చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చిన్ననాటి స్నేహితుడు ప్రతాప్ రెడ్డిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జొన్నగురుకులలో నివాసం ఉంటున్న ప్రతాప్ రెడ్డిని పరామర్శించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జొన్నగురుకుల మీదుగా అరగొండ వెళ్లి వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని జగన్ దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్తో పాటు స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు.