న్యూఢిల్లీ : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో టీడీపీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్‌కు కనీస ఇంగిత జ్ఞానం, పరిజ్ఞానం, నియమ నిబంధనలు తెలియవంటూ ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటును ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి ఢిల్లీకి తీసుకెళ్లిన జూపూడి మీడియాతో మాట్లాడుతూ ఈసీపై ఫైర్ అయ్యారు. ఒక పార్టీ ఫిర్యాదు చేస్తే కనీసం పరిశీలించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు రక్షణ బాధ్యతలు చూసుకునే ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లును ఎలా బదిలీ చేస్తారన్నారు. అసలు ఆయనపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని, ఇంటలిజెన్స్ చీఫ్ ఎన్నికల పరిధిలోకే రాడన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందని, ఆయన జెడ్ కేటగిరి సంరక్షణలో ఉన్నారని తెలిపారు. అలాంటి సీఎం భద్రతను చూసే అధికారిపై వేటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక ‘ఏబీ’ని కాపాడేందుకు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం హడావుడిగా వివాదాస్పద జీవో జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment