
'చంద్రబాబు సీడబ్యూసీ-2 గా వ్యవరిస్తున్నారు'
విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీడబ్యూసీ-2గా వ్యవరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్ర కాంగ్రెస్ ను బతికించడానికేనని జూపూడి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డినేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కుట్రలకు రాష్ట్రం బలైపోయిందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఏదైనా పోరాడి సాధిద్దామని అన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో బాబు యాత్ర ఎలా చేస్తారని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తోంది.