ఆటోబోల్తా 12 మందికి గాయాలు | 12 injured in Road accident | Sakshi
Sakshi News home page

ఆటోబోల్తా 12 మందికి గాయాలు

Published Wed, Jul 13 2016 11:29 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

12 injured in Road accident

 కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి ఫ్లైఓవర్‌బ్రిడ్జి మలుపులో బుధవారం ఆటో బోల్తాపడి 12మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో బూసాల రాము(35) పి.శిరీష(32), దమరశింగి సంతోష్(30), ఆర్.లక్ష్మి, డి.దేవి, బి.ఈశ్వరమ్మ38) ఉన్నారు.
 
 బూసాల అక్కమ్మ(48) డి.పైడితల్లి(36)కె.హేమ(38) కె.నరసమ్మ(22) డి.లక్ష్మి(48) పి.కమల(28) స్వల్పంగా గాయపడ్డారు. వీరితోపాటు ఆటోడ్రైవర్ గొల్లు నాయుడుకు గాయపడ్డాడు. క్షతగాత్రులంతా నరపాం గ్రామానికి చెందినవారే. వీరు విశాఖజిల్లా పురుషోత్తపురం సమీపంలోఉన్న ఎస్‌ఎస్‌ఎఫ్ ఫిషరీస్(రొయ్యలకంపెనీ)లో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకని బయలుదేరి ఫ్లైవర్‌పై నుంచి దిగుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసిని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనేఉన్న గోతులో ఆటో బోల్తాపడింది. కొందరికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు బి.రామారావు, టి.పేరిందేవి చికిత్స చేశారు.
 
 లారీ ఢీకొని మరో ఇద్దరికి..
 దాసుళ్లపాలెం(లక్కవరపుకోట): దాసుళ్లపాలెం సమీపంలోని చెరువు మలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ట్రైనీ ఎస్సై తమ్మినాయుడు అందించిన వివరాలు ప్రకారం.. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన బోర్‌వెల్ లారీ దాసుళ్లపాలెం నుంచి ద్విచక్రవాహనంపై గాంధీనగర్‌కు చెందిన వై.అప్పారావు, పి.ఈశ్వరావులు  వస్తుండగా వెనునుంచి వస్తున్న లారీ ఢీకొంది.  క్షతగాత్రుడు అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై తెలిపారు.
 
 మరో ముగ్గురికి..
 డెంకాడ: విజయనగరం - నాతవలస రహదారిపై చందకపేట వద్ద పూసపాటిరేగ జెడ్పీటీసీకి చెందిన కారు మోటారు సైకిల్‌పై వెళ్తున్న డెంకాడ కానిస్టేబుల్ నల్లా శ్రీనివాసరావును ఢీకొంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అలాగే పెదతాడివాడ జంక్షన్ సమీపంలో ఆటో, రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.  పెదతాడివాడ గ్రామానికి చెందిన సారిక శంకరరావుతో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు  హెచ్‌సీ అప్పారావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement