ఏబీ వెంకటేశ్వరరావు-బత్తిన శ్రీనివాసులు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బత్తిన శ్రీనివాసులు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి వేటు వేయడంతో ఆయన స్థానంలో తక్షణం మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. దీంతో డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ఆత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ డీజీతో సహా వైఎస్సార్ కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం స్థానాల్లో తక్షణం ఎవరిని నియమించాలనే విషయమై అత్యవసర భేటీలో చర్చ జరిగిందని సమాచారం. చదవండి....(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు)
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల సీనియారిటీ తదితరాలను పరిశీలించిన నేపథ్యంలో ఎస్‌ఐబీ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బత్తిన శ్రీనివాసులును...ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో నియమించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నవారిలో సీనియార్టీ ప్రకారం జయలక్ష్మి ఉన్నప్పటికీ అన్ని విభాగాలను కలిపితే శ్రీనివాసులు సీనియర్ అవుతారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అనుభం కూడా ఉన్నందున ఆయన ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆయనను పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment