బాలికను వదిలేసి ఆటోతో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె మొహంపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
జ్వరంతో విద్యార్థి కన్నుమూత
కొత్తవలస రూరల్: తాము కష్టాలు అనుభవించినా పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు గన్న ఆ తల్లిదండ్రుల ఆశ అడుగంటిపోయింది. ఉన్నత చదువులు చదివి పదిమందికి ఉపయోగపడతానని కన్నకొడుకు అంటుంటే విని మురిసిపోయేవారు. అందొచ్చిన కొడుకు ఆదుకుంటాడని భావిస్తే ఆ బిడ్డకే తలకొరివి పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని తల్లితండ్రులు విలవిల్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరి హదయం ద్రవించింది. కొత్తవలసకు చెందిన కొండగొర్రి సత్యనారాయణ ఆటోనడుపుతూ తన ఇద్దరు కుమారులు హర్షవర్ధన్(10వ తరగతి), పూర్ణచంద్రరావు(6వతరగతి)లను మండలంలోపి అర్ధానపాలెం ఏపీ మోడల్ స్కూల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌కి 10 రోజుల క్రింతం జ్వరం వచ్చింది. మందులు వాడితే తగ్గింది. గురువారం మళ్లీ జ్వరం రావడంతో కొత్తవలస పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి డెంగీ లక్షణాలేమైనా ఉన్నాయేమోనని పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మందులు ఇవ్వడంతో ఇంటికి తీసుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రానికి ఉన్నట్లుండి జ్వరం వచ్చి ఆ విద్యార్థి కోమాలోకి వెళ్లిపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆ విద్యార్థికి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో శనివారం రాత్రి వరకూ రక్తం ఎక్కించినా ఫలితంలేకపోయిందని వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆదివారం ఉదయం కొడుకు మతదేహాన్ని తీసుకుని లబోదిబోమంటూ తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. హర్షవర్ధన్ పార్థివదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు, మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. -
ఆటోబోల్తా 12 మందికి గాయాలు
కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి ఫ్లైఓవర్బ్రిడ్జి మలుపులో బుధవారం ఆటో బోల్తాపడి 12మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో బూసాల రాము(35) పి.శిరీష(32), దమరశింగి సంతోష్(30), ఆర్.లక్ష్మి, డి.దేవి, బి.ఈశ్వరమ్మ38) ఉన్నారు. బూసాల అక్కమ్మ(48) డి.పైడితల్లి(36)కె.హేమ(38) కె.నరసమ్మ(22) డి.లక్ష్మి(48) పి.కమల(28) స్వల్పంగా గాయపడ్డారు. వీరితోపాటు ఆటోడ్రైవర్ గొల్లు నాయుడుకు గాయపడ్డాడు. క్షతగాత్రులంతా నరపాం గ్రామానికి చెందినవారే. వీరు విశాఖజిల్లా పురుషోత్తపురం సమీపంలోఉన్న ఎస్ఎస్ఎఫ్ ఫిషరీస్(రొయ్యలకంపెనీ)లో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకని బయలుదేరి ఫ్లైవర్‌పై నుంచి దిగుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసిని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనేఉన్న గోతులో ఆటో బోల్తాపడింది. కొందరికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు బి.రామారావు, టి.పేరిందేవి చికిత్స చేశారు. లారీ ఢీకొని మరో ఇద్దరికి.. దాసుళ్లపాలెం(లక్కవరపుకోట): దాసుళ్లపాలెం సమీపంలోని చెరువు మలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ట్రైనీ ఎస్సై తమ్మినాయుడు అందించిన వివరాలు ప్రకారం.. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన బోర్వెల్ లారీ దాసుళ్లపాలెం నుంచి ద్విచక్రవాహనంపై గాంధీనగర్‌కు చెందిన వై.అప్పారావు, పి.ఈశ్వరావులు వస్తుండగా వెనునుంచి వస్తున్న లారీ ఢీకొంది. క్షతగాత్రుడు అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై తెలిపారు. మరో ముగ్గురికి.. డెంకాడ: విజయనగరం - నాతవలస రహదారిపై చందకపేట వద్ద పూసపాటిరేగ జెడ్పీటీసీకి చెందిన కారు మోటారు సైకిల్‌పై వెళ్తున్న డెంకాడ కానిస్టేబుల్ నల్లా శ్రీనివాసరావును ఢీకొంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అలాగే పెదతాడివాడ జంక్షన్ సమీపంలో ఆటో, రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పెదతాడివాడ గ్రామానికి చెందిన సారిక శంకరరావుతో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు హెచ్‌సీ అప్పారావు తెలిపారు. -
కొత్త కొలువులు వెదుక్కుంటూ...
కొత్తవలస రూరల్: ఉన్న ఊళ్లో ఉపాధి కరువై పరిశ్రమలను నమ్ముకున్న కార్మికులు పొట్టపోషణకోసం వలసబాట పట్టారు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన మండలంలోని అప్పన్నపాలెం జిందాల్, దేశపాత్రునిపాలెం డెక్కన్ ఫెర్రోఅల్లాయీస్, ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్, సాయిరాం కాస్టింగ్, తుమ్మికాపల్లి ఉమా జూట్‌మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. ఈ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు తప్పని సరి పరిస్థితుల్లో విశాఖపట్నం వలసపోతున్నారు. కష్టాల్లో ఉన్న కర్మాగారం కనీసం తాము పనిచేసిన కాలానికి జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక తమ కుటుంబాల్లో ఎవరికి అనారోగ్యం చేసినా వైద్యం చేయించుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కనీసం తమ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిందాల్... అటు ఉమాజూట్ మిల్లులు మూసివేయటంతో వందలాదిగా కార్మికులు విశాఖ పోర్టు, రైల్వే కాంట్రాక్టు, భవననిర్మాణ రంగాలలో రోజువారీ కూలీలుగా మారారు. చాలీచాలని కూలి డబ్బుతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. విద్యుత్ రాయితీ ప్రకటించినా... రాష్ర్ట ప్రభుత్వం విద్యుత్ రాయితీ యూనిట్‌కు 1.50 పైసలు ప్రకటించినా జిందాల్ కర్మాగారం తెరిచేందుకు సుముఖత చూపటంలేదు. దీనివల్ల కర్మాగారంలో ఎంప్లాయిస్, కాంట్రాక్టు లేబరు కలిపి 850 మంది వరకూ ఉపాధి కోల్పోయాం. పనికోసం పొట్టచేతపట్టుకుని వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది. - బొట్ట రాము, జిందాల్ కాంట్రాక్ట్ కార్మికుడు తక్కువ కూలి ఇస్తున్నారు మిల్లులు మూసేయటంతో మేమంతా మూకుమ్మడిగా రోజువారీ కూలీ పనులకోసం విశాఖపట్నం పోతున్నాం. మా అవసరం చూసి కాంట్రాక్టర్లు రోజుకు 200 నుంచి 250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అవసరానికి మించి పనివారు ఉండటంతో కూలి గిట్టుబాటు కావటంలేదు. పరిశ్రమల యాజమాన్యాలు తెరవడానికి ప్రయత్నాలు చేయడంలేదు. కార్మికశాఖ కూడా వారి పక్షానే ఉంటోంది. ప్రభుత్వం సైతం మా కష్టాలను పట్టించుకోవడంలేదు. - వై.ఎస్.ఎన్.మూర్తి, జూట్ కార్మికుడు -
ఏసీబీ వలలో గులివిందాడ వీఆర్వో
కొత్తవలస: పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వటానికి ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు తీసుకుంటూ మండలంలోని గులివిందాడ వీఆర్వో డీసీహెచ్.అప్పలనాయుడు ఏసీబీ అధికారులకు బుధవారం సాయంత్రం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి చెప్పిన వివరాల ప్రకారం.. గులివిందాడ గ్రామానికి చెందిన విరోతి రఘు వారసత్వంగా తమకు వచ్చిన ఎకరా 50 సెంట్ల భూమికి తన తండ్రి పేరున పట్టాదార్ పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆన్లైన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు పాస్‌పుస్తకం ఎందుకు రాలేదని వీఆర్వో అప్పలనాయుడును అడిగారు. ఎంతో కొంత ఇస్తేగాని పాస్ పుస్తకం ఇచ్చేదిలేదని అప్పలనాయుడు చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రూ. ఏడు వేలు ఇస్తామని అప్పలనాయుడుకు చెప్పారు. ఈ మేరకు బుధవారం కొత్తవలస కుమ్మరవీధిలోని వీఆర్వో ప్రైవేటు కార్యాలయంలో రఘు రూ.5 వేలను అప్పలనాయుడుకు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడిలో ఏసీబీ సీఐలు డి.రమేష్, ఎస్.లకో్ష్మజి, పాల్గొన్నారు. లంచం ఇవ్వలేకే.. పట్టాదార్ పాసు పుస్తకం కోసం లంచం ఇవ్వలేకే ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు రఘు విలేకరులకు తెలిపారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవటంతో ఎంతకావాలని వీఆర్వోను అడిగితే రూ. ఏడు వేలు ఇస్తే పనవుతుందని చెప్పారన్నారు. అంత డబ్బు ఇవ్వలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. హెచ్డీటీపై ఏసీబీ అధికారుల ఆగ్రహం పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవటంతో హెచ్‌డీటీ గౌరీశంకరరావుపై ఏసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చేసరికి డిప్యూటీ తహశీల్దార్ ఆనందరావు లేరు. దీంతో హెచ్డీటీని సమాచారం అడగ్గా లేదని ఆయన చెప్పడంతో మండిపడ్డారు. ఈలోగా అక్కడికి వచ్చిన డీటీ ఆనందరావు మాట్లాడుతూ రఘు అడిగిన పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఇప్పటికే మంజూరు చేశామని చెప్పారు. దానిని వీఆర్వో ఎందుకు ఇవ్వలేదో తనకు తెలియదన్నారు. అవినీతి అధికారుల భరతం పడతాం.. అవినీతి అధికారుల భరతం పట్టడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి చెప్పారు. దాడి అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మరింత చైతన్యం రావల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీలో వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నట్టు ఎక్కవగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ప్రజలు కూడా ఎక్కువగా చిరుద్యోగులపైనే ఫిర్యాదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఉన్నతాధికారుల అవినీతిని బట్టబయలు చేయటానికి కూడా వారు ముందుకు రావాలని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కొత్తవలస: ఆటో-మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక అగ్నిమాపకశాఖ కార్యాలయ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కొత్తవలస ఎస్ఐ ఎస్.ధనుంజయరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన లగుడు రవికుమార్ (30) ఓ శుభకార్యానికి సంబంధించిన కార్డులను పంచుతూ ఎస్.కోట నుంచి మోటార్‌సైకిల్‌పై కొత్తవలస వస్తుండగా కొత్తవలస నుంచి ఎస్.కోటవైపు వెళుతున్న గూడ్స్ ఆటోను ఢీకొన్నాడు. రోడ్డుపై పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు అలమండలోని బాపు విద్యానికేతన్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే అలమండ గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం గ్రామంలో అందరితో సరదాగా గడిపిన రవికుమార్ అంతలోనే రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ టాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మృతుని సోదరుడు వెంకటప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం అలమండ (జామి): రోడ్డు ప్రమాదంలో లగుడు రవికుమార్ మరణించటంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారుడు ముత్యాలనాయుడు(4) కుమార్తె సిమిత (2) ఉన్నారు. అన్నయ్య కుమార్తె రజస్వల శుభకార్య ఆహ్వాన కార్డులను పంచి సాయంత్రానికల్లా ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తెలియగానే వరలక్ష్మి బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు. తండ్రి మరణించాడన్న విషయం తెలియని పిల్లలిద్దరు బిత్తర చూపులు చూడటం అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో అలమండ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
భక్తి ముసుగులో అద్దాల మేడలో అకృత్యాలు!
-
భక్తి ముసుగులో అద్దాల మేడలో అకృత్యాలు!
భక్తి ముసుగులో ఆ అద్దాల మేడలో జరుగుతున్నఅకృత్యాలు బట్టబయలయ్యాయి. ఇంతవరకూ బ్రహ్మపదార్థంలా మిగిలిపోయిన ఆ విలాసవంతమైన భవంతి అసలు బాగోతం వెల్లడయిం ది. రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడేళ్లుగా అక్కడ ఓ పెద్ద భవనంలో ఆశ్రమం నిర్వహిస్తున్నా స్థానికులు ఆ భవనం గేటు దాటి లోపలికి వెళ్లిన దాఖలాలు లేవు. ఎవరో కార్లపై వస్తారు. తెల్లని దుస్తులు ధరించి ప్రార్థనలు చేస్తారు, వెళ్లిపోతారు. ఈ విషయాలు తప్ప స్థానికులకు అక్కడ జరుగుతున్న వ్యవహారాలు తెలీవు. అయితే శుక్రవారం ఆ భవనంలోకి పోలీసులు ప్రవేశించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కొత్తవలస(లక్కవరపుకోట): ‘నేను దేవుడి ప్రతిరూపాన్ని. నాతో రమిస్తే మిమ్మల్ని నేరుగా బాధలు లేని స్వర్గానికి పంపుతాను రండి’ అంటూ ఓ మత ప్రచారకుడు సాగిస్తున్న కీచక పర్వం బట్టబయలైంది. ఈ దురాగతానికి బలైన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అక్కడి అకృత్యాలు వెలుగుచూశాయి. కొత్తవలసలోని సన్‌సిటీ వీధిలో యూదుల ఉద్యాన వన ఆశ్రమం ఉంది. ఆశ్రమం నిర్వాహకుడు దొడ్డి దయాసాగర్ వలలో పడి తాను మోసపోయానంటూ విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస సీఐ సంజీవరావు కేసు నమోదు చేసి ర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌రావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన దొడ్డి దయాసాగర్ అనే వ్యక్తి కొత్తవలస-విజయనగరం రోడ్డులోని హైస్కూల్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న సన్‌సిటీ వీధిలో సుమారు ఏడేళ్ల క్రితం యూదుల ఉద్యానవన ఆశ్రమం ఏర్పాటు చేశారు. అత్యంత విలాసవంతంగా ఉన్న అద్దాల మేడలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 200 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా మత సంబంధ ప్రార్థనలు చేస్తుంటారు. అందమైన అద్దాల మేడలో ఏం జరుగుతోంది ? ఎవరెవరు వస్తారు? ఏం చేస్తారనే విషయాలు స్థానికులెవరికీ పెద్దగా తెలియదు. కాగా, ఈ ఆశ్రమానికి వచ్చిన కొందరు మహిళలను ఆశ్రమ నిర్వాహకుడు అయిన దయాసాగర్ వశపరుచుకున్నాడు. తనతో సంభోగిస్తే నేరుగా స్వర్గప్రాప్తి పొందుతారని చెప్పి అమాయకులైన మహిళలను మోసగించాడు. ఏడుగురు మహిళల తనతో సంభోగం చేస్తే వారికి స్వర్గం ప్రాప్తి కలుగుతుందని ఈ విషయాలన్నీ మత గ్రంథాల్లో ఉన్నాయని నమ్మించాడని మోసపోయిన మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. తాము కూడా ఆశ్రమ నిర్వాహుకుడు దయాసాగర్ చేతిలో మోసపోయినట్లు మరికొంత మంది మహిళా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. దయాసాగర్ రాసలీలలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులను అడ్డుకున్న సభ్యులు పోలీసులు, విలేకరులతో కలిసి భవనంలో ప్రవేశించిన సమయంలో అక్కడి సభ్యులు అడ్డుకున్నారు. ఇతరులు