శ్రీకాకుళంలో భారీ చోరీ!
Published Thu, Aug 15 2013 2:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ-ఎ కాలనీలో ఉంటున్న అంధవరపు గోవిందరాజులు ఇంట్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ... గోవిం దరాజులు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి, అక్కడ నుంచి బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. రోజూ పనిమనిషి వచ్చి ఇంటి చుట్టూ శుభ్రం చేసి వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఉద యం వచ్చే సరికి కిటికీ గ్రిల్ తొలగించి ఉండడం, ఇం టితలుపు తెరిచి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. వారు వచ్చి చూసి గోవిం దరాజులకు సమాచారం అందించారు. ఆయన ఇచ్ఛాపురంలో ఉన్న తన కుమారుడు నాగేశ్వరరావు, శ్రీకాకుళంలో ఉన్న సోదరుడు శ్రీనివాసరావుకు విషయం తెలియజేశారు.
వారు ఇంటి వద్దకు వచ్చి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సెలవులో ఉండడంతో సీఐ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇంట్లో బీరువాలను కానీ, మరే సామాగ్రిని కానీ విరగ్గొట్టకపోగా అలమరాలన్నింటినీ తెరిచి అందులో ఉన్న వెండి, బంగారం వస్తువులను తీసుకువెళ్లారని యజమాని బంధువులు చెబుతున్నారు. దేవుడి గదిలో వెండి వస్తువులు ఉన్నా వాటిని తీసుకువెళ్లలేదు. వస్తువులు ఉన్న అలమరాలను మాత్రమే తెరవడం వల్ల ఇది తెలిసిన వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దొంగలే ఈ పని చేసి ఉంటే విలువైన వస్తువులన్నింటినీ తీసుకువెళ్లిపోయేవారని, అలా కాకుండా కొన్నింటినే తీసుకువెల్లడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. సుమారు 17 కేజీల వెండి, 12 తులాల బంగారం చోరీకి గురై ఉండవచ్చునని యజమాని బంధువులు చెబుతున్నారు. సీఐ ఎం.మహేశ్వరరావు మాత్రం దీనిని నిర్ధారించడం లేదు. దేవుడి గదిలో ఉన్న వస్తువులు కూడా పోయి ఉంటాయని భావించి వారు అలా చెప్పి ఉండవచ్చునని దేవుడి గదిలో ఏ వస్తువు పోలేదన్నారు. యజమాని వచ్చి నిర్ధారించి లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే కానీ ఖచ్చితంగా ఎంత పోయింది చెప్పలేమన్నారు. రూరల్ హెచ్‌సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement