
'ఎన్నికల్లో మాకు వచ్చిన సీట్లను భిక్షంగా వేస్తాం'
ప్రకాశం: యూపీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విడగొట్టడానికి యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. అందరి అభిప్రాయం తీసుకున్నాక రాష్ట్రాన్ని విభజన జరుగుతుందన్న కాంగ్రెస్ మాటల్లో వాస్తవం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు పూనుకున్నారన్నారు. ప్రకాశం జిల్లా కొండేపిలో గురువారం జూపూడి దీక్ష విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అధికారం కట్టబెట్టడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడానికి పూనుకుంటే వచ్చే ఎన్నికల్లో తమకు వచ్చిన సీట్లను భిక్షంగా వేస్తామన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చీల్చడానికి మగ్గు చూపురని ఆయన విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు, రామోజీరావు, కాంగ్రెస్ నేతలు కలిసి నాటకాలు ఆడుతున్నారని జూపూడి తెలిపారు.