లోనికి రాకూడదని అడ్డుచెప్పడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. సొసైటీ భవనంలో సౌకర్యాలను, విలువైన నిర్మాణాలు, వస్తువులు, అత్యాధునిక హంగులతో లైవ్ కవరేజ్‌కు ప్రత్యేక కెమెరాలు, భవనంలోకి వచ్చే భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన తెల్లని వస్త్రాలు, గ్రానైట్బొమ్మలు, ఖరీదైన ఫర్నీచర్ చూసి పోలీసులకు మతిపోయినంత పనైంది. ఆశ్రమంలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎలాంటి పూజలు చేస్తారు, ఎవరిని అనుమతిస్తారు. ఎలాంటి ప్రసంగాలు ఇస్తారు అనే విషయంపై నిర్వాహకుని సోదరుడు భానుప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆశ్రమం నిర్మాణాన్ని ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారు? ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అన్న విషయాలు అడగ్గా సుమారు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు సంవత్సరాల్లో నిర్మించినట్లు భానుప్రకాష్ తెలిపారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి *ఆరేడు కోట్లు వ్యయమై ఉంటుందని, ఇంతటి విలువైన భవనాలు ఈ ప్రాంతంలో లేవని పోలీసులు తెలిపారు. ఆశ్రమంలో ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంపై అంతస్తులో నిర్వాహకుడు దయాసాగర్ ప్రత్యేకంగా తయారు చేసుకున్న గదిని చూసి పోలీసులకు దిమ్మతిరిగింది. ఈ ఆశ్రమానికి వెళ్లేవారంతా యూదు మతస్తులే అని పోలీసు దర్యాప్తులో తేలింది. భవన నిర్మాణానికి, నిర్వహణకు విదేశీ నిధులు వస్తున్నాయా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికులు ఏమన్నారంటే ఆశ్రమం కట్టింది మొదలు బయట వాళ్లెవ్వర్నీ లోనికి అనుమతించలేదని స్థానికులు తెలిపారు. యూదు మతస్తులు మాత్రమే వెళ్తుంటారని, పెద్ద కార్లలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోతుంటారని చెప్పారు. ఆశ్రమానికి వచ్చే వారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారు తమ సంపాదనలో 10 శాతాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తున్నారని చెప్పారు. లోపల ఏం జరుగుతుందో ఎంత మంది ఉంటారో తమకు ఏమీ తెలీదని చెప్పారు. ఇప్పుడు పోలీసులు వచ్చాక అన్నీ తెలుస్తున్నాయని, దయాకర్‌కు స్థానిక నాయకులు, పెద్దోళ్లందరితో పరిచయాలు ఉన్నాయని చెప్పారు. ఆరోపణల్లో వాస్తవం లేదు ... మహిళ ఇచ్చిన ఫిర్యాదు వెనుక కొంతమంది కుట్ర ఉందని ఆశ్రమ నిర్వాహకుడు దయాకర్ భార్య వాసవి చెప్పారు. తమ మతానికి చెందిన 200 మంది ఆశ్రమంలో సభ్యులుగా ఉన్నారన్నారు. వీరిలో కొంతమంది తమ మతాచారానికి విరుద్ధంగా వ్యవహరించడంతో బహిరంగంగా ప్రకటన ఇచ్చి 11 మందిని తొలిగించినట్టు చెప్పారు. అలా తొలగించిన వారిలో కొందరు ఈ కుట్ర చేస్తున్నారు, వారిని పరమ తండ్రే చూసుకుంటారని ఆమె తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. -
‘మీరే వేసే ప్రతీ ఓటు జగనన్న కోసమే’