వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పునఃప్రారంభం | YSR Telangana Party Chief YS Sharmila Begin Praja Prasthanam Padayatra | Sakshi
Sakshi News home page

వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పునఃప్రారంభం

Published Fri, Mar 11 2022 2:18 AM | Last Updated on Fri, Mar 11 2022 2:18 AM

YSR Telangana Party Chief YS Sharmila Begin Praja Prasthanam Padayatra - Sakshi

 గతంలో వాయిదాపడ్డ కొండపాకగూడెం నుంచే పాదయాత్ర మొదలు   

సాక్షి, హైదరాబాద్‌/నల్లగొండ టూటౌన్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శుక్రవారం తన ప్రజాప్రస్థానం పాదయాత్రను నల్లగొండ జిల్లా కొండపాక గూడెం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. గతేడాది అక్టోబర్‌ 20న చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర కొండపాకగూడెం వరకు సాగి వాయిదాపడిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు కొనసాగిన పాదయాత్ర మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడం, కరోనా ఉధృతి పెరగడంతో 2021 నవంబర్‌ 9న వాయిదా వేశారు.   

నేటి పాదయాత్ర షెడ్యూల్‌..: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపాక గూడెం చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్‌పల్లి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఎడవెల్లికి, తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్‌రోడ్డుకు చేరుకుని ప్రజలతో మాట్లాడతారంటూ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement