
జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా
* రెండు రోజుల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
* 20 నుంచి నగరిలో పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మెడనొప్పి తగ్గకపోవడంతో సమైక్య శంఖారావం యాత్ర మరో రెండు రోజులు వాయిదా పడింది. నొప్పి కారణంగా ఇప్పటికే ఆయన తన యాత్రను ఈ నెల 18కి వాయిదా వేసుకున్న విషయం విదితమే. శుక్రవారం మధ్యాహ్నం జగన్‌ను పరీక్షించిన అపోలో ఆసుపత్రి వైద్యులు మరో రెండు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు.
దీంతో ఈ నెల 20న చిత్తూరు జిల్లా నగరి నుంచి యాత్ర పునఃప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. 20వ తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో బయలుదేరి వెళ్లి నగరి నియోజకవర్గంలో యాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.