తెలుగుదేశం పార్టీ సీడబ్ల్యూసీ-2 లాగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు.
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీడబ్ల్యూసీ-2 లాగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందన్నారు. కాంగ్రెస్ను వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనను ఆదరించిన తెలుగు ప్రజలను రెండుగా విభజించారన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కడప ఎంపి జగన్మోహన రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ రాజీనామాలు చేయడం హర్షనీయం అని జూపూడి అన్నారు.