తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి | fulfill your parents assets | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి

Published Wed, Jan 1 2014 4:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

fulfill your parents assets

 మదనపల్లెరూరల్, పుంగనూరు, న్యూస్‌లైన్:
 ‘మీరంతా ఇంజినీర్లు కావాలి. చదవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు అందజేస్తా. తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా 150 మైలు వద్ద ఆదిత్య, భారతి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో ముచ్చటించారు. యువత చేతిలోనే దేశ భవిత ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రాన్ని రెండుగా చీల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని సూచిం చారు. అనంతరం వలసపల్లె సమీపంలో దందాల రవీంద్రారెడ్డి, తిమ్మయ్యగారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మదనపల్లె మార్గం లో ములకలదిన్నె, గంగమ్మగుడి, డ్రైవర్స్ కాలనీ, బసినికొండ బైపాస్‌రోడ్డు, బసినికొండ దర్గా, ఈస్ట్‌పేట, నిమ్మనపల్లె క్రాసు, చిత్తూరు బస్టాండు మీదుగా బహిరంగ సభకు వెళుతున్న జగన్‌కు జనం నీరాజనాలు పలికి పూలవర్షం కురిపించారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి, భారతి కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్‌రెడ్డి, మైనారిటీ నాయకులు బాబ్‌జాన్, సిలార్‌ఖాన్, మదన్‌మోహన్‌రెడ్డి, గంగుల్‌రెడ్డి, రెడ్డెప్ప, సుబ్బయ్యనాయుడు, ఎస్‌ఏ.కరీముల్లా, అశోక్‌రెడ్డి, రాజన్న, పాపయ్య, సయ్యద్‌బాషా, డాక్టర్ బసిరెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, వైజయంతి, లతీఫ్, తిమ్మాపురం బాబు, గౌస్, కమాల్‌ఖాన్, ఇందిరానగర్‌గౌస్, నిషాద్, నూరు, చిప్పిలి జగన్నాథరెడ్డి, ఎస్‌రిజ్వాన్ పాల్గొన్నారు.
 
 పుంగనూరులో..
 జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహిస్తూ.. మదనపల్లెకు బయల్దేరారు. మార్గమధ్యంలో ముస్లిం మైనారిటీల నాయకుడు ఖాదర్‌ఖాన్ ఇంటికి వెళ్లి ముస్లిం నేతలను కలుసుకున్నారు. పారిశ్రామికవేత్త ఆర్‌వీటీ.బాబు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్‌షో సాగింది. మంగళంక్రాస్, బోడినేపల్లె క్రాస్, ఉలవలదిన్నె, రాంపల్లె, భీమగానిపల్లె, పూజగానిపల్లె, సుగాలిమిట్ట, అక్కింవారిపల్లె క్రాస్, ఈడిగపల్లె, చండ్రమాకులపల్లె క్రాస్ వరకు సాగింది. మార్గమధ్యంలో మంగళంక్రాస్ వద్ద ఎంపీటీసీ మాజీ సభ్యులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు, విద్యార్థులు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. సుగాలిమిట్ట వద్ద వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూజగానిపల్లె, సుగాలిమిట్ట చర్చిల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రార్థనలు చేశారు. నూతన సంవత్సర కేక్‌ను కట్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement