కుప్పంలో టీడీపీ కోటకు బీటలు | YS Jagan Shakes Chandrababu Naidu's empire | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ కోటకు బీటలు

Published Sun, Dec 1 2013 12:48 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

కుప్పంలో టీడీపీ కోటకు బీటలు - Sakshi

కుప్పంలో టీడీపీ కోటకు బీటలు

కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు వారాయి. సమైక్యశంఖారావం, ఓదార్పుయాత్రలో భాగంగా శని వారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి కుప్పానికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. కుప్పం బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.సుబ్రమణ్యంరెడ్డి టీడీపీ నేతల పేర్లు పిలుస్తుండగా వారు వేదికపైకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. 
 
ఇందులో రామకుప్పం మండలానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఆరేళ్ల జయప్ప, మాజీ మండలాధ్యక్షు డు ఆంజనేయప్ప, కుప్పం మండలం మల్లానూరు మాజీ సర్పంచ్ గుణశేఖర్‌నాయుడు, నియోజకవర్గ కార్మిక నాయకులు రంగయ్య, ఎన్.కొత్తపల్లె, గెరిగశీనేపల్లె సర్పంచ్‌లు నాగరాజు, మన్నప్పయ్య, దాసేగానూరు మాజీ సర్పంచ్ తిమ్మోజీగౌడ్, టీడీపీ కుప్పం మండల మాజీ అధ్యక్షులు సుబ్రమణ్యం, నూలుకుంటకు చెందిన రెస్కో రిటైర్డ్ ఉద్యోగి రామప్ప, విజలాపురం బాబు, వెంకటేష్, వెంకటరామయ్య, రామచం ద్ర, నారాయణప్ప, నాగరాజు, గణేష్ వైఎస్సార్ సీపీలో చేరారు. కుప్పంలో జగన్‌ను చూడడానికే రావద్దని చంద్రబాబు పిలుపునిచ్చినా జనం భారీగా తరలివచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.
 
 కనీస గుర్తింపు లేదు
 సమైక్యశంఖారావం సభలో ఆరేళ్ల జయప్ప మాట్లాడుతూ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి ముప్పై ఏళ్లుగా సేవ చేశానని, బీసీ నాయకుడుగా, కురబకుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు ఆ పార్టీలో కనీసం గుర్తింపుకూడా లేకుండా పోయిందని   రామకుప్పం మండల మాజీ ఎంపీపీ ఆరేళ్ల జయప్ప ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement