
'చంద్రబాబు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలి'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలని వైఎస్సార్ సీపీ అధికారి ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. బాబు గారు చెప్పే కాకి లెక్కలకు దేశంలో అవినీతి తగ్గుతుందా అని ప్రశ్నించారు. ఆయన ఆస్తులు ఎక్కడున్నాయో కనుక్కోవాల్సిన బాధ్యత ప్రజలకు లేదని జూపూడి తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం గురువింద గింజ సామెతను గుర్తుకుతెస్తోందన్నారు.
ప్రస్తుతం చూపెడుతున్న చంద్రబాబు ఆస్తుల విలువను ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటన్నారు. ఆయన తనయుడు లోకేష్ ఆస్తుల ఎలా పెరిగాయో బాబుగారు ఇప్పడి వరకూ చెప్పలేదని జూపూడి ప్రశ్నించారు